Take a fresh look at your lifestyle.

కొరోనా వైరస్ నివారణకు స్వీయ క్రమ శిక్షణ యే శ్రీ రామ రక్ష..!

  • ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ మీడియా సమావేశం
ఈ కరోన వైరస్ సంబంధించి నిన్న కరీంనగర్ జరిగిన ఉదంతం దృష్ట్యా ఇవాళ అన్ని జిల్లాల పోలీస్,కలెక్టర్ లను పిలిచి ఏవిధంగా ఉండాలని ఆదేశాలు ఇవ్వడం జరిగిందని ముఖ్య మంత్రి కె.చంద్ర శేఖర రావు అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్లు,ఎస్పీ లతో  కొరో నా వైరస్ పై అత్యవసర సమావేశం నిర్వహించి పరిస్థిని సమీక్షించారు.ఆ తరువాత హైదరాబాద్ లో అందుబాటులొ ఉన్న మంత్రులతో కలిసి మంత్రి వర్గ సమావేశం నిర్వహించారు.సమీక్ష వివరాలను మీడియా కు తెలియజేశారు.సీ ఎం కెసీఆర్ మీడియా కు వివరిస్తూ..”ఇప్పటివరకు మన రాష్ట్రంలో 14 కేస్ లు నమోదు అయ్యాయి ఇందులో 5 మాత్రమే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగారు మిగతా వారు అంత ఇతర మార్గాల ద్వారా వచ్చారు..కరీంనగర్ వచ్చిన వారు మత ప్రచారం కోసం వచ్చారు వారిని అందరిని మన డాక్టర్ ల ఆధీనంలో ఉన్నారు.
చైనా పక్కనే ఉన్న వియత్నాం చైనా లో వచ్చిన తరువాత కట్టడి చేసుకున్నారు కానీ ఇటలీ మాత్రం కట్టడి చేయలేకపోయారు.అయితే ఇవ్వన్నీ అన్నిటినీ దృష్టిలో ఉంచుకొని మార్చ్ ఒకటవ తేదీ నుండి ఇతర దేశాల నుండి వచ్చిన వారు వారికి వారే సరెండర్ కావాలి లేదంటే మా పోలీస్ శాఖ వారిని గుర్తిస్తుంది.
ఇప్పటికే అన్ని గ్రామాల్లో పోలీస్ అధికారులను నియించారు కాబట్టి ఇబ్బందులు లేవు
వారికి వారు వచ్చి జాయిన్ కావాలి.బహిరంగ సమావేశాలు,సభలు,ర్యాలీ లు అనుమతి లేదు, దేవాలయలు,మజీద్ లు,చర్చి లు ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతి ఇవ్వదు.మనుషులను ఎట్టిపరిస్థితుల్లోనూ రనివ్వవద్దు ఒక్కదగ్గర మనుషులు జమ కావద్దు. ఈనెల 22 తేదీ నాడు ముస్లిం పండుగ ఉంది దాన్ని కూడా వద్దు” అని చెప్పారు.ఉగాది ,శ్రీరామ నవమి వేడుకలు కూడా రద్దు చేశాం వాటిని లైవ్ ద్వారా చూడవచ్చు అని అన్నరు.
పబ్లిక్ సర్వీస్ లలో శానిటైజర్ ఎక్కువగా వాడాలి..
గ్రామాల్లో,మండలాల్లో శానిటేషన్  పెంచాలి,విదేశలా నుండి వచ్చిన వారిని గుర్తించి హోమ్ క్వారైటైన్ పెట్టడం జరుగుతుంది.ఒకవేళ ఎవరైనా ఇండ్లలో హోమ్ క్వారయింటైన్ వెళ్తాము అంటే పంపిస్తాం అంతేకాదు వారిపై ఎల్లప్పుడూ నిఘా ఉంటుంది.
విదేశాల నుండి ఎవరు వచ్చిన హోమ్ క్వారయింటైన్ లో ఉంచేలా హెల్త్ డిపార్ట్మెంట్ ఆదేశాలు జారీ చేశామన్నారు.

- Advertisement -

మనకు చాలా బార్డర్ లు ఉన్నాయి రైల్వే ఎక్కువగా ఉంది ఇప్పటికే సౌత్ సెంట్రల్ రైల్వే తో మాట్లాడము
రేపు ముఖ్యమంత్రి లతో పీఎం వీడియో కాన్ఫరెన్స్ ఉంది దాన్ని పీఎం చెప్తామన్నారు.మన రాష్ట్రంలో ఉన్న ఇతర రాష్ట్రాల బార్డర్ లో చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసి ప్రతి వాహనం ను చెక్ చేసి అందులో విదేశాల నుండి వచ్చిన వారిని హోమ్ క్వారన్తటైన్ లో ఉంచుతామన్నారు.ఇప్పటివరకు మన రాష్ట్రంలో వైరస్ వచ్చిన వారు మాత్రం ఇతర దేశాల నుండి వచ్చిన వారు మాత్రమే ఉన్నారన్నారు.
*10వ తరగతి పరీక్షలు యధావిధిగా కొనసాగుతాయి*
10వ తరగతి పరీక్ష కేంద్రాల్లో ఎక్కువగా శానిటైజ్ చేయాలని చెప్పామనీ..ఒక వారం రోజులు గడిస్తే పరీక్షలు అయిపోతాయని..95 శాతం తల్లిదండ్రులు పరీక్షలు నిర్వహించాలన్న అభిప్రాయం తో ఉన్నారన్నారు.
ఇతర జాగ్రత్తలు,తీసుకున్న చర్యలను వివరిస్తూ..
కృత్రిమ కొరతలు సృష్టిస్తే కఠిన చర్యలు, ఎక్కడ కూడా షాప్స్ క్లోజ్ చేయటం లేదు..జనస మూహం ఉండకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.
ప్రజలకు విజ్ఞప్తి జనసమూహం ఉండకుండా చూడండి..ఎలాంటి పరిస్థితి నైనా ఎదుర్కొనే శక్తి ఉంది..అన్ని పెళ్లి మంటపాలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశాం..ప్రభుత్వ కార్యాలయాల లో యధావిధిగా విధులు కొనసాగుతకొనసాగుతాయని ముఖ్య మంత్రి కె సీ ఆర్ తెలిపారు.

Leave a Reply