కరోనా వైరస్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కలిసి కట్టుగా పాటు పడాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి త్రాగు నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మంగళవారం ఎంజిఎం ఆసుపత్రిలో పని చేస్తున్న వైద్యులకు సిబ్బంది వ్యక్తిగత పరిరక్షణ (పిపిఈ) కిట్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడ తూ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జిల్లా కలెక్టర్ కరోనా కట్టడికి బాగా పని చేస్తున్నారని కొనియా డారు. పోలీస్ వైద్యులు, పారిశ్ధ్యు పనులు యేనలేని కృషి చేస్తున్న వారందరికీ సాల్యుట్ చేస్తున్నట్లు చెప్పారు. కొత్త కేసులు లేవని డిల్లీ మార్కజ్ ఘటన లో సుమారు 30 పాజిటివ్ కేసులు నమోదు కాగా కొందరు డిశ్చార్జి అయ్యా రని చెప్పారు. ఈ విపత్కర పరిస్థితిల్లో ప్రైవేటు ఆసుపత్రి యజమానుల సేవలు అందించడానికి ముందుకు రాకున్నా ప్రభుత్వ వైద్యులు సిబ్బంది కంటి రెప్పల కాపాడుతున్నారన్నారు. ప్రజలలో ఎంజిఎం సేవల పట్ల నమ్మకం పెరిగి చరిత్రలో నిలిచిపోయే విధంగా సేవలందిస్తున్నారని కొనియాడారు. నూతనంగా మంజూరైన వైరాలిజి ల్యాబ్ ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లా లకు సంబంధించిన 500 నమూనాలను పరీక్షించగా ఖమ్మం జిల్లా లో ఒక పాజిటివ్ కేసు నమోదు కాగా మిగతా 499 నమూనాలు నెగెటివ్ వచ్చినట్లు మంత్రి పేర్కొన్నారు. కరోనా కట్టడి నేపథ్యంలో చికిత్స సందర్భంగా వైద్య సిబ్బందిపై దాడులు చేసిన వారిపై తప్పుడు మాటలు మాట్లాడినా అవసరమైతే జైలుకు పంపిస్తామని మంత్రి హెచ్చరించారు. లాక్ డౌన్ మే 7వరకు కొనసాగుతుందని, లాక్ డౌన్ ఇంకా కఠినంగా అమలు చేస్తామన్నారు. ఎవ్వరూ కూడా బయటికి రావద్దని కరోనా కట్టడికి లాక్ డౌన్ మాత్రమే ఆయుధం అందుకు ప్రజలందరూ సహకరించా లని కోరారు.లాక్ డౌన్ సందర్భంగా జిల్లాలో టెలీమెడిసిన్ఏర్పాటు చేసినందున ఆరోగ్య సమ స్యలు నివృత్తి చేసుకోవాలని ప్రజలను కోరారు.
ఎంజిఎం అభివృద్ధికి ప్రాధాన్యత :
హైదరాబాద్ తర్వాత వరంగల్ మహానగరంలో వైద్య సేవలు పూర్తి స్థాయిలో అందించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కెసిఆర్ ఎన్ని నిధుల లైన మంజూరు చేసేందుకు సిద్దంగా ఉన్నారన్నారు. క్యాబినెట్ సమావేశం లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలను కొనసాగించేందుకు ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటల్స్ కంటే మిన్నగా గచ్చి బౌలి క్రీడా ప్రాంగణంలో 750 పడకల ఆసుపత్రి టీమ్స్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారన్నారు. రానున్న రోజుల్లో ఎంజిఎం ఆసుపత్రి కూడా మరింత అభివృద్ది చేసే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం ఉన్న జైలును ఇతర ప్రాంతాలకు తరలించి ఆధునిక ఆసుపత్రి నిర్మాణం చేసేందుకు నిధుల కొరత లేదని చెప్పారు. ఎంజిఎం అభివృద్ధికి మొదటి ప్రాధాన్యత ఇస్తానని అన్ని శాఖల బాధ్యుల తో సమాలోచన జరిపి ఆదర్శంగా తీర్చి దిద్దేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. గత 20ఏళ్ల లో ఎంజిఎం అభివృద్ధికి ఎంతో కృషి చేశానని విదేశాలలో ఉన్న స్నేహితులతో అభివృద్ధికి ఎంతో కృషి చేసినట్లు అప్పటి ప్రభుత్వం కూడా సరైన నిధులు మంజూరు చేయలేక పోయినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్, వరంగల్ ఎంపి పసునూరి దయాకర్, మేయర్ గుండా ప్రకాష్, మున్సిపల్ కమిషనర్ పమేలా సత్పతి, కెఎంసి ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్య, ఎంజిఎం సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.