Take a fresh look at your lifestyle.

మున్సిపల్‌ ‌పోరులో అధికార వైసీపీ సత్తా

అన్నిచోట్లా అధికార పార్టీకి ప్రజల పట్టం
విజయవాడ, నవంబర్‌ 17 : ఆం‌ధ్రప్రదేశ్‌లో జరిగిన మున్సిపల్‌ ‌పోరులో అధికార వైసీపీ తన సత్తా చాటుకుంది. టీడీపీ కంచుకోటగా ఉన్న స్థానాల్లో వైసీపీ పాగా వేయగా.. మంత్రులు స్వగ్రామం, నివాసముండే ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసింది. మరికొన్ని చోట్ల రీకౌంటింగ్‌ ‌జరిపినా రెండోసారీ టీడీపీ అభ్యర్థే గెలవడం గమనార్హం. ఇంకొన్ని చోట్ల రీ కౌంటింగ్‌లో ఒకట్రెండు ఓట్ల తేడాతో వైసీపీ గెలిచింది. కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ, వైసీపీ నువ్వా-నేనా అన్నట్టుగా సాగుతున్నాయి. మొత్తం 29 వార్డులకు 15 వార్డుల కౌంటింగ్‌ ఇప్పటి వరకూ పూర్తయ్యింది. 15 వార్డులకు గానూ.. 8 వార్డులను టీడీపీ కైవసం చేసుకుంది. 7 వార్డులను వైసీపీ కైవసం చేసుకోగా.. 1 వార్డులో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. కృష్ణా జిల్లా జగయ్యపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ మధ్య పోటా పోటీ నెలకొంది. జగయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కౌంటింగ్‌ ‌సెంటర్‌ ‌వద్ద హాల్‌చల్‌ ‌చేశారు. 13వ వార్డులో టీడీపీకి మెజార్టీ రావడంతో మళ్ళీ రీ కౌంటింగ్‌ ‌చేయాలని ఉదయభాను డిమాండ్‌ ‌చేశారు. కౌంటింగ్‌ ‌సెంటర్‌కు ఎమ్మెల్యే సామినేని ఉదయభాను రావడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ ఏజెంట్లను బెదిరింపు ధోరణిలో ఉదయభాను వ్యహరిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. మరోవైపు జగ్గయ్యపేట మున్సిపాలిటీలో మొత్తం 31 వార్డులకు గాను… 16వార్డుల కౌంటింగ్‌ ‌పూర్తి అయ్యింది. 16వార్డుల్లో 8 వార్డులను టీడీపీ కైవసం చేసుకుంది. అలాగే 8 వార్డులో వైసీపీ విజయం సాధించింది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మున్సిపల్‌ ఎన్నికలో ఓ విచిత్రం చోటుచేసుకుంది. నాలుగో వార్డు నుంచి టీడీపీ అభ్యర్థి ఘన విజయం సాధించారు. దీంతో అప్పటి వరకూ కౌంటింగ్‌ ‌కేంద్రం వద్ద ఉన్న వైసీపీ అభ్యర్థి దిగాలుగా ఇంటికెళ్లిపోయారు. అయితే ఇంటికెళ్లాక ఏం జరిగిందో.. ఎక్కడ్నుంచి ఫోన్‌లు వచ్చాయో తెలియట్లేదు కానీ.. రెండు గంటల తర్వాత కౌంటింగ్‌ ‌కేంద్రం దగ్గరికొచ్చి హడావుడి మొదలుపెట్టారు.

గెలిచింది టీడీపీ కాదు.. ఇదంతా తప్పుగా కౌంటింగ్‌ ‌జరిగిందని.. మళ్లీ రీ కౌంటింగ్‌ ‌నిర్వహించాల్సిందేనని డిమాండ్‌ ‌చేయసాగారు. జగ్గయ్యపేట మున్సిపాలిటిని కైవసం చేసుకునేందుకు వైసీపీ చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసుకుంటూ వస్తోంది. రాష్ట్రంలో ఇన్ని చోట్ల ఎన్నికలు జరిగినా ఎక్కువగా కుప్పం, జగ్గయ్యపేట మున్సిపాలిటీల గురించే ఎక్కువ చర్చ జరిగింది. ఇప్పటి వరకూ జగ్గయ్యపేట టీడీపీకి కంచుకోటలాగా ఉంటూ వస్తోంది. అయితే ఆ కోటను బద్దలు కొట్టాలని ఎ•-లాన్‌ ‌చేసిన వైసీపీ ఇవాళ కౌంటింగ్‌ ‌మొదలుపెట్టినప్పట్నుంచీ అంతా ’తారుమారు’ రాజకీయాలు చేస్తోంది. ఇప్పటి వరకూ వెల్లడయిన ప్రతి వార్డు ఫలితంపైనా పెద్ద వివాదమే జరిగింది. తాజాగా.. 13వ వార్డుకు సంబంధింంచి రీ కౌంటింగ్‌ ‌చేయాలని ఓడిన వైసీపీ అభ్యర్థి పట్టుబట్టారు. అయితే.. అధికారులు కూడా దీనిపై స్పందించి రీ కౌంటింగ్‌ ‌నిర్వహించారు. ఉన్నతాధికారులు, అధికార పార్టీ పెద్దల నుంచి ఒత్తిళ్లు వచ్చాయేమో తెలియట్లేదు కానీ.. కౌంటింగ్‌ ‌కేంద్రంలోని అధికారులు ఒక్కసారిగా ఓట్లు తారుమారు చేశారు. అయితే.. జిల్లా ఉన్నతాధికారులు, కలెక్టర్‌, ‌సబ్‌ ‌కలెక్టర్‌కు టీడీపీ అభ్యర్థి, నేతలు ఫిర్యాదు చేయడంతో ఒక్కసారిగా సీన్‌ ‌మారిపోయింది. ఈ విషయంలో తెలుసుకున్న సబ్‌ ‌కలెక్టర్‌ ‌చివరి నిమిషంలో కౌంటింగ్‌ ‌కేంద్రంలోకి ప్రవేశించడంతో అధికారులు అప్రమత్తమే ఇక చేసేదే లేక.. టీడీపీ అభ్యర్థే గెలిచినట్లు ప్రకటించేశారు. మరోవైపు.. నాలుగో వార్డులో వైసీపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థిపై.. టీడీపీ అభ్యర్థి సూర్యదేవర ఉషారాణి 14 ఓట్లతో గెలిచినట్లు అధికారికంగా ఎన్నికల అధికారులు ప్రకటించేశారు. అనంతరం ఇరుపక్షాల ఏజెంట్లు సంతకాలు చేయటంతో గెలిచిన, ఓడిన అభ్యర్థులు ఇద్దరూ కౌంటింగ్‌ ‌కేంద్రం నుంచి వెళ్లిపోయారు. అయితే రెండు గంటల తర్వాత మళ్లీ కౌంటింగ్‌ ‌కేంద్రానికి వచ్చి రీ కౌంటింగ్‌ ‌చేయాలని వైసీపీ అభ్యర్థి పట్టుబట్టారు. దీనిపై అధికారులు స్పందిస్తూ.. డబుల్‌ ‌డిజిట్‌ ‌మెజారిటీ వస్తే కలెక్టర్‌ అనుమతి ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. దీంతో రీకౌంటింగ్‌ ‌చేయాలని కౌంటింగ్‌ ‌కేంద్రంలో వైసీపీ అభ్యర్థితో పాటు మిగతా అభ్యర్థులు, స్థానిక నేతలు ధర్నాకు దిగారు. ఇప్పటి వరకూ తెలుగుదేశం- 8, వైసీపీ- 8 స్థానాల్లో అభ్యర్థులు గెలుపొందారు.

Leave a Reply