Take a fresh look at your lifestyle.

చట్టాలను చేసే అధికారం అసెంబ్లీలకు లేదు

nrc delhi peoples, congress party, app party, poura chattam, javadekar
పార్లమెంట్‌ ‌చట్టాలను అమలు చేయాల్సిందే
కేంద్రమంత్రి రవిశంకర్‌ ‌ప్రసాద్‌ ‌స్పష్టీకరణ

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ని రాష్టాల్లో్ర అడ్డుకునేందుకు బీజేపీ యేతర ముఖ్యమంత్రులు, ప్రతిపక్షాలు సిద్ధమవుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం సరికొత్త వాదన తెరపైకి తీసుకొచ్చింది. పౌరసత్వానికి సంబంధించిన అంశాల్లో చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదనీ… కేవలం పార్లమెంటుకు మాత్రమే ఆ అధికారం ఉందని స్పష్టం చేసింది. సీఏఏని రద్దు చేయాలని డిమాండ్‌ ‌చేస్తూ కేరళ అసెంబ్లీలో తీర్మానం చేసిన నేపథ్యంలో కేంద్రమంత్రి రవిశంకర్‌ ‌ప్రసాద్‌ ఈ ‌మేరకు స్పందించారు. పౌరసత్వ సవరణ చట్టంతో దేశంలోని ఏ పౌరుడికీ సంబంధం లేదు. స్వార్థ ప్రయోజనాల కోసం ఈ చట్టానికి వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం మొదలైందని ఆయన పేర్కొన్నారు. భాతీయ జనాభా రిజిస్టర్‌ (ఎన్పీఆర్‌) ‌పైనా ఆయన స్పందించారు. ఎన్పీఆర్‌ అనేది సాధారణ నివాసితులకు సంబంధించిన సంక్షిప్త రూపం.. దీనికి పౌరులతో సంబంధం లేదని వివరించారు. కాగా మంగళవారం కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ‌సీఏఏకి వ్యతిరేకంగా ప్రవేశ పెట్టిన తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. కేరళలో ఎలాంటి నిర్బంధ శిబిరాలు ఉండబోవని ఈ సందర్భంగా ఆయన అసెంబ్లీలో స్పష్టం చేశారు. లౌకికవాదానికి రాష్ట్రంలో సుదీర్ఘ చరిత్ర ఉన్నదని సీఎం పేర్కొన్నారు. తాజా చట్టం కారణంగా దేశ వ్యాప్తంగా వెల్లువెత్తిన ఆందోళనలతో… అంతర్జాతీయ సమాజం ముందు భారత ప్రతిష్టకు భంగం వాటిల్లుతోందని సీఎం ఆరోపించారు.

కాంగ్రెస్‌, అప్‌లపై బిజెపి మండిపాటు
పౌర చట్టం పై ప్రజలను విపక్షాలు తప్పుదారి పట్టించాయని కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీలపై బీజేపీ మండిపడింది. దేశ రాజధానిలో హింసను ప్రేరేపించినందుకు ఈ రెండు పార్టీలు జాతికి క్షమాపణ చెప్పాలని బీజేపీ సీనియర్‌ ‌నేత, కేంద్ర మంత్రి ప్రకాష్‌ ‌జవదేకర్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. ఢిల్లీ ప్రజలను ఈ పార్టీలు రెచ్చగొట్టడంతో డిసెంబర్‌ 15‌న జరిగిన నిరసనల్లో హింస చెలరేగిందని వ్యాఖ్యానించారు. ఢిల్లీ వంటి ప్రశాంత నగరంలో పౌర చట్టంపై దుష్పచ్రారం చేయడంతో విద్వేష వాతావరణం నెలకొందని, హింసాత్మక ఘటనల్లో వాటిల్లిన ఆస్తి నష్టానికి కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీలే బాధ్యత వహించాలని అన్నారు. ఈ రెండు పార్టీలు ప్రజలను క్షమాపణ కోరాలని జవదేకర్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. ఢిల్లీ అభివృద్ధికి ముఖ్యమంత్రి అరవింద్‌ ‌కేజీవ్రాల్‌ ఇచ్చిన వాగ్దానాల అమలులో ఘోరంగా విఫలమయ్యారని మండిపడ్డారు. తప్పుడు హాలను ఇచ్చిన కేజీవ్రాల్‌ ‌ఢిల్లీ అభివృద్ధిని విస్మరించారని విమర్శించారు. మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌లను అభివృద్ధి పనులు చేపట్టకుండా ఆప్‌ ‌సర్కార్‌ అడ్డుకుందని, రూ 900 కోట్ల నిధులను మంజూరు చేయకుండా తాత్సారం చేసిందని ఆరోపించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో ఆప్‌ ‌సర్కార్‌పై కేంద్ర మంత్రి విమర్శలు గుప్పించారు.

Tags: nrc delhi peoples, congress party, app party, poura chattam, javadekar

Leave A Reply

Your email address will not be published.