Take a fresh look at your lifestyle.

జిల్లావ్యాప్తంగా విద్యుత్‌ ఉద్యోగుల ఆందోళన

  • ఉద్యోగుల విభజన స్థానికత ప్రాతిపదికన జరగాలి
  • ఎన్‌పిడిసిఎల్‌ ఎదుట నల్లబ్యాడ్జీలతో నిరసన – ఆంధ్ర మేనేజ్‌మెంట్‌ ‌కాపీల దగ్ధం

విద్యుత్‌ ఉద్యోగుల విభజన స్థానికత ప్రాతిపదికన మాత్రమే జరుగాలని డిమాండ్‌ ‌చేస్తూ సోమవారం విద్యుత్‌ ఉద్యోగులు హన్మకొండ నక్కలగుట్టలోని ఎన్‌పిడిసిఎల్‌ ‌కార్యాలయం ఎదుట విద్యుత్‌ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా జాక్‌ ‌కన్వీనర్‌ ‌తిరుమల్‌రావు మాట్లాడుతూ ఇటీవల ధర్మాధికారి తెలంగాణ, ఏపి విద్యుత్‌ ‌సంస్థల నుండి ఒక్కొక్క అధికారిని నియమించి వారి ద్వారా అభ్యంతరాలను స్వీకరించి 1157 మంది విద్యుత్‌ ఉద్యోగుల ఐచ్చికాలు తీసుకొని ఏపికి 655 మిగిళిన 502 మందిని తెలంగాణకు అలాట్‌ ‌చేస్తూ 2019లో ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందని విద్యుత్‌ ఉద్యోగులు తెలిపారు. అయితే ఏపి మేనేజ్‌మెంట్‌, ఏపి విద్యుత్‌ ఉద్యోగులు సుప్రీం కోర్టును ఆశ్రయించారని, కోర్టు ధర్మాధికారి కమిటీకి అభ్యంతరాలను తెలియజేసి సూచనలు తీసుకోవాలని సూచించడం జరిగిందన్నారు. ఫి్ర•వరి 23న ధర్మాధికారి ఢిల్లీలో తెలంగాణ, ఏపి మేనేజ్‌మెంట్‌)తో సమావేశం నిర్వహించి ముందుగా ఇచ్చిన ఉత్తర్వులను మార్చడానికి వీలులేదని నిర్ధారించడం కూడా జరిగిందన్నారు.

అయితే ఆంధ్రా, తెలంగాణ మేనేజ్‌మెంట్‌లతో ఎటువంటి సంప్రదింపులు జరుపకుండా ఏకపక్షంగా 584 మంది ఏపి విద్యుత్‌ ఉద్యోగులను రిలీవ్‌ ‌చేస్తూ తెలంగాణ విద్యుత్‌ ‌సంస్థలో జాయిన్‌ ‌కావాలని ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందన్నారు. మా ఉద్యోగాలు మాకే చెందాలని తెలంగాణ సమాజం గత 14 సంవత్సరాలుగా ఉద్యమం చేసి తెలంగాణ సాధించి ఏపికి చెందిన విద్యుత్‌ ఉద్యోగులను రిలీవ్‌ ‌చేస్తే మళ్లీ వాళ్లు తెలంగాణ విద్యుత్‌ ‌సంస్థలపై అధికారాన్ని చెలాయించాలని చూస్తున్నారని ఆరోపించారు. ఏపి మేనేజ్‌మెంట్‌ ‌మొండి వైఖరిని నిరసిస్తూ టిఎస్‌ ఎన్‌పిడిసిఎల్‌లో ఉన్న అన్ని సంఘాలు ఏకమై జాక్‌ ఏర్పాటు చేసుకోవడం జరిగిందని తెలిపారు. రిలీవ్‌ అయిన ఆంధ్ర ఉద్యోగులు గోబ్యాక్‌ అం‌టూ ఆందోళనలు చేపట్టడం జరిగిందన్నారు. జాక్‌ ‌కన్వీనర్‌గా తిరుమల్‌రావు, కోకన్వీనర్‌గా విజేందర్‌రెడ్డి, వేణుబాబు, ఇంద్రసేన, ఆనందం, రాజేందర్‌, ‌హుస్సేన్‌, ‌వంగ రవీందర్‌లు ఎన్నికైనారు. ఆంధ్ర నుండి రిలీవ్‌ అయ్యి జాయిన్‌ అయ్యేందుకు వచ్చిన ఉద్యోగులను జాయిన్‌ ‌కాకుండా నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఆంధ్రకు చెందిన ఏ ఒక్క ఉద్యోగికి తెలంగాణ విద్యుత్‌ ‌సంస్థలో చేర్చుకోవడం జరుగదని ఈ విషయంపై అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తామని, అదేవిధంగా భవిష్యత్‌ ‌కార్యాచరణను రూపొందిస్తామని తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో విద్యుత్‌ ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఏపి ఉత్తర్వుల కాపీల దహనం :
ఏపి విద్యుత్‌ ‌మేనేజ్‌మెంట్‌ అ‌క్రమ ఉత్తర్వుల కాపీలను తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్‌ ‌జాయింట్‌ ఆక్షన్‌ ‌కమిటి ఆధ్వర్యంలో ములుగురోడ్‌లోని ట్రాన్స్‌కో సబ్‌స్టేషన్‌ ఎదుట దగ్ధం చేశారు. ఈ ఆందోళనలో తెలంగాణ ఎలక్ట్రిసిటి ఉద్యోగులు పెద్దమొత్తంలో పాల్గొన్నారు. ఏపి విద్యుత్‌ ‌సంస్థల నుండి తెలంగాణ విద్యుత్‌ ‌సంస్థలకు ఏపి స్థానికత కలిగిన ఉద్యోగులను రిలీవ్‌ ‌చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. స్థానికత ప్రకారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకొని 1157 మంది ఆంధ్ర స్థానికత వారిని 2015లో రిలీవ్‌ ‌చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జాక్‌ ‌నాయకులు మాట్లాడుతూ ఏపి విద్యుత్‌ ‌యాజమాన్యం అక్రమ ఉత్తర్వుల వల్ల తెలంగాణ యువతకు ఉద్యోగాలకు తీవ్ర నష్టం జరుగనున్నదన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను దృష్టిలో పెట్టుకొని ఏ ఒక్క ఆంధ్ర ఉద్యోగిని కూడా తెలంగాణ విద్యుత్‌ ‌సంస్థల్లోకి తీసుకోకుండా జాక్‌ ఆధ్వర్యంలో అన్ని సంఘాలు ఒక తాటిపైకి వచ్చి నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో సంపత్‌రావు, అశోక్‌, ‌దేవేందర్‌రెడ్డి, రాజునాయక్‌, ఉమామహేశ్వర్‌, ‌నాగరత్నం, శ్రీధర్‌రాజ్‌, ‌వినోద్‌, ‌రాజ్‌కుమార్‌, ‌రాజేశ్వర్‌, ‌ప్రసాద్‌, ‌విజయ్‌కుమార్‌, ‌మోహన్‌, ‌స్వప్న, స్వేత, చంద్రకళ, తిరుపతి, రాజేశ్వర్‌రావు, నాగరాజు, శ్రీనివాస్‌, ‌రమేష్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

Tags: Power sector, employees,agitation black badges,front NPDCL,Andhra management files

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy