Take a fresh look at your lifestyle.

జమ్ము కశ్మీర్‌ అభివృద్ధిని వేగవంతం చేస్తున్న విద్యుత్‌ ‌ప్రాజెక్టులు

“జమ్ము కశ్మీర్లో ప్రజలు ఇంతకాలం ఎదుర్కొన్న సమస్యలు తొలగిపోయి అక్కడ ఆర్ధిక వ్యవస్థ తిరిగి ట్రాక్‌ ‌లో పడేలా దోహదం చేయడానికిగాను అక్కడ విద్యుత్‌ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ ప్రాజెక్టులను కేంద్రం ప్రారంభిస్తోంది. వాటిలో ఒకటి కిషన్‌ ‌గంగ విద్యుత్‌ ‌ప్రాజెక్ట్. ‌కిషన్‌ ‌గంగ విద్యుత్‌ ‌ప్రాజెక్ట్ ‌లాంటివి ఈ ప్రాంతానికి విద్యుత్‌ ‌ను అందించడమే కాకుండా సాగునీటిని కూడా అందిస్తున్నాయి. అంతే కాదు వీటివల్ల అనేక ఇతర ప్రయోజనాలు అక్కడి ప్రజలకు చేకూరుతున్నాయి. ప్రజలకు తక్కువ ధరకే ఆరోగ్య భద్రత లభిస్తోంది. స్థానికులకు నూతన నైపుణ్యాల శిక్షణ లభిస్తోంది. అంతే కాదు స్థానికంగా పార్కులు, రోడ్లను అభివృద్ధి చేస్తున్నారు. ప్రాజెక్ట్ ‌పరిధిలో నివసించే కుటుంబాల పిల్లలకు ఆన్‌ ‌లైన్‌ ‌క్లాసురూములద్వారా చదువు చెబుతున్నారు.”

బందీపూర్‌ ‌జిల్లాలో ఏర్పాటు చేసిన కిషన్‌ ‌గంగ జలవిద్యుత్‌ ‌ప్రాజెక్ట్ ‌ను గత ఏడాది మే నెలలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించి దాన్ని జాతికి అంకితం చేశారు. ఆయన ఆ పని చేసినప్పుడు ఎవరూ ఊహించలేదు,  ఈ జలవిద్యుత్‌ ‌ప్రాజెక్ట్ ‌ప్రారంభమైన ఏడాదిలోనే జమ్ము కశ్మీర్‌ ‌కు అనేక ప్రయోజనాలు చేకూరుస్తుందని. ఎన్‌ ‌టిపిసి యాజమాన్యం కింద నడుస్తున్న ఈ జల విద్యుత్‌ ‌ప్రాజెక్ట్ ‌వల్ల వనరుల నష్టమే తప్ప ప్రయోజనం వుండదని విమర్శకులు భావించారు. అయితే ఈ ప్రాజెక్ట్ అం‌దిస్తున్న ఫలితాలు నూతనంగా ఏర్పడిన జమ్ము కశ్మీర్‌ ‌కేంద్ర పాలిత ప్రాంతానికి చక్కటి ప్రయోజనాలను అందిస్తోంది. 23. 24 కిలోమీటర్ల పొడవైన సొరంగమార్గం కలిగిన ఈ ప్రాజెక్ట్ ఇం‌జినీరింగ్‌ అద్భుతం. ఈ ప్రాజెక్ట్ ‌నిర్మాణాన్ని అడ్డుకోవడానికి పాకిస్థాన్‌ అనేక హాస్యాస్పదమైన ప్రయత్నాలు చేసింది. అయితే వాటినన్నిటినీ భారతదేశం సమర్థవంతంగా అడ్డుకుంది. దీనికి సంబంధించి అంతర్జాతీయ న్యాయస్థానం హేగ్‌ ‌లో పోరాటం చేసి విజయం సాధించింది. దాంతో ప్రస్తుతం జమ్ము కశ్మీర్‌ ‌లోయకే కాకుండా ఈ ప్రాంతం మొత్తానికి మేలు జరుగుతోంది.జమ్ము కశ్మీర్‌ ‌కేంద్రపాలిత ప్రాంతంగా మారిన తర్వాత ఆ ప్రాంతానికి ఉన్నతస్థాయి లభించింది.

భారతదేశ కిరీటంలో వాస్తవ ఆభరణంగా మారింది. కేంద్రపాలిత ప్రాంతంగా మారిన మొదటి పది నెలల్లోనే జమ్ము కశ్మీర్‌ ‌రూ. 34.31 కోట్ల విలువైన 85. 12 మిలియన్‌ ‌యూనిట్ల ఉచిత విద్యుత్‌ ‌ను పొందింది. అంతే కాదు నీటి వినియోగ ఛార్జీల కింద రూ. 10. 54 కోట్లను పొందింది. ఇంతవరకూ తీవ్రమైన విద్యుత్‌ ‌కొరతతో జమ్ము కశ్మీర్‌ ఇబ్బందులు పడింది. ముఖ్యంగా చలికాలంలో విద్యుత్‌ ‌సంక్షోభం మరింతగా వుండేది. అయితే జలవిద్యుత్‌ ‌ప్రాజెక్ట్ ‌కారణంగా ఈ ఇబ్బందులు తొలగిపోయాయి. ఆర్టికల్‌ 370‌ని రద్దు చేసినప్పుడు వ్యతిరేకించినవారు జమ్ము కశ్మీర్‌ ‌సాధించబోయే అభివృద్ధి ఫలాలను తక్కువ అంచనా వేశారు. కశ్మీర్‌ ‌లోయ, జమ్ము , లెహ్‌, ‌లద్దాహ్‌ ‌లకు వచ్చిన నూతన స్థాయిద్వారా పొందబోయే ఫలితాలను వారు ఊహించలేకపోయారు.
జమ్ము కశ్మీర్లో ప్రజలు ఇంతకాలం ఎదుర్కొన్న సమస్యలు తొలగిపోయి అక్కడ ఆర్ధిక వ్యవస్థ తిరిగి ట్రాక్‌ ‌లో పడేలా దోహదం చేయడానికిగాను అక్కడ విద్యుత్‌ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ ప్రాజెక్టులను కేంద్రం ప్రారంభిస్తోంది. వాటిలో ఒకటి కిషన్‌ ‌గంగ విద్యుత్‌ ‌ప్రాజెక్ట్. ‌కిషన్‌ ‌గంగ విద్యుత్‌ ‌ప్రాజెక్ట్ ‌లాంటివి ఈ ప్రాంతానికి విద్యుత్‌ ‌ను అందించడమే కాకుండా సాగునీటిని కూడా అందిస్తున్నాయి. అంతే కాదు వీటివల్ల అనేక ఇతర ప్రయోజనాలు అక్కడి ప్రజలకు చేకూరుతున్నాయి. ప్రజలకు తక్కువ ధరకే ఆరోగ్య భద్రత లభిస్తోంది. స్థానికులకు నూతన నైపుణ్యాల శిక్షణ లభిస్తోంది. అంతే కాదు స్థానికంగా పార్కులు, రోడ్లను అభివృద్ధి చేస్తున్నారు. ప్రాజెక్ట్ ‌పరిధిలో నివసించే కుటుంబాల పిల్లలకు ఆన్‌ ‌లైన్‌ ‌క్లాసురూములద్వారా చదువు చెబుతున్నారు. అంతే కాదు మొన్నటిదాకా ఉగ్రవాదల భారతవ్యతిరేక ఎజెండా కారణంగా తీవ్రస్థాయిలో ఇబ్బందులు పడ్డ యువతకు ఉద్యోగాల కల్పన జరుగుతోంది.

పక్షం రోజుల క్రితమే జమ్ము కశ్మీర్‌ ‌లెప్టినెంట్‌ ‌గవర్నర్‌ ‌చేతుల మీదుగా పది విద్యుత్‌ ‌పంపిణీ ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. శ్రీనగర్‌, ‌షోపియాన్‌, అనంతనాగ్‌, ‌బుడ్గమ్‌, ‌కుల్గం జిల్లాల్లో విద్యుత్‌ ‌కొరతను అధిగమించడానికిగాను ఈ పంపిణీ ప్రాజెక్టులను ప్రారంభించడం జరిగింది. రాబోయే సంవత్సర కాలంలో పలు పథకాల కింద కేంద్ర సంస్థలు అమలు చేయబోయే ఏడు ఇతర ప్రాజెక్టులకు కూడా ఆయన శంఖుస్థాపన చేవారు. ఇంతకాలం పిడిపి, నేషనల్‌ ‌కాన్ఫరెన్స్ ‌పార్టీల ఆధ్వర్యంలో నడిచిన ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసిన విద్యుత్‌ ‌పంపిణీ కార్యక్రమం ఇప్పుడు జమ్ముకశ్మీర్‌లో వేగవంతం అయింది. ఇక్కడ విద్యుత్‌ ‌కొరతను అధిగమించడానికిగాను కేంద్రం వేసిన అడుగులు ఫలితాలనిస్తున్నాయి. విద్యుత్‌ ‌కు సంబంధించి జమ్ము కశ్మీర్‌ ‌లో అత్యధిక డిమాండ్‌ 3400 ‌మెగవాట్లు. ఇది జాతీయ అగ్రిగేట్‌ ‌లో 1.8 శాతం. కేంద్రపాలిత ప్రాంతం ఎదుర్కొంటున్న వాస్తవ కొరతను కొత్తగా ప్రారంభించిన ప్రాజెక్టులద్వారా గణనీయంగా తగ్గించడం జరిగింది. 20 వేల మెగావాట్లకు పైగా జలవిద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం జమ్ము కశ్మీర్‌ ‌సొంతం. చెనాబ్‌ ‌బేసిన్‌ ‌లో 11283 మెగావాట్లు, జీలంలో 2084 మెగావాట్లు, రవి మరియు ఇండస్‌ ‌బేసిన్లలో 1608 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం వుంది. జమ్ము కశ్మీర్‌ ‌లోని మొత్తం విద్యుత్‌ ‌సామర్థ్యాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవడం మొదలైతే ఇక ఈ ప్రాంతం విద్యుత్తు శక్తిని ఎగుమతి చేసే స్థాయికి చేరుకుంటుంది. ఈ దిశగా కొన్ని చర్యల్ని ఇప్పటికే తీసుకోవడం జరిగింది. వేయి మెగావాట్ల పకుల్‌ ‌జల విద్యుత్‌ ‌ప్రాజెక్టును చాలా వేగంగా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. చెనాబ్‌ ‌లోయలోని 624 మెగావాట్ల కిరు జల విద్యుత్‌ ‌ప్రాజెక్ట్… అమలుకు సంబంధించి చివరిదశకు చేరుకుంది. ఈ రెండు ప్రాజెక్టులకు పిఎఫ్‌ ‌సి నిధులను అందిస్తోంది. ఇక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్తులోని మిగులు విద్యుత్తును పవర్‌ ‌ట్రేడింగ్‌ ‌కార్పొరేషన్‌ ఎగుమతి చేస్తోంది. ఈ పనిని ఆన్‌ ‌లైన్‌ ‌వేదిక ద్వారా చేస్తున్నారు. భారీ విద్యుత్తు ప్రాజెక్టులకు ఆర్ధిక సాయం అందించడంతోపాటు జమ్ము కశ్మీర్‌, ‌లద్దాఖ్‌ ‌లకోసం ఉమ్మడిగా రెగ్యులేటరీ కమిషన్‌ ‌ను ఏర్పాటు చేస్తే ఈ రంగంలో చేపట్టాల్సిన సంస్కరణలకు బీజం వేసినట్టవుతుంది. అదే సమయంలో ఈ రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని విద్యుత్‌ ‌శక్తి వనరులను క్రమపద్ధతిలో వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలి. స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థ ద్వారా విద్యుత్తు ధరల నియంత్రణ జరగాలనే ఆకాంక్ష వ్యక్తమవుతోంది. తద్వారా ఈ ప్రాంతంలో వినియోగదారులకు మేలు జరిగే అవకాశముందని భావిస్తున్నారు.

ఈ రెండు కేంద్ర పాలిత ప్రాంతంలో 24 గంటలూ విద్యుత్తు అందుబాటులోకి తేవడానికిగాను ఉన్నతస్థాయి అలోక్‌ ‌కుమార్‌ ‌ప్యానెల్‌ ఒక నివేదికను అందించింది. ఈ ప్రాంతంలో ఆర్ధికంగా వచ్చే ఫలితాలను అత్యధికంగా పొందడానికిగాను ఈ నివేదికను వెంటనే అమలు చేయాలి. తద్వారా ఈ ప్రాంతాన్ని ఆర్ధికంగా స్వయం సమృద్ధిప్రాంతంగాను, సుస్థిరతను కలిగిన ప్రాంతంగాను మార్చవచ్చు. పరిశ్రమలు, వ్యవసాయ రంగాలకు కావలసిన విద్యుత్‌ , ‌గృహ అవసరాలకు అవసరమయ్యే విద్యుత్‌ అవసరాలను తీర్చగలగాలంటే ఎలాంటి ఒడిదుడుకులు లేని ప్రణాళికను అమలు చేయాల్సిన అవసరం వుంది. మొదటి దశలో చేయాల్సింది ఏమంటే శిథిలావస్థలో వున్న విద్యుత్తు రంగ మౌలిక సదుపాయాలను పునరుద్ధరించాలి. రూ. 90.09 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టడంద్వారా చెక్క కరెంటు స్తంభాలను, ముళ్ల వైర్‌ ‌కండక్టర్లను తొలగించి ఆధునిక సౌకర్యాలు కల్పించాలి. ఇందుకోసం కేంద్ర విద్యుత్తు శాఖ అనుమతి కూడా ఇచ్చింది. అంతే కాదు ఆత్మనిర్భర్‌ ‌భారత్‌ ఉద్యమం కింద  పవర్‌ ‌ఫైనాన్స్ ‌కార్పొరేషన్‌ (‌పిఎఫ్‌సి), రూరల్‌ ఎలక్ట్రిక్‌ ‌కార్పొరేషన్‌ ( ఆర్‌ ఇ ‌సి)లద్వారా అమలయ్యేలా ప్రధాని శ్రీ నరేంద్రమోదీ ప్రకటించిన ఆర్ధికసాయమనేది రూ. 4580 కోట్లవరకు త్వరలో అందబోతుంది. దీని కారణంగా పంపిణీ కంపెనీలకు మేలు జరుగుతుంది. తద్వారా క్షేత్రస్థాయిలో వినియోగదారులకు మెరుగైన సేవలు అందుతాయి. మొత్తం మీద చూస్తే ఇక్కడి విద్యుత్‌ ‌రంగ వాతావరణం గణనీయమైన స్థాయిలో ప్రగతిమార్గం పట్టింది. కేంద్ర విద్యుత్‌ ‌సంస్థలు, ఆర్ధిక సహాయం అందించే కంపెనీలు పెద్ద మొత్తంలో నిధులను మౌలిక సదుపాయాల అభివృద్ధికోసం, వాణిజ్యేతర సేవలకోసం అందిస్తున్నాయి. ఉదాహరణకు ఎన్‌ ‌టిపిసి, పవర్‌ ‌గ్రిడ్‌, ఎన్‌ ‌హెచ్‌ ‌పిసి, పిఎఫ్‌ ‌సి, ఆర్‌ ఇ ‌సి కంపెనీలు ఇప్పటికే రూ. 100 కోట్లను పలు కమ్యూనిటీ ప్రాజెక్టులకోసం కేటాయించాయి. వాటి ద్వారా నైపుణ్యాల అభివృద్ధిని సాధిస్తున్నారు. తాత్కాలిక ఆవాసాలను ఏర్పాటు చేస్తున్నారు. అంతే కాదు కేంద్ర మంత్రిత్వశాఖలు కేటాయించిన రూ. 500 కోట్లను ఉపాధికల్పనకు, వీధి దీపాల ఏర్పాటుకు వినియోగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రణాళకల కారణంగా జమ్ము కశ్మీర్‌ ‌పూర్తిస్థాయిలో మార్పు దిశగా అడుగులు వేస్తోంది. తద్వారా ఈ ప్రాంతంలో భారత వ్యతిరేక ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలు, హత్యలు దాదాపుగా తగ్గుముఖం పట్టాయి.
 కె.ఏ. బదరీనాధ్‌,  ‌ఫైనాన్స్ ‌క్రానికల్‌ ‌పూర్వ సంపాదకులు

Leave a Reply