Take a fresh look at your lifestyle.

‘‘‌వైట్‌ ‌హౌస్‌ ‌ఫైట్‌లో భారతీయుల సత్తా’’

ప్రపంచాన్ని శాసించే అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఈసారి చాలా రసవత్తరంగా ఆసక్తికరంగా జరిగాయి. ఓట్ల లెక్కింపు ఉత్కంఠభరితంగా, ఉద్విగ్నంగా నరాలు తెగ టెన్షన్‌ ‌కు గురి చేస్తూ…. నువ్వా నేనా అనే పోరులో  ట్రంప్‌ ‌జో బిడెన్‌ ‌లు  అగ్రరాజ్యధిపతులుగా పీఠమును ఎక్కుతామని ఎవరికివారు ధీమాగా మ్యాజిక్‌ఫిగర్‌ ‌కోసం ఎదురు చూస్తున్న తరుణంలో….. అగ్రరాజ్యం అమెరికాలో భారతీయులు తమ ప్రభావాన్ని క్రమంగా పెంచుకుంటూ అమెరికా రాజకీయాలలో తమదైన శైలితో అమెరికన్లను, పార్టీలను మరియు నాయకులను ఆకట్టుకుంటూ  దుసుకుపోతున్నారు.  తాజాగా జరిగిన ఎన్నికల్లో తమ  ప్రాతినిధ్యాన్ని పరీక్షించుకుంటున్నారు.   కాంగ్రెస్‌ ‌సేనెట్‌ ‌రేసులో భారతీయ అమెరికన్లు పోటీపడ్డారు. అమెరికాలో జీవనోపాధి కోసం మెరుగైన జీవితాన్ని తమ కుటుంబాలకు అందించడం కోసం అవకాశాలను అందిపుచ్చుకొని అవిరళ కృషి చేసి అమెరికాలో స్థిరపడి తమ అభివృద్ధితో పాటు ఆ దేశ అభివృద్ధికి నిరంతర కృషి చేస్తున్నవారు అమెరికాలో దాదాపు 40 లక్షల మంది భారతీయులు ఉండగా  ఓటు హక్కు కలిగిన వారు 19 లక్షల వరకు ఉన్నారు. టెక్సాస్‌ , ‌మిచిగాన, ఫ్లోరిడా,పెన్సిల్వేనియా రాష్ట్రాల వారు ఎక్కువగా ఉన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారతీయ  అమెరికన్లు కీలకంగా మారారు. రిపబ్లికన్‌ ‌పార్టీ, విపక్ష డెమొక్రటిక్‌ ‌పార్టీల అభ్యర్థులు ఐన  ట్రంప్‌, ‌బిడెన్‌లు  తమ ప్రసంగాలలో భారతీయుల ప్రస్తావన  తీసు కురాని  సందర్భమే లేదు. రెండు పార్టీలకు భారతీయ అమెరికన్లు భారీగా విరాళాలు ఇస్తారు. అమెరికాలో స్థిరపడిన మెక్సికన్‌ అమెరికన్ల తర్వాత అతిపెద్ద సమూహం భారతీయులు……2016 ముందుకు భారతీయులు ఎక్కువగా డెమొక్రాట్ల  వైపు మొగ్గు చూపేవారు,  మద్దతునీ ఇచ్చేవారు. ట్రంప్‌  అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత భారతీ యులను తమవైపు తిప్పుకోవడం లో కొంతవరకు సఫలీకృతులయ్యారు. అమెరికా రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడానికి, తమదైన రీతిలో చక్రం తిప్పడానికి  ఇరు పార్టీల మద్దతును , మన్ననలను పొంది అమెరికా కాంగ్రెస్‌  ‌ప్రతినిధుల సభ, వివిధ రాష్ట్రాల ప్రతినిధులు సభలు,  సెనేట్‌ ‌లు , ఇంకొన్ని పదవులకు జరిగిన ఎన్నికల ప్రక్రియలో భారతీయ  అమెరికన్లు ఈసారి తమ హవాను  కొనసాగించారు….. ఇప్పటివరకు అందిన వార్తల ప్రకారం 18 మంది భారతీయులు గెలుపొందినట్లు తెలుస్తుంది…. రాష్ట్రస్థాయి ఎన్నికల్లో 13 మంది విజయం సాధించారు. వారిలో ఐదుగురు మహిళలు కావడం గొప్ప విశేషం.
డెమొక్రటిక్‌ ‌పార్టీ తరపున ప్రతినిధుల సభకు డాక్టర్‌ ఆమీ  బేరా, ప్రమీల   జయపాల్‌ ‌రోఖన్నా , రాజా కృష్ణమూర్తి లు భారీ ఆధిక్యంతో తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. ఈ నలుగురితో పాటు ఉపాధ్యక్ష పదవికి డెమాక్రాటిక్‌ ‌పార్టీ అభ్యర్థి, భారత సంతతికి చెందిన కమల హారిస్‌ ‌కూడా ఉన్నారు. అమెరికాలోని 25 కోట్ల ఓటర్లలో 19 లక్షల మంది భారతీయ అమెరికన్‌ ఓటర్లను ఆకట్టుకోవడానికి  ఉభయపార్టీలు  భారతీయ అమెరికన్లను ప్రచారంలో వాడుకుంటూ…. ఎన్నికల బరిలోకి కూడా దింపాయి.
ఎవరీ  కమల హారిస్‌….? ‌ప్రస్తుతం 55 ఏళ్ల వయసు ఉన్న కమల అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్‌ ‌పార్టీ తరపున ఉపాధ్యక్ష పదవికి పోటీపడిన తొలి నల్లజాతి మహిళ, ఆసియా అమెరికన్‌. ‌భారతీయ – జమైకా మూలాలున్న కమల ప్రస్తుతం కాలిఫోర్నియా సెనేటర్‌ ‌గా కొనసాగుతున్నారు మరియు కాలి ఫోర్నియా  అటార్నీ జనరల్‌ ‌గాను  పని చేయడం జరిగింది. ఇప్పటివరకు కేవలం ఇద్దరు మహిళలు మాత్రమే ఉపాధ్యక్ష అభ్యర్థిగా అమెరికా ఎన్నికల్లో నిలబడ్డారు. 1984 లో డెమోక్రటిక్‌  అభ్యర్థిగా  గెరాల్డన్ ‌ఫెరారో, 2008లో రిపబ్లికన్‌ ‌పార్టీ అభ్యర్థిగా సారా  పాలిన్‌ ‌లు  పోటీ చేశారు, కానీ వీరిద్దరూ గెలుపొందలేదు. అటు తర్వాత 2020లో నిలబడ్డా  కమలా హారిస్‌ ‌గెలుపొందడం భారతీయులకు గర్వకారణం. నల్లజాతి మహిళలకు ఇప్పటి వరకు ఇరు పార్టీల వారు అధ్యక్షా లేదా ఉపాధ్యక్ష అభ్యర్థిత్వ టికెట్‌ ఇవ్వలేదు.. దేశంలోనే అత్యుత్తమ ప్రజాసేవకురాల్లో ఒకరు గా పేరుగాంచిన వారు, మహిళలు, పిల్లల వేదింపుల బారినపడకుండా వారు కృషి చేశారు. కార్మికుల కోసం, దేశాన్ని అభివృద్ధి దిశగా నడిపించడంలో కార్మికుల తో కలిసి నడవాలనే ఆలోచనా దృక్పథం గల మహిళ నాయకురాలైన కమల కాలిఫోర్నియాలోని  ఆక్లాండ్‌  ‌లో వలసదారులకు జన్మించారు. ఆమె తల్లి భారతీయ సంతతికి చెందిన వారు కాగా తండ్రి జమైకా దేశస్థుడు…. కమల   హారిస్‌  ‌ను  ఎంపిక చేయడానికి కారణం ఆమె తెలివైన, దృఢమైన నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి, ఉండవలసిన ప్రధాన లక్షణాలు అన్నీ ఉన్నాయి.
ఒ నల్లజాతి మహిళ, వలసదారుల కుటుంబం నుంచి వచ్చిన ఆమె జాతీయస్థాయిలో నాయకత్వ లక్షణాలు గల మహిళ,  శాన్‌ ‌ఫ్రాన్సిస్కో కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌ ‌గా కొనసాగారు. ఆమె వాక్చాతుర్యం వాదనా పటిమ, ప్రజా  కర్షణ కలిగిన నాయకురాలు, నేరస్తులను శిక్షించడంలోనూ, వివాహ వ్యవస్థలో సమానత్వం తీసుకురావడం లోనూ,  కృషిచేసిన గొప్ప నాయకురాలు గా పేరొందిన అనుభవం గల  నల్లజాతీయులురాలైనందున, ఉపాధ్యక్ష పదవికి ఎంపిక చేయడంతో ఎన్నికల సంగ్రామంలో బరిలో ఉండి గెలుపొందిన భారతీయ అమెరికన్‌ ‌కావడం  సంతోషదాయకం…. అదేవిధంగా మిచిగన్‌ 42‌వ జిల్లానుంచి రాష్ట్ర  ప్రతినిధుల సభకు ఎన్నికైన తెలుగు బిడ్డ పద్మ కుప్ప…. రాష్ట్రపతి  ప్రతినిధుల సభకు ఎన్నికైన భారతీయ అమెరికన్‌. ఈమె 1966 లో భారత్లోని వరంగల్‌ ‌లో జన్మించారు.  4 ఏళ్ల వయసులోనే తల్లిదండ్రులు అమెరికా తీసుకెళ్లారు.1981  లో తిరిగి భారత్‌ ‌కు విచ్చేసి హైదరాబాదులోని స్టాన్లీ బాలికల జూనియర్‌ ‌కళాశాల లో ఇంటర్‌ ‌పూర్తి చేసి, వరంగల్‌ ‌నిట్‌  ‌లో 1982-86 మెకానికల్‌ ఇం‌జనీరింగ్‌ ‌చదివి,1988 లో విద్యార్థిగా తిరిగి అమెరికా వెళ్లారు. ఆమె భర్త సుధాకర్‌ ‌తాడేపల్లి, ఇద్దరు పిల్లలతో మిచిగాన్‌ ‌లోని ట్రాయ్‌ ‌లో స్థిరపడడం జరిగింది. ట్రాయ్‌ ‌ప్లానింగ్‌ ‌కమిషనర్‌  ‌గా రెండేళ్లు పని చేశారు.2018 లో  డెమోక్రటిక్‌ ‌పార్టీ తరఫున  రాష్ట్ర ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. తాజా ఎన్నికల్లో రెండోసారి కూడా విజయం సాధించారు.

     వీరితోపాటు ప్రతినిధుల సభకు జెన్నీఫర్‌ ‌రాజ్‌ ‌కుమార్‌.(  ‌న్యూయార్క్), ‌నీమాకులకర్ణి )(కెంటకీ), వందనా స్లాటర్‌ (‌వాషింగ్టన్‌),  అమిష్‌ ‌షా ( ఆరిజోన) డెమొక్రటిక్‌ ‌పార్టీ తరఫున గెలిచారు. సెనేట్‌  ఎం‌పికైనవారు కేశ రామ్‌ )(‌వెర్మాంట), జె. చౌదరి (నార్త్ ‌కరోలిన), నిఖిల్‌  ‌సవాల్‌(‌పెన్సిల్వేనియా), జెరీమీ  కూని(న్యూయార్క్), ‌రూ పాండే మెహత),(న్యూ  జెర్సీ))టెక్సన్‌  ‌జిల్లా జడ్జి ఎన్నికల్లో రవి  నందిల్‌ (‌డెమోక్రాట),  నీనా అహ్మద),( పెన్సిల్వేనియా  ఆడిటర్‌ ‌జనరల్‌) ‌విజయం సాధించారు. కొందరు ప్రముఖ భారతీయ అమెరికన్లు ఓడిపోయారు. అమెరికా రాజకీయాల్లో కీలక పాత్ర దిశగా ఈసారి భారతీయ అమెరికన్ల ముందడుగు వేశారని ఇంపాక్ట్  ‌ఫండ్స్ ‌సంస్థ ప్రతినిధి   నీల్‌  ‌మఖిజా  తెలిపారు. దేశ వ్యాప్తంగా ఎన్నికల బరిలోకి దిగిన భారతీయ అమెరికన్‌ అభ్యర్థుల కోసం ఈ సంస్థ కోటి డాలర్లు విరాళంగా సేకరించడం విశేషం…..

ప్రతిష్ఠాత్మకమైన, ఉత్కంఠ రేపుతున్న అమెరికా ఎన్నికలలో ఇండో  అమెరికాన్స్  ఈసారి ఎక్కువ మంది గెలుపొందడం సంతోషదాయకం… గెలవడమే కాకుండా భవిష్యత్తులో కీలకమైన స్థానాలలో నిలబడాలని, దేశ అభివృద్ధికి తమ శక్తి సామర్థ్యాలను  దారా పోయాలని, ప్రపంచంలోనే  పేరు పొందిన అమెరికా  ప్రాశస్త్యాన్ని కాపాడుటకు  నిరంతరం  కృషి చేస్తూ ఉండటమే గాక అక్కడి రాజకీయాలలో చక్రం తిప్పుతూ…. ఎన్నికల బరిలో నిలబడి గెలుపొందడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రభుత్వాలలో కూడా  మంత్రులుగా….. కీలకమైన నిర్ణయాలు, ప్రతిపాదనలు చేయడం  లో భారతీయులు చురుకైన పాత్ర పోషిస్తున్నారు.  ఇటీవల న్యూజిలాండ్‌ ‌మంత్రిపదవి నీ అధిష్టించిన ప్రియాంక  రాధాకృష్ణన్‌  ‌లు భారతీయ సంతతికి చెందిన వారే. భారతీయులు ప్రపంచ   నలుమూలలా విస్తరించి  పలు దేశాలలో స్థిరపడటం జరిగింది.  ఏ దేశమేగినా ….ఎందు కాలిడినా ……పొగడరా ……నీ తల్లి భూమి భారతిని …….అని రాయప్రోలు సుబ్బారావు గారు  అన్నట్లు….వారు మాతృదేశమైన భారతదేశాన్ని మరిచిపోకుండా వారి పనిచేస్తున్న దేశాలతో అంతర్జాతీయ సంబంధాలను పెంపొందించడానికి, అభివృద్ధి   పథం  లో పయనింప చేయు టకు  వ్యాపార వాణిజ్య పరంగా పలు ఒప్పందాలు నెలకొల్పుటకు కృషి చేయాలని ఆశిద్దాం.

Tanda Sadanandam, District
తండా సదానందం, జిల్లా
ఉపాధ్యక్షుడు, టి.పి.టి.ఎఫ్‌. ‌మహబఃబాద్‌ ‌జిల్లా. 9989584665

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply