Take a fresh look at your lifestyle.

ఉన్నత చదువుకు పేదరికం అడ్డు కాకూడదు

  • విదేశీ వర్సిటీల్లో 213 మంది విద్యార్థులకు అడ్మిషన్లు
  • జగనన్న విదేశీ విద్యా దీవెన కింద రూ. 19.95 కోట్లు సమ
  • ఓ మంచి కార్యాక్రమాన్ని చేపట్టామన్న ఎపి సిఎం జగన్‌

అమరావతి, ఫిబ్రవరి 3 : అర్హులైన విద్యార్థులందరికీ జగనన్న విదేశీ విద్యా దీవెన కింద నిధులను ప్రభుత్వం అందిస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదలకు ఉచిత విదేశీ విద్యను అందిస్తున్న విషయం తెలిసిందే.అంతర్జాతీయ స్థాయిలో టాప్‌-200 ‌వర్సిటీల్లో ఉచిత ఉన్నత విద్య అడ్మిషన్లు పొందిన 213 మంది విద్యార్థులకు మొదటి విడతలో సాయంగా రూ. 19.95 కోట్లను బటన్‌ ‌నొక్కి లబ్దిదారుల ఖాతాల్లోకి డబ్బులను ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌ ‌రెడ్డి శుక్రవారం జమ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌.‌జగన్‌ ‌మాట్లాడుతూ.. జగనన్న విదేశీ విద్యా దీవెన రాష్ట్ర చరిత్రలో సువర్ణ అధ్యాయం అన్నారు. మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు.

పేద విద్యార్థులు ప్రపంచంలోనే టాప్‌ ‌వర్సిటీల్లో చదువుకునే అవకాశం కల్పించామని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణాల పేద విద్యార్థులకు అవకాశం ఇచ్చామని తెలిపారు. ఉన్నత చదువుకు పేదరికం అడ్డుకాకూడదన్నారు. పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువేనని అన్నారు. విదేశీ వర్సిటీల్లో 213 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారని తెలిపారు. వీరికి తొలివిడతగా రూ.19.95 కోట్ల సాయం అందిస్తున్నామని సిఎం తెలిపారు. ప్రపంచ వేదికపై దేశం, ఆంధ్ర రాష్ట్ర జెండా ఎగురవేయాలని, మన పిల్లలు ప్రపంచ స్థాయిలో రాణించాలని జగన్‌ ఆకాక్షించారు. విద్య ద పెట్టే ప్రతి పెట్టుబడి కూడా మానవ వనరుల ద పెట్టినట్టేనన్నారు. మహాత్మ గాంధీ, జవహర్‌లాల్‌ ‌నెహ్రూ, అంబేద్కర్‌ ‌వంటి వాళ్లు పెద్ద యూనివర్శిటీల నుంచి వచ్చినవారేనని, అందుకే పిల్లలు చదువు కునేలా అడుగులు వేయిస్తున్నామని సిఎం తెలిపారు.

గతంలో కేవలం రూ. 10లక్షలు మాత్రమే ఇచ్చే వారనీ, 2016-17కి సంబంధించి రూ.300 కోట్లు బకాయిలు పెట్టారని సిఎం జగన్‌ ‌తెలిపారు. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు గరిష్టంగా రూ.1.25 కోట్లు, మిగిలిన విద్యార్థులకు గరిష్టంగా రూ.కోటి వరకు సాయం అందిస్తున్నామని తెలిపారు. ట్యూషన్‌ ‌ఫీజు వందశాతం రీయింబర్స్‌మెంట్స్ ఇస్తున్నామన్నారు. ఎవరికైనా ఇబ్బంది ఉంటే సీఎంఓలో అధికారులు అందుబాటులో ఉంటారనీ, ఇబ్బంది ఉంటే వెంటనే కాల్‌ ‌చేయాలని ముఖ్యమంత్రి జగన్‌ ‌సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సురేశ్‌, ‌వెల్లంపల్లి శ్రీనివాస్‌,‌మాజీమంత్రి ధర్మాన కృష్ణదాస్‌, ‌చెవిరెడ్డి భాస్కర్‌ ‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply