Take a fresh look at your lifestyle.

పోతిరెడ్డిపాడు జలదోపిడిని .. అడ్డుకుంటాం

  • తెలంగాణ ప్రభుత్వం మౌనం వీడాలి…..
  • త్వరితగతిన స్పందించకపోతే దక్షిణ తెలంగాణ ఎడారే
  • దక్షిణ తెలంగాణ ప్రాజెక్టుల పట్ల నిర్లక్ష్యాన్ని వీడి యుద్ధ్ద ప్రాతిపదికన పూర్తి చేయాలి
  • ముఖ్యమంత్రి బేసిన్‌లు లేవు బేషజాలాలు లేవనడం ఉధ్యమ స్పూర్తికి విరుద్ధం
  • తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు అంబటి నాగయ్య 

పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమకు అక్రమంగా తరలించుకుపోయో నీటిని అడ్డుకుంటామని తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు అంబటి నాగయ్య అన్నారు. శుక్రవారం నల్లగొండ లోని పి.ఆర్‌.‌టి.యు భవన్‌ ‌లో ‘‘పోతిరెడ్డిపాడు జలదోపిడి-తెలంగాణ ప్రాజెక్టు ల భవితవ్యం’’ పై తెలంగాణ విద్యావంతుల వేదిక నిర్వహించిన సదస్సు కు అంబటి నాగయ్య ప్రధాన వక్తగా హాజరై మాట్లాడుతూ క్రిష్ణా జలాల దోపిడి ఎత్తుగడలు ఆంధ్ర ప్రభుత్వం యొక్క కుట్రపూరిత చర్యకు నిదర్శనం అన్నారు.దోచుకొని దాచుకోవడమనేది సీమాంధ్ర పాలకులకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు.గతంలో 2006 లోనే రాజశేఖర్‌ ‌రెడ్డి 107 జివో పేరుతో పోతిరెడ్డిపాడు నుంచి అదనంగా 44000 క్యూసెక్కుల నీల్లను తరలించుకపోవడానికి తెలంగాణ కాంగ్రెస్‌ ‌నేతలను మభ్య పెట్టి పది హెడ్‌ ‌రేగ్యూలేటర్‌ ‌గేట్లను ఏర్పాటు చేసి దక్షిణ తెలంగాణకు నీల్ల విషయంలో చేసిన మోసం క్షమించరానిదన్నారు. ఇప్పుడు జగన్మోహన్‌ ‌రెడ్డి తీసుకొచ్చిన 203 జీవో కూడ తెలంగాణ కు తీవ్ర విఘాతం కలిగించేదన్నారు.ఇప్పటికే రాయలసీమ తీసుకోవాల్సిన నీల్ల కంటే నాలుగు రెట్లు అధనంగా తరలించుకపోయింధన్నారు.

. స్వరాష్ట్ర పాలనలో తెలంగాణ ప్రజల బతుకులు మారుతాయనుకుంటే అధికారంలోకి వచ్చిన స్వయం పాలకులు కాంట్రాక్టర్ల లాభారజనే ధ్యేయంగా ప్రాజెక్టు ల రూపకల్పన చేసి ప్రజల ప్రయోజనార్థం ఉపయోగపడే ఎస్‌.ఎల్‌.‌బి.సి,డిండి,ని అస్సలు పట్టించుకోకపోగా 180,000 కోట్ల మెగా బడ్జెట్‌ ‌లో వీటికి కేటాయించిన నిధులు నామమాత్రమే అన్నారు.పాలమూరు ప్రాజెక్టు లైన కల్వకుర్తి కి రెండు కోట్లు, భీమాకు మూడు కోట్లు,పాలమూరు లిఫ్ట్ ‌స్కీమ్‌ ‌కు 368 కోట్లు ,జురాలకు మూడున్నర కోట్లు కేటాయించడం దక్షిణ తెలంగాణ ప్రాజెక్టు ల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ఠ అన్నారు.దక్షిణ తెలంగాణ ప్రాజెక్టు లు పూర్తి చేయకపోవడం వల్ల రెండవ క్రిష్ణా ట్రిబ్యునల్‌ ఐన బ్రీజేష్‌ ‌కుమార్‌ ‌ముంధు శాశ్వత హక్కులను కొల్పోయో ప్రమాదం వుందన్నారు.త్వరితగతిన యుద్దప్రాతిపదికన దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులను పూర్తి చేయాలన్నారు.800 అడుగుల వద్ద నిర్మించదల్చిన పాలమూరు రంగారెడ్డి పథకాన్ని 820 అడుగుల వద్ద నిర్మించపూనుకోవడం తెలంగాణ ప్రభుత్వం చేసిన చారిత్రక తప్పిదం అన్నారం.ఇంతపెద్ద ఎత్తున సీమాంధ్ర ప్రభుత్వం క్రిష్ణా జలాలకు గండిడికొడుతున్నా ఆంధ్రప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి తో బేషిన్‌ ‌లు బేషజాలాలు లేవనడంలో తెలంగాణ ముఖ్యమంత్రి అంతర్యమేమిటో స్పష్టం చేయాలన్నారు.బ్రిజేష్‌ ‌ట్రిబ్యునల్‌ ‌ముందు,సుప్రీంకోర్టు ముందు తెలంగాణ ప్రభుత్వం బలమైన వాధనలు వినపించి క్రిష్ణా నది జలాలో తెలంగాణ వాటా 575 టిఎంసీలను సాధించాలని డిమాండ్‌ ‌చేసారు.ఈ సదస్సులో తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు పందుల సైదులు,విద్యావంతుల వేదిక నాయకులు కంచి శ్రీనివాస్‌, ‌వి.కొండల్‌,ఆర్‌ .‌విజయ్‌ ‌కుమార్‌ ,‌హరికృష్ణ,సోమయ్య,కేశవులు,కాశయ్య,నాగరాజు,పాశం నరేష్‌ ‌రెడ్డి,భీమారుజున్‌ ‌రెడ్డి,వెంకులు,హరింధర్‌,‌జగదీశ్‌ ‌తదితరులు పాల్గొన్నారు

Leave a Reply