Take a fresh look at your lifestyle.

తెలంగాణ వ్యవహారశైలి దారుణం

పోతిరెడ్డిపాడు విస్తరణ పూర్తి చేస్తాం: మంత్రి అనిల్‌
కర్నూలు, జూన్‌ 28 : ‌తెలంగాణ ప్రభుత్వ వ్యవహార శైలిపై ఏపీ ప్రభుత్వం మరోమారు నిప్పులు చెరిగింది. ఆర్డీఎస్‌ ‌కుడి కాలువ నిర్మాణం సక్రమమే అని, తెలంగాణ ప్రభుత్వం లేనిపోని రాద్దాంతాన్ని సృష్టిస్తోందని ఏపీ నీటిపారుదల మంత్రి అనిల్‌ ‌కుమార్‌ ‌యాదవ్‌ ‌తీవ్రంగా ఆక్షేపించారు. పోతిరెడ్డిపాడును వెడల్పు చేసేందుకు చర్యలు చేపడుతున్నామని, ఏపీ హక్కుగా ఎన్ని నీళ్లను వాడుకోవాలో, అంత నీటిని కచ్చితంగా వాడుకుంటామని స్పష్టం చేశారు. తాము అక్రమంగా ఏ ప్రాజెక్టులూ నిర్మించడం లేదని ఆయన పునరుద్ఘాటించారు. పాలమూరు డిండి, కల్వకుర్తి ప్రాజెక్టులు కూడా అక్రమంగా కట్టారని, ఆనాడు టీడీపీ ప్రభుత్వం వాటిని అడ్డుకోలేకపోయిందని విమర్శించారు. జల సమస్యలన్నీ సామరస్యంగానే పరిష్కరించు కుంటామని అనిల్‌ ‌కుమార్‌ ‌స్పష్టం చేశారు.

రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలను సస్యశ్యామలం చేయడానికి సీఎం జగన్‌ ‌కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఉభయ రాష్ట్రాల మధ్య ఉన్న నీటిపారుదల సమస్యను సామరస్యంగా పరిష్కరించరించేందుకు కృషి చేస్తున్న సమయంలోనే, తెలంగాఫ మంత్రులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం బాగోలేదని తీవ్రంగా మండిపడ్డారు. వైస్సార్‌పై కూడా ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఆ మాటలను తెలంగాణ మంత్రుల విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు. తమ నాయకుడిని ఇష్టమొచ్చినట్లు మాట్లాడతున్నారని, తామూ అలా మాట్లాడగలమని, అయితే సామరస్యంగా పరిష్కరించుకుందామని సీఎం అన్నందుకే అలా మాట్లాడటం లేదని వివరించారు.

ఏపీ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం నీటి వాట తీసుకుంటున్నామని అనిల్‌ ‌కుమార్‌ ‌యాదవ్‌ అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి ఏ హక్కు ఉందో అదే తాము ఉపయోగించుకుం టున్నామని పేర్కొన్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో 881 అడుగుల నీటిమట్టం రాక ముందే తెలంగాణ రాష్ట్ర అక్రమ కట్టడాల ద్వారా నీటిని ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. ఏపిలోని అన్ని ప్రాంతాలకు నీరు చేరాలంటే తాము కూడా ప్రాజెక్ట్, ‌లిప్ట్ ఇరిగేషన్‌ ఏర్పాటు సామార్థ్యాన్ని పెంచుకోవాలని తెలిపారు. నీటి విషయంలో తెలుగుదేశం పార్టీ నేతలు నోరు విప్పడం లేదన్నారు. రాయలసీమ అభివృద్ధికి దోహదపడే పోతిరెడ్డిపాడు సామర్థ్యం లిప్ట్ ఇరిగేషన్‌ ఏర్పాటుపై తెలుగుదేశం నాయకులు మద్దతివ్వకుండా ప్రజలను మోసం చేస్తున్నారు. జూమ్‌ ‌టింగ్‌లకు పరిమితమైన తెలుగుదేశం నాయకులు ప్రజల సమస్యలను పట్టించుకోవడంలేదు. రాయలసీమ వివక్షకులు టిడిపి నేతలే’ అంటూ మంత్రి అనిల్‌ ‌కుమార్‌ ‌యాదవ్‌ ‌మండిపడ్డారు.

Leave a Reply