Take a fresh look at your lifestyle.

పోతిరెడ్డిపాడు పై కేసీఆర్ మొద్దునిద్ర వీడాలి

యువతెలంగాణ పార్టీ వర్కిింగ్ ప్రెసిడెంట్ రాణిరుద్రమ డిమాండ్ 
– పోతిరెడ్డిపాడు పై నిద్రనటిస్తున్న సీఎం కేసీఆర్ వెంటనే మేల్కొని స్పందించాలని యువతెలంగాణ పార్టీ వర్కిింగ్ ప్రెసిడెంట్ రాణిరుద్రమ రెడ్డి బుధవారం డిమాండ్ చేశారు. రాయలసీమను రతనాలసీమ చేస్తానన్న కేసీఆర్ ముందు పోతిరెడ్డిపాడు సంగతి తేల్చాలని, అమ్మకు అన్నం పెట్టనోళ్ళు పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తా అన్నట్లు కేసీఆర్ తీరు ఉందన్నారు. సీఎం కేసీఆర్ ఎన్నికల హామీ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల సామర్థ్యాన్ని 3 టిఎంసిలకు పెంచాలి. ప్రాజెక్టు కోసం తీసుకునే నీటిని 60రోజుల నుండి 30 రోజులకు తగ్గించాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టులాంటి జీవో నెంబరు 203ను కేసీఆర్ వెంటనే రద్దు చేయించాలన్నారు. పాలమూరు-రంగారెడ్డి ని కాళేశ్వరం లో విలీనం చేసి తీసుకున్న 10వేల కోట్ల రుణం ఏం చేశారో లెక్కచెప్పాలని ఆమె డిమాండ్ చేశారు

Leave a Reply