Take a fresh look at your lifestyle.

పదో తరగతి పరీక్షలు వాయిదా…!

  • రాష్ట్ర వ్యాప్తంగా నిలిపివేత….
  •  పరీక్షలపై తొలిగిన ఉత్కంఠ  

తెలంగాణలో పదో తరగతి పరీక్షలను వాయిదా వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జీహెచ్‌ఎమ్‌సీ, రంగారెడ్డి జిల్లాలు మినహా మిగతా ప్రాంతాల్లో పరీక్షలు నిర్వహించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు అనుమతి ఇవ్వగా.. ఇది సాధ్యం కాదని భావించిన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొరోనా తీవ్రత తగ్గాక టెన్త్ ‌పరీక్షలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం తీర్పును అనుసరించి రాష్ట్రంలో జరిగే 10 వ తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర విద్యా శాఖా మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. 10 వ తరగతి పరీక్షల విషయంలో అనుసరించాల్సిన వ్యూహం గురించి త్వరలో ముఖ్యమంత్రి వద్ద సమావేశం నిర్వహించి తదుపరి నిర్ణయాన్ని ప్రభుత్వం ప్రకటిస్తుంది.

రంగారెడ్డి,హైదరాబాద్‌ ‌మినహా అంతటా పరీక్షలు
టెన్త్ ‌పరీక్షలకు హైకోర్టు గ్రీన్‌ ‌సిగ్నల్‌
‌పదో తరగతి పరీక్షలు వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం కు ముందు తెలంగాణలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. గ్రేటర్‌ ‌హైదరాబాద్‌, ‌రంగారెడ్డి మినహా రాష్ట్ర వ్యాప్తంగా టెన్త్ ‌పరీక్షలు నిర్వహణకు అనుమతిని ఇచ్చింది. కరోనా వైరస్‌ ఉధృతి కొనసాగుతున్నందున రంగారెడ్డి, హైదరాబాద్‌ ‌జిల్లాల పరిధిలో పరీక్షలను వాయిదా వేసింది. జీహెచ్‌ఎం‌జీ పరిధిలోని విద్యార్థులకు సప్లమెంటరీ పరీక్షలకు అనుమతించాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో కరోనా వైరస్‌ ‌కారణంగా వాయిదా పడ్డ పదో తరగతి పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. విద్యార్థులకు వైరస్‌ ‌వ్యాప్తి చెందకుండా పరీక్షా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖను న్యాయస్థానం ఆదేశించింది. పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ బాలకృష్ణ, సాయిమణి వరుణ్‌లు వేర్వేరుగా దాఖలు చేసిన వ్యాజ్యాలపై శనివారం ధర్మాసనం వీడియో కాన్ఫరెన్స్ ‌ద్వారా విచారణ సందర్భంగా హైకోర్టు తుది తీర్పును వెలువరించింది. హైకోర్టు తాజా తీర్పుతో పరీక్షలు నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థుల మధ్య భౌతిక దూరం పాటించేలా ఏర్పాటు చేయనుంది.పదో తరగతి పరీక్షల నిర్వహణపై హైకోర్టులో శనివారం కూడా విచారణ జరిగింది. పంజాబ్‌ ‌తరహాలో పరీక్షలు లేకుండా విద్యార్థులకు గ్రేడింగ్‌ ఇవ్వాలని పిటిషనర్‌ ‌వాదించారు. తెలంగాణ ప్రభుత్వం పరీక్షల వ్నిద దృష్టి పెడుతోందని, అయితే, రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదని పిటిషనర్‌ ‌వాదించారు. పంజాబ్‌ ‌తరహాలో పరీక్షలు లేకుండానే విద్యార్థులకు గ్రేడింగ్‌ ఇవ్వాలని పిటిషనర్‌ ‌వాదించారు. పరీక్షలు లేకుండా గ్రేడింగ్‌ ఇస్తే ఇబ్బందేంటని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. తెలంగాణ ప్రభుత్వం పదో తరగతి సప్లిమెంటరీ ఎగ్జామ్స్‌లో ఉత్తీర్ణులైన విద్యార్థులను రెగ్యులర్‌గా గుర్తించాలని నిర్ణయించింది. దీనిపై ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ నిర్ణయాన్ని అడ్వకేట్‌ ‌జనరల్‌ ‌ప్రసాద్‌ ‌హైకోర్టుకు నివేదించారు. ఎస్‌ఎస్‌సీ బోర్డు డైరెక్టర్‌ ‌సత్యనారాయణరెడ్డి వీడియోకాన్ఫరెన్స్ ‌ద్వారా విచారణకు హాజరయ్యారు. అలాగే, ప్రస్తుతం జీహెచ్‌ఎం‌సీ, రంగారెడ్డి మినహా మిగతా జిల్లాల్లో మాత్రమే పరీక్షలు నిర్వహించాలని హైకోర్టు సూచించింది. దీనిపై అడ్వకేట్‌ ‌జనరల్‌ అభ్యంతరం తెలిపారు. రాష్ట్రంలో వేర్వేరుగా పరీక్షలు నిర్వహించడం కష్టమని పేర్కొన్నారు.

ప్రశ్నపత్రం మళ్లీ మళ్లీ తయారుచేయడం ఇబ్బంది అవుతుందన్నారు. అయితే, విద్యార్థుల ప్రాణాలు ముఖ్యమా.. సాంకేతిక అంశాలు ముఖ్యమా అని కోర్టు ప్రశ్నించింది. దీనిపై ప్రభుత్వాన్ని సంప్రదించి నిర్ణయం చెబుతామని హైకోర్టుకు ఏజీ తెపడంతో విచారణ వాయిదా పడింది. మొత్తంగా తెలంగాణలో పదో తరగతి పరీక్షల నిర్వహణపై హైకోర్టు వేదికగా ఉత్కంఠ కొనసాగుతోంది. కరోనా నేపథ్యంలో పదో తరగతి పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ బాలకృష్ణ, సాయిమణి వరుణ్‌లు వేర్వేరుగా దాఖలు చేసిన వ్యాజ్యాలపై శనివారం ధర్మాసనం వీడియో కాన్ఫరెన్స్ ‌ద్వారా విచారించింది. ఈ సందర్భంగా జీహెచ్‌ఎం‌సీ, రంగారెడ్డిలో కాకుండా తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పరీక్షలు నిర్వహంచడం సాధ్యమవుతుందా అని న్యాయస్థానం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పంజాబ్‌ ‌తరహాలో పరీక్షలు లేకుండానే విద్యార్థులకు గ్రేడింగ్‌ ఇవ్వాలని పిటిషనర్‌ ‌వాదించారు. దీనికి న్యాయస్థానంస్పందిస్తూ.. అసలు పరీక్షలు నిర్వహించకుండా విద్యార్థులకు గ్రేడింగ్‌ ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా? అని ఉంటే వెంటనే తమకు తెలియజేయాలని కోరింది. పరీక్షలు లేకుండా గ్రేడింగ్‌ ఇస్తే ఇబ్బందేంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ధర్మాసనం ప్రశ్నలకు స్పందించిన అడ్వకేట్‌ ‌జనరల్‌ ‌బీఎస్‌ ‌ప్రసాద్‌.. ‌రాష్ట్రంలో వేర్వేరుగా పరీక్షలు నిర్వహించడం కష్టమని పేర్కొన్నారు. ప్రశ్నపత్రం మళ్లీ మళ్లీ తయారుచేయడం ఇబ్బంది అవుతుందని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఏజీ వాదనపై న్యాయస్థానం ఘాటుగా స్పందించింది. విద్యార్థుల ప్రాణాలు ముఖ్యమా..సాంకేతిక అంశాలు ముఖ్యమా అని ప్రశ్నించింది. దీనిపై ఏజీ స్పందిస్తూ.. ప్రభుత్వాన్ని అడిగి పూర్తి వివరాలను తెలియజేస్తానని సమాధానమిచ్చారు. ఇక కరోనా తీవ్రత కారణంగా పదో తరగతి పరీక్షలు రాసేందుకు ఆసక్తి చూపని విద్యార్థులు ఆగస్టు, సెప్టెంబర్‌లో జరిగే సప్లిమెంటరీలో పరీక్షలు రాస్తే వార్షిక పరీక్షలకు హాజరైనట్లుగా పరిగణిస్తారా లేదా అని ధర్మసనం అడగ్గా.. సప్లిమెంటరీ ఉత్తీర్ణులను రెగ్యులర్‌గానే పరిగణించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్వకేట్‌ ‌జనరల్‌ ‌హైకోర్టుకు నివేదించారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy