Take a fresh look at your lifestyle.

స్వతంత్ర ప్యానెల్ సర్జన్ల తో పోస్ట్‌మార్టం నిర్వహించాలి ..!

న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ప్రజాసంఘాలు 
హైదరాబాద్,సెప్టెంబర్ 16: సింగరేణి కాలనీ లో  మైనర్ బాలికపై అత్యాచారం, హత్య కేసులో నిందితుడి అనుమానాస్పద మరణంలో చట్ట బద్ధమైన ప్రక్రియను కోరుతూ, సుప్రీంకోర్టు & ఎన్ హెచ్ఆర్ సి  ఆదేశాల ప్రకారం స్వతంత్ర ప్యానెల్ సర్జన్ల తో పోస్ట్‌మార్టం నిర్వహించడానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ   మహిళా, మానవ హక్కుల, ప్రజా సంఘాలు కోర్టును ఆశ్రయించాయి.
గురువారం న్యాయ మూర్తి  కి సమర్పించిన  విజ్ఞప్తి లో ..ప్రస్తుతం ఈ సింగరేణి కాలనీ కేసులో కూడా నిందితుని ‘అదృశ్యం’ ఆ తర్వాత ఆకస్మిక ‘మరణం’ గురించిన అనేక అనుమానాలున్నాయనీ … చిన్నారి  హత్య జరిగిన ఒక వారంలోనే నిందితుడు పల్లంకొండ రాజు (30) ‘కనిపించకుండా పోయాడు’. అతనిని వెతకడానికి పోలీసులు భారీ బహుమతి ప్రకటించి ‘మాన్ హంట్’ ప్రారంభించారు. ఇప్పుడు అకస్మాత్తుగా అతను ‘చనిపోయినట్లు’ గుర్తించారు. .ఇవన్నీ చాలా అనుమానాలను రేకెత్తిస్తన్నాయని పేర్కొన్నారు..
ఈ నేపథ్యంలో  న్యాయస్థానం తక్షణమే జోక్యం చేసుకోవాలని, ఈ కేసును న్యాయస్థానం ఆధ్వర్యంలో పర్యవేక్షించాల్సిందిగా కోరారు..23 సెప్టెంబర్, 2014 నాటి  పీయుసిఎల్ వర్సెస్ మహారాష్ట్ర తీర్పులో సుప్రీంకోర్టు  మార్గదర్శకాలు జారీ చేసింది. జాతీయ మానవ హక్కుల సంఘం  జారీ చేసిన మార్గదర్శకాలు కూడా అమలులో వున్నాయి. ఇప్పుడు వాటి అమలులో   ఈ న్యాయస్థానం గనుక ఉత్తర్వులు జారీ చేయడంలో  ఆలస్యం జరిగితే, రాష్ట్ర అధికారులు త్వరితగతిన పోస్ట్ మార్టం నిర్వహించి, మృతదేహాన్ని దహనం చేసే అవకాశం వుంది. దీనివలన అసలు వాస్తవాలు మరుగు పడే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు.
human rights forus
న్యాయస్థానం నుండి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు దహన సంస్కారాలను నిలిపివేయాలని,  అదేవిధంగా  ఈ సంఘటన కు సంబంధించిన అన్ని సీసీటీవీ ఫుటేజీని కోర్టుకి అధికారులు సమర్పించాలని, నిందితుడు  పల్లకొండ రాజు మృతదేహాన్ని సంరక్షించాలని తెలంగాణ రాష్ట్ర హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి వెంటనే ఆదేశాలు ఇవ్వవలసిందిగా   వి. సంధ్య, కె. సజయ, కె. సత్యవతి, ఏ. సునీత , దేవి, దీప్తి, సయ్యద్ బిలాల్   విజ్ఞప్తి చేసారు.

Leave a Reply