కొంతకాలంగా భాగ్యనగరం కొరోనా కేసులతో సతమతమవుతూ, ఇటీవలే కేసులు కాస్త తగ్గు ముఖం పడుతుండడంతో ఉపిరి పీల్చుకుంటున్న భాగ్యనగర వాసులకు ఆకాశం నుంచి వర్షం రూపంలో పెను ఉపద్రవం వచ్చిపడింది. ఆ వర్షం వందసంవత్సరాల క్రితం కురిసిన వర్షాలను తలపిస్తూ నగరానికి అనుకోని ఉన్న చెరువులన్నీ ఉప్పొంగి జనావాసాలలోకి ప్రవహించి బీభత్సం సృష్టించాయి. భారీ వరదల కారణంగా నగరంలోని అనేక ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. దీంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. ఈ వరదల దాటికి, ప్రాణనష్టంతో పాటు, ఎంతో ఆస్తి నష్టం కలుగగా, రాత్రికి రాత్రి వరద నీరు ఇళ్లల్లోకి చేరి పలు ఇళ్లు, ఇళ్లల్లోని వస్తువులు దెబ్బతిన్నాయి. చాలా చోట్ల, సరుకు మునిగిపోయి, నానిపోయి, కొట్టుకు పోయి వ్యాపారస్తులు కూడా తీవ్ర నష్టాలు చూడాల్సివచ్చింది. ఇప్పటికీ కొన్నిచోట్ల షాపుల్లోంచీ, గోడౌన్లలో నుంచీ నీరు బయటకు వెళ్లలేదు. ఇప్పుడు ఈ వరదల వల్ల మురికి నీరు ఇండ్లలోకి ప్రవహించింది.
పట్టణ శివారులలోని చెత్త, వ్యర్థ పదార్థాలు నీటితో పాటు కొట్టుకు రావడంతో నీటి కాలుష్యం జరిగే ఆస్కారం చాలా ఉంది. పరిశుభ్రమైన నీరు దొరకకపోవడం, లభించే నీటిని శుద్ధిచేసే ఆస్కారం చాలా మందికి లేకపోవడంతో అంటువ్యాదులు ప్రభలే ఆస్కారం చాలా ఉంది. దీనితో పాటు ప్రమాదకరమైన దోమలు, వైరస్ల భారినపడే ఆస్కారం ఉంది. వీటి• •తోడు కరోనా వైరస్ ఇంకా ప్రజల మధ్యనే ఉండటంతో, కరోనా మరింత విజృంభించే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే, జీహెచ్ఎంసీ పరిధిలో 165కుపైగా సహాయక శిబిరాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2వేలమందికి పైగా ప్రజలను ఆ శిబిరాలకు తరలించింది. కాగా, కొరోనా నేపథ్యంలో వీరందరికి పరీక్షలు నిర్వహించారు. ఈక్రమంలో శిబిరాల్లోని 19 మందికి కొరోనా సోకినట్లు తేలింది. కొరోనా సోకిన వారందర్నీ చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.
ఇక లోతట్టు ప్రాంతాల ప్రజల పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. ప్రజలను పరామర్శించడానికి ప్రజాప్రతి నిధులు బోట్లలో రావాల్సివస్తోంది. సహాయక సిబ్బంది కూడా బోట్లలోనే వచ్చి నిత్యావసర వస్తువులను అందిస్తున్నారు. పలుకాలనీల్లో ప్రజలు బయటకు రాలేని పరిస్థితిఉంది. ఇది ఇలాఉండగా తెలంగాణ రాష్ట్రముఖ్య మంత్రి కేసీఆర్ వరదల వల్లనష్టపోయిన ప్రజలకు అండగా నిలుస్తానని సోమవారం తెలిపారు. పేద ప్రజల కోసం తక్షణమే రూ.550 కోట్లు రూపాయలు విడుదల చేస్తున్నట్టు తెలిపారు. వరదనీటి వల్ల నష్టపోయిన, లేదా ముంపునకు గురైన ప్రతీ ఇంటికి రూ.10 వేల సాయం అందిస్తామన్నారు, ఒకవేళ ఇళ్లు కూలి పోతే రూ. లక్షఆర్థిక సాయం చేస్తామని, పాక్షికంగా దెబ్బతిన్న వారికి రూ.50 వేలు అందిస్తాం అన్నారు. అదే సమయంలో వరదల వల్ల దెబ్బ తిన్న మౌలిక సదు పాయాలను వీలైనంత త్వరగా మరమ్మత్తులు చే• •ప్రజలకు అందు బాటులోకి తీసుకు రావాలని అధి కారు లకు సూచి ంచడం జరిగింది.