Take a fresh look at your lifestyle.

రెండు డోసులు తీసుకున్నాక కూడా ఛత్తీస్‌ఘడ్‌లో జిల్లా కలెక్టర్ కు పాజిటివ్‌

‌కొవిడ్‌-19 ‌వ్యాక్సిన్‌ ‌రెండు మోతాదులు తీసుకున్న కొద్ది రోజులకే ఛత్తీస్‌గఢ్‌లోని ఓ జిల్లా మెజిస్ట్రే ‌కొరోనా బారిన పడ్డారు. ఆయనకు జరిపిన పరీక్షక్షల్లో పాజిటివ్‌గా గుర్తించారు. జాంజ్‌గిర్‌-‌చంపా కలెక్టర్‌ ‌యశ్వంత్‌కుమార్‌ ‌గురువారం మహమ్మారి బారినపడ్డారు. ఆయన ఈ విషయాన్ని ట్విట్టర్‌ ‌ద్వారా ధ్రువీకరించారు. ఇటీవల తనను కలిసిన వారంతా కొరోనా పరీక్షలు చేయించు కోవాలని సూచించారు. యశ్వంత్‌కుమార్‌ ‌కొవిడ్‌కు వ్యతిరేకంగా ఫిబ్రవరి 8న వ్యాక్సిన్‌ ‌తొలి డోసు తీసుకున్నారు. మళ్లీ ఈ నెల 8న రెండో డోసు తీసుకున్నారు.

ఈ క్రమంలోనే ఆర్టీపీసీఆర్‌ ‌పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా పరీక్షించారు. అలాగే కార్యాలయ సిబ్బందికి సైతం కొవిడ్‌ ‌పరీక్షలు చేయగా నెగెటివ్‌ ‌వచ్చింది. దీంతో ఆయన ఐసోలేషన్‌లో ఉన్నారు. అయితే టీకాలపై వచ్చే ఎలాంటి పుకార్లను నమ్మొద్దని కోరారు. రెండో మోతాదు తీసుకున్న 14 రోజుల తర్వాత వ్యాక్సిన్‌ ‌ప్రభావంతంగా మారుతుందని పేర్కొన్నారు.

Leave a Reply