Take a fresh look at your lifestyle.

తెలంగాణ లో మళ్లీ పెరిగిన పాజిటివ్ కేసులు

తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు

తెలంగాణలో గత రెండు రోజులుగా కాస్త తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు.. మళ్లీ పెరిగాయి… తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం… గత 24 గంటల్లో రాష్ట్రంలో 2479 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి, 10 మంది మృతి చెందారు. దీంతో… పాజిటివ్ కేసుల సంఖ్య 1,47,642కు చేరుకోగా… ఇప్పటి వరకు 916 మంది మృతిచెందారు.. మరోవైపు గత 24 గంటల్లో 2,485 మంది కరోనా నుంచి కోలుకున్నారు… దీంతో.. ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 1,15,072కు పెరిగింది. రికవరీ రేటు దేశవ్యాప్తంగా 77.76 శాతంగా ఉండగా… రాష్ట్రంలో 77.9 శాతంగా ఉందని… బులెటిన్‌లో పేర్కొంది తెలంగాణ ప్రభుత్వం. ప్రస్తుతం రాష్ట్రంలో 31,654 యాక్టివ్ కేసులు ఉండగా… వీరిలో 24,741 మంది హోం ఐసోలేషన్‌లోనే ఉన్నారు. ఇక, 322 కొత్త కేసులతో హైదరాబాద్‌ టాప్‌ స్పాట్‌లో ఉండగా… కరీంనగర్‌ 120, మేడ్చల్ 183, నల్గొండ 108, నిజామాబాద్‌ 101, రంగారెడ్డి జిల్లాలో 188, వరంగల్ అర్బన్ 124 కొత్త కేసులు వెలుగుచూశాయి.

Leave a Reply