పెరుగుతున్న రికవరీ రేటు
తగ్గుతున్న కోవిడ్ కాటు
జరంత కంట్రోల్ కొచ్చిందంట
తొందర్లోనే కట్టడి అవుతుందంట
కర్ఫ్యూ, లాక్ డౌన్ తో దారికొచ్చింది
యాభై శాతం తగ్గుదల కనిపించింది
దవఖానాల్లో వసతులు కల్పించిండ్లు
చికిత్సతో బాగై బయిటకు వస్తాండ్లు
కొరోనా వార్తల్లో మసాలా కూర్చొద్దట
మీడియా అతితో మందిని భయపెట్టొద్దట
చేపట్టిన చర్యలతో ఫలితాలు పాజిటివ్!
అప్రమత్తంగా ఉంటేనే ప్రజలకు నెగిటివ్!!
కత్తెరశాల కుమార స్వామి
సీనియర్ జర్నలిస్టు, ప్రజాతంత్ర