Take a fresh look at your lifestyle.

తెలంగాణ ద్రోహులకు పదవులు

  • కెసిఆర్‌ ‌చుట్టూ దొంగలే..ఉద్యమకారులు లేరు
  • స్వప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు
  • రౌండ్‌ ‌టేబుల్‌ ‌సమావేశంలో ప్రతిపక్షాల ధ్వజం
  • కేసీఆర్‌ ‌నైజాన్ని క్రమంగా ప్రజలు తెలుసుకుంటున్నారన్న రేవంత్‌ ‌రెడ్డి

కృష్ణాజలాలు, తెలంగాణ సమస్యలపై సిఎం కెసిఆర్‌ ‌ప్రజలను మోసం చేస్తున్నారని పలువురు నేతలు మండిపడ్డారు. తెలంగాణ ప్రయోజనాలు తాకట్టుపెట్టి స్వప్ర యోజనాల కోసం కెసిఆర్‌ ‌పాటు పడు తున్నారని విమర్శించారు. తెలంగాణ జర్నలిస్ట్ ‌ఫోరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వక్తలు మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్‌ అసలు నైజం ఇప్పుడిప్పుడే అందరికీ తెలుస్తోం దన్నారు. తనకు ముందే తెలుసని..అందుకే ముందు నుంచే కేసీఆర్‌పై పోరాటం చేస్తున్నానని తెలిపారు. తెలంగాణ ఉద్యమ కారులను ఒక్కొక్కరిని దూరం పెట్టారని ఆరోపించారు. తెలంగాణపై విషం కక్కిన వాళ్లే ఇప్పుడు కుర్చీలో కూర్చుకున్నారన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని చేసిన వివేక్‌ ‌వెంకట స్వామి, జితేందర్‌ ‌రెడ్డిలకు ఎందుకు టికెట్‌ ఇవ్వలేదని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమం చేస్తున్న విద్యార్థులను గల్లీల వెంట ఉరికించి కొట్టిన శ్రీనివాస్‌ ‌యాదవ్‌ను మంత్రి చేశారన్నారు. ప్రస్తుతం కేసీఆర్‌ ‌చుట్టూ ఉద్యమకారులు లేరు..మొత్తం దొంగలే ఉన్నారన్నారు. తెలంగాణ సెంటిమెంట్‌ అనే ముసుగును కప్పుకుని కేసీఆర్‌ ‌తిరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెంటిమెంట్‌ అనే బొంతను గుత్ప పట్టుకొని ఊడ కొట్టాలన్నారు. కేసీఆర్‌ అనే గాడిదను దారిలో పెట్టాలని అన్నారు. వెనకటికి రాజ్యాలను జయించిన రాజులు ఆ దేవ సంస్క•తిని సర్వనాశనం చేసేవారని, బ్రిటిష్‌ ‌వాళ్లు అదే చేశారని, ఇప్పుడు కెసిఆర్‌ అదే చేస్తూ తన చరిత్రను రాయాలని అనుకుంటున్నాడని అన్నారు.

అంతేకాదు కేసీఆర్‌ ‌శకాన్ని రాయలనుకుంటున్నాడు.. భవిష్యత్‌ ‌తరాలకు తానే గొప్పలా చెబుకోబోతున్నాడు..ఇది చాలా ప్రమాదం ఉందని రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. కేసీఆర్‌ను దించితే తప్పితే తప్ప తెలంగాణకు పట్టిన శని వదలదన్నారు. ప్రతిపక్షం ఉండాలని ఎప్పటినుంచో చెప్పుకుంటూ వస్తున్నానన్నారు రేవంత్‌. ‌ప్రతిపక్ష పార్టీలు ఉంటే ప్రభుత్వం తప్పులు సరిదిద్దుకునే అవకాశం ఉంటుందన్నారు. చిన్నచిన్న తాయిలాల కోసం జర్నలిస్టులు కూడా లొంగారన్నారు. ఆరేళ్లుగా ప్రతి నిమిషం.. ప్రతిక్షణం వంచన చేస్తూ కేసీఆర్‌ ‌వచ్చారని రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. ఈ క్రమంలొ తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్‌, ‌జగన్‌పై ఎంపీ రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ ‌తెలంగాణకు పట్టిన చీడ అని ధ్వజమెత్తారు. కేసీఆర్‌ ‌నైజం క్రమంగా ప్రజలు తెలుసుకుంటున్నారని తెలిపారు. ఉద్యమకారులంతా కేసీఆర్‌ ‌చేత అణిచివేయబడ్డారని, కేసీఆర్‌ ‌ప్రతిపక్షాల హక్కులను ధ్వంసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణకు కాపలా కుక్కగా ఉంటానన్న కేసీఆర్‌ ఏం ‌చేస్తున్నారు? అని రేవంత్‌ ‌ప్రశ్నించారు. తెలంగాణకు శాశ్వత విముక్తి కోసం తుదిదశ పోరాటం జరగాలని, ఏ పదవి లేకపోయినా పోరాటానికి తాను సిద్ధమని రేవంత్‌రెడ్డి తేల్చిచెప్పారు. ‘టీజేఎస్‌ అధినేత కోదండరామ్‌కు రాజకీయ పార్టీ సరిపోదు. రాజకీయాలకు అతీతంగా ఒక వేదిక ఏర్పాటు చేయండి’ అని రేవంత్‌రెడ్డి కోరారు. ‘వైఎస్‌ ‌రాజశేఖర్‌రెడ్డి కొడుకు ఆయనలాగే ఉంటాడు.

వైఎస్‌ ‌పోతిరెడ్డిపాడుకు పొక్క పెడితే జగన్‌ ‌దాన్ని పెద్దగా చేస్తున్నారు. కృష్ణా బేసిన్‌ ‌నుంచి తెలంగాణ ఎత్తిపోసుకుంటున్నది కేవలం ఒక్క టీఎంసీ మాత్రమే.. ఏపీ 12 టీఎంసీలు ఎత్తిపోసుకునే పనులు చేస్తోంది. అదే సమయంలో పవర్‌ ‌ప్రాజెక్టులను చంపే కుట్ర జరిగుతోంది. పాత విద్యుత్‌ ‌ప్రాజెక్టులను చంపి కొత్తవి కట్టాలని ప్లాన్‌ ‌చేస్తున్నారు. ఉద్యమకారులను పక్కన పెట్టి పెట్టుబడిదారులకు టికెట్లు ఇచ్చారు. ఉద్యమ కారులను తరిమి కొట్టిన తలసాని శ్రీనివాస్‌కు మంత్రి పదవి, తన కొడుక్కి ఎంపీ టికెట్‌ ఇచ్చారు. కేసీఆర్‌ను దించితే తప్ప రాష్ట్రంలో పరిస్థితి మారదు అని రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. కేసీఆర్‌కు మాటలు తప్ప చేతలు లేవని టీడీపీ సీనియర్‌ ‌నేత ఎల్‌.‌రమణ అన్నారు. అన్ని జిల్లాలు సమానంగా అభివృద్ధి చెందాలన్నారు. సీఎం జగన్‌ ‌కృష్ణా జలాల దోపిడీని అడ్డు కోవడానికి తెలంగాణ టీడీపీ కూడా కలిసి వస్తుందన్నారు. కేసీఆర్‌ ‌ప్రభుత్వం నిర్లక్షంగా వ్యవహరిస్తోందన్నారు. రీ డిజైన్‌తో కషన్‌ ‌బాగా వస్తుందని సీఎం కేసీఆర్‌కు తెలుసని బీజేపీ నేత వివేక్‌ ‌పేర్కొన్నారు. జగన్‌కు ఎన్నికల్లో ఇచ్చిన పైసలు వసూలు చేయడం కోసమే… పోతిరెడ్డిపాడుకు కేసీఆర్‌ ‌సహకరిస్తున్నారని విమర్శించారు. కాళేశ్వరం కషన్లతో కల్వకుంట్ల ఫ్యామిలీ మొత్తం ఫాంహౌస్‌లు కట్టుకుందని ఆరోపించారు. వర్షం నీళ్లను కాళేశ్వరం నీళ్లుగా చూపి ప్రజలను మభ్యపెడుతున్నారని వివేక్‌ ‌విమర్శించారు. రైతులను మభ్యపెట్టడంలో సీఎం కేసీఆర్‌ ఎక్స్‌పర్ట్ అని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. మాయమాటలు చెప్పి రైతుల వోట్లతో కేసీఆర్‌ ‌గెలిచారని, అదే గాలిలో ముక్కుమొహం తెలియని వారు ఎమ్మెల్యేలు అయ్యారని తెలిపారు. తాము 24 గంటలు జనాల్లో ఉన్నా ఎన్నికల ముందు.. కేసీఆర్‌ ‌తెచ్చే రైతు పథకాల వల్ల ప్రతిపక్షాలు ఓడితున్నాయని తెలిపారు. రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ దేశంలో ఐదో స్థానంలో ఉందని, రాష్ట్రంలో కౌలు రైతులకు ప్రోత్సాహం లేదని జగ్గారెడ్డి విమర్శించారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply