Take a fresh look at your lifestyle.

పోరుదండాలు

భూమి కొరకు, భుక్తి కొరకు
యెట్టినుండి ముక్తి కొరకు
తెగబలిసిన జమీందారు
నరహంతక నైజాము ల
యెదురొడ్డిన తెలగాణ తెగువ
ఒడిసెల కారము తొ మగువ


గుతుపల సంఘములు కలువ
బరాబరిగ తలపడినవి
అంతిమ విజయము కలుగ
అడుగడుగున గడీలున్న
గండాల తెలగాణము
జడుసుకొని ముడుసుకొన్న
బుసలు కొట్టు నాగము

కడివెండి,ముస్నూరు,
పరకాల,మానాల,
గాలిపగెల్లి,బైరాన్పల్లి
అణువణువున తెలంగాణ
వీరత్వము పులుముకొని
నెత్తుటి యేరులు పారిన
పంట సిరులు పొగసూరిన
చితి మంటలు యెగబాకిన
తూటాలకు యెదురు నిల్సి
మహమ్మదా పూరు గుట్టల్లో
మోగించెను అన’’భేరీ’’

పోరుపల్లి గాలిపెల్లీ రజాకారు
మోకరిల్ల
యుద్ద పటిమ పొటమరించే
ఘనుడగు మన ‘‘బద్దం’’
తూరుపు సింధూరమయ్యి
రౌద్రనేత్ర రుద్రులయ్యి
‘‘కొమురయ్యలు, ఐలమ్మ లు’’
రాజేసిన పోరు మంట

ఇంతింతంతై దునియంతై
పతుల ముందు సతుల చెరచి,
వలువలూడ్సి,బతుకమ్మ పేర్సి
నగ్నంగా ఆడించిన నరహంతక నైజామును
పాతాళము పడదొక్కిన
మాగాణము తెలగాణము

మలిదశలో మనపాలన కై దశాబ్దాల త్యాగాలు,
ఈనగాచి నక్కలకు అర్పించిన నైజాలు,
మోసగాల్లు,స్వార్థ పరుల గానా బజానాలు,
తల్లి తెలంగాణ కంట కన్నీటి కాలువలు
కోటలు పేటలు గూలే
రాజులు రాజ్యము మారే
అహంకార అధినేతల
పీడగూడ సమసునులే…

జమ్మీ
(మీస రాజ మల్లయ్య)

9 4 9 13 1 9 9 0 4

Leave a Reply