Take a fresh look at your lifestyle.

జనాభా పెరుగుదల – సమస్యలపై అవగాహన ఉండాలి!

నేడు ప్రపంచ జనాభా దినోత్సవం
మనభూమి ఒక గ్రహము. ఈ భూమి పై అనేక జాతులకు చెందిన జీవులు నివసిస్తాయి. కానీ భూ ప్రపంచంలో నివసిస్తున్న మానవుల సంఖ్య గురించి తెలిపేందుకు ఒక ప్రత్యేకమైన రోజును ప్రకటించింది ఐక్యరాజ్యసమితి. 1987నాటికి 5 బిలియన్ల జనాభా ప్రజల ఆసక్తితో ఒక ప్రత్యేకమైన రోజు ఏర్పాటు చేసుకోవాలని కొన్ని దేశాలు నిర్ణయి ంచాయి. దానికనుగుణంగా ఐక్యరాజ్యసమితి పాలకమండలి 1989 లో సమావేశమై జూలై 11న ‘‘ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించింది. ఆ క్రమంలో 1990లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో 45/216 తీర్మానం మేరకు జూలై 11 తేదీన ప్రపంచ జనాభా దినోత్సవాన్ని కొనసాగించాలని తీర్మానించింది. ప్రపంచంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా జనాభా యొక్క సమస్యలు పై అవగాహన, పర్యావరణ అభివృద్ధి జనాభా యొక్క ప్రభావము, ఆరోగ్య సమస్యలు, కుటుంబ నియంత్రణ వంటివాటిపై పై ప్రజలకు అవగాహన కల్పించడం, ఆ సమస్యల ను ఎదుర్కొనుటకు తగిన సలహాలు సూచనలు ఇవ్వడం, పేదరికము, మానవ హక్కుల ప్రాముఖ్యత, లింగ వివక్షత మొదలైన వాటి గురించి ఒక వేదిక ద్వారా తెలుసుకోవడం కోసం ప్రపంచ జనాభా దినోత్సవం ప్రాముఖ్యత గా చెప్పుకోవచ్చు.. ప్రపంచవ్యాప్తంగా 225 దేశాల్లో చైనా మొదటి స్థానంలో అత్యధిక జనాభా కలిగి, రెండో స్థానంలో భారతదేశం, మూడో స్థానంలో యునైటెడ్‌ ‌స్టేట్స్ ఉం‌ది.

గణాంకాల ప్రకారం ప్రపంచంలో ప్రతి 5 సెకన్లకు 21 మంది పిల్లలు జన్మిస్తున్నారు. మరణాల రేటును బట్టి చూస్తే 1950 లో 6.3 నుండి 3.1 కి తగ్గింది. భారతదేశంలో ప్రతి చదరపు కిలోమీటరుకు 190 మంది నివసిస్తున్నారు. ఉత్తర ప్రదేశ్‌, ‌తమిళనాడు, బీహార్‌ ‌రాష్ట్రాలు అత్యధిక జనసాంద్రత కలిగిన వి.2017 లెక్కల ప్రకారం ప్రపంచంలో అతి తక్కువ జనాభా గల దేశం వాటికన్‌ ‌సిటీ. దీని జనాభా వెయ్యి మంది మాత్రమే, ఈ సిటీలో మహిళలు మాత్రమే నివసిస్తున్నారు. గత గణాంకాల ప్రకారం గా 1800 సంవత్సరంలో ప్రపంచ జనాభా ఒక బిలియన్‌, 2000 ‌సంవత్సరం ప్రారంభం నాటికి ఆరు బిలియన్ల రికార్డు స్థాయిలో జనాభా పెరిగింది, 2022 నాటికి సుమారు ఎనిమిది బిలియన్ల జనాభా పెరుగుతుందని అంచనా. పూర్వకాలంలో క్రీ. పూ.3800 కాలంలో లో బాబిలోనియా రాజ్యములో మొదటి సెన్సెస్‌ ‌ప్రారంభమైన దని చరిత్ర చెపుతున్నది .1790-1870 కాలంలో మొదటి తొమ్మిది సార్లు అమెరిక మార్షల్స్ ‌సహకారంతో 1790 లో మొట్టమొదటిసారిగా యునైటెడ్‌ ‌స్టేట్స్ ‌లో జనవరి ప్రారంభించారు. జనాభా అనేది ఒక క్రమపద్ధతిలో నమోదు చేసే ప్రక్రియ.. అది భారతదేశం లో కౌటిల్యుడు, చాణక్యుడు, అశోక చక్రవర్తి, నాయకత్వంలో క్రీస్తు పూర్వము 330 సంవత్సరంలో జనాభా గణన జరిగిందని చరిత్రకారుల అభిప్రాయం.

ప్రపంచంలో దాదాపు అన్ని దేశాల్లో కొన్ని 1900 సంవత్సరం నుండి జనాభా లెక్కలు ప్రారంభమై నవి.నాడు 1654 మిలియన్ల జనాభా ఉండేది.అప్పటి నుండి ప్రతి 10 సంవత్సరాల కు ఒక సారి జనాభా గణన చేస్తున్నారు .ప్రస్తుతం సుమారు 8బిలియన్ల జనాభా ఉంటే ,రాబోయే రోజుల్లో వంద సంవత్సరాలకు 12 బిలియన్ల పెరుగుతుందని అంచనా. లాక్‌ ‌డౌన్‌ ‌ప్రకటించిన సమయంలో ఆరోగ్య సేవలు,తక్కువ ఆదాయము గల దేశాల సమస్యలను వారికి ఆన్ని రకాల సహాయం చేస్తున్నది. మొట్టమొదటి సారిగా కుటుంబ నియంత్రణ, మానవ కే సమస్యలపై ఐక్యరాజ్యసమితి అభివృద్ధి ప్రణాళిక విభాగం దృష్టిసారించింది. 2018 సంవత్స రంలో 50వ వార్షి కోత్సవం సమావేశం సంద ర్భంగా కు టుంబ నియంత్రణ పై ప్రపం చవ్యాప్త ంగా దృష్టి సారిం చింది. మహిళలకు సురక్షితమైన మరియు సమర్థవంతమైన కుటుంబ నియం త్రణ పద్ధతులకు ప్రాధాన్యత ఇచ్చింది.కుటుంబ నియంత్రణ పొందగలగడం ప్రాథమిక మానవ హక్కుగా ప్రకటించింది. స్వచ్ఛందంగా చేసుకోవాలని సూచించింది. అలాగే లింగ సమానత్వం, మహిళా సాధికారత, పేదరికాన్ని తగ్గించడం వంటి అంశాలకు ఈ సంవత్సరం ప్రాధాన్యత ఇస్తున్నది. ప్రస్తుత పరిస్థితుల్లో జనాభా పెరుగుదలకు అనుగుణంగా ఆయా దేశాలు ప్రజల అవసరాలను, మౌలిక వసతులు కల్పించడంలో దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

ముఖ్యంగా గ్లోబలైజేషన్‌ ‌కారణంగా అన్ని దేశాలు పర్యావరణ హితంగా కార్యక్రమాలు రూపొందించాల్సిన అవసరం ఉంది.జనాభా పెరిగితే పేదరికం పెరుగుతుంది. ఇప్పటికి కూడా సోమాలియా లాంటి దేశాల్లో ఆకలితో అలమటించే ప్రజలు ఉన్నారు. ప్రకృతి వైరీత్యాలతో కొన్ని,దేశాలు,ఆర్థిక సంక్షోభంలో కొన్ని ,నిరుద్యోగం తో కొన్ని దేశాలు ఇలా అనేక దేశాలు సతమత మవుతున్నాయి.ఈ క్రమంలో ఐక్యరాజ్యసమితి ఆర్థిక సామాజిక మండలి అభివృద్ధి చెందిన దేశాల సరసన అభివృద్ధి చెందుతున్న, అభివృద్ధి చెందనిదేశాల సమస్యలను పరిష్కరిస్తూ ప్రజల జీవన ప్రమాణాన్ని పెంచుటకు, వారిపై సమస్యల పరిష్కారానికి అన్ని దేశాలు కలిసికట్టుగా ముందుకు వెళ్తూ, ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారంలో ఐక్యరాజ్యసమితి ఈ వేదిక ద్వారా కృషి చేయాలి.19వ శతాబ్దంలో కాగితపు ద్వారా ప్రారంభమైన జనాభా లెక్క సేకరణ నేడు కరోనా వైరస్‌ ‌వ్యాప్తి వల్ల చాలా దేశాలు 2020 జనాభా లెక్కలను వాయిదా వేశారు.

భారత దేశంలో సైతం ఈ సంవత్సరం గృహ గణ న, 2021 నాటికి జన గణ పూర్తిచేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పటికీ కోవిడ్‌ 19 ‌కారణంగా అర్ధాంతరంగా జనగణన కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేసింది. జనాభా లెక్కలుఅనేది ఆదేశ పౌరులకు నిధుల కేటాయింపు, మౌలిక వసతుల కల్పన, ఆరోగ్య పరిరక్షణ వంటి వాటికి అంచనా వేయుటకు అవసరం కాబట్టి తాత్కాలికంగా జన గణ ను ఆయా దేశాలు వాయిదా వేశాయి.అయినా ప్రజల సమస్యలపై ఐక్య రాజ్య సమితి సమన్వయం చేయాల్సిన అవసరం ఉంది.జనాభా నియంత్రణ మన అందరి సామాజిక భాద్యత.కుటుంబ నియంత్రణ పద్దతిని పాటించేలా అవగాహన కల్పించడంలో మనం ముందు వుందాం.
– కామిడి సతీశ్‌ ‌రెడ్డి, జడలపేట,
జయశంకర్‌ ‌భూపాలపల్లి జిల్లా..

Leave a Reply