Take a fresh look at your lifestyle.

చైనా కిట్లలో నాణ్యత డొల్ల

  • ర్యాపిడ్‌ ‌టెస్ట్ ‌కిట్లను ఇక నుంచీ వాడరాదు
  • ఒక్కరోజే 1396 కొరోనా పాజిటివ్‌ ‌కేసులు
  • కొరోనాతో ఇప్పటివరకూ 872 మంది మృతి
  • కమ్యూనిటీ వ్యాప్తి లేదు:కేంద్ర కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌

చైనా ర్యాపిడ్‌ ‌టెస్ట్ ‌కిట్లను ఇక నుంచీ వాడరాదని రాష్టాల్రను ఐసీఎంఆర్‌ ఆదేశించింది. చైనా ర్యాపిడ్‌ ‌టెస్ట్ ‌కిట్స్‌లో నాణ్యత లోపించిందని ప్రకటించిన ఐసీఎంఆర్‌ ఆయా కిట్లను చైనాకు వెనక్కు పంపించాలని ఆయా రాష్టాల్రను కోరింది. ఇక దేశవ్యాప్తంగా సోమవారం ఒక్కరోజే 1396 కరోనా పాజిటివ్‌ ‌కేసులు వెలుగుచూశాయి. వైరస్‌ ‌మహమ్మారి బారినపడి ఇప్పటివరకూ 872 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 6185 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారని తెలిపింది. మూడు రాష్టాల్లోన్రే 68 శాతం పాజిటివ్‌ ‌కేసులున్నాయని పేర్కొంది. కరోనా వైరస్‌ ‌నుంచి రికవరీ రేటు 22.17 శాతం పెరగడం ఊరట కలిగిస్తోందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ ‌పేర్కొన్నారు. ఇక దేశవ్యాప్తంగా 20,835 కేసులు చురుగ్గా ఉన్నాయని చెప్పారు.

లాక్‌డౌన్‌ ఉల్లంఘనులపై రాష్టాల్రు కఠినంగా వ్యవహరించాలని అన్నారు. రైతులకు కొన్ని సడలింపులు ఇచ్చామని, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం గ్రాణ ఉపాథి హా పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు. కరోనాపై మరో గుడ్‌ ‌న్యూస్‌ ‌చెప్పారు. కరోనా సోకి కోలుకున్న వారి నుంచి కరోనా తిరిగి వ్యాప్తి చెందడం లేదని లవ్‌ అగర్వాల్‌ ‌స్పష్టం చేశారు. అంతేకాదు కరోనా నుంచి కోలుకున్న వారు తమ ప్లాస్మాను డొనేట్‌ ‌చేసి ఇతరులను కాపాడాలని, ఇందులో మరే సందేహాలు పెట్టుకోనవసరం లేదని సూచించారు. దీంతో ఈ విషయంపై నెలకొన్న భయాందోళనలు తొలగిన్లటైంది. చైనా వూహాన్‌తో పాటు అనేక యూరప్‌ ‌దేశాల్లో కరోనా నుంచి కోలుకున్న వారికి మళ్లీ సోకుతోందని, మిగతా వారికి వ్యాప్తి చెందుతుందనే వార్తలు వచ్చాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ మహమ్మారినుంచి ఇప్పట్లో కోలుకోలేమనే అభిప్రాయాలు వెలువడ్డాయి. అయితే ప్రపంచ దేశాల పరిస్థితులకు భిన్నంగా భారత్‌లో కరోనా సోకి కోలుకున్న వారి ద్వారా కరోనా వ్యాప్తి చెందదని కేంద్రం స్పష్టం చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కరోనా నుంచి కోలుకుంటున్నవారి శాతం రోజురోజుకూ పెరగడం కూడా భారత్‌లో సానుకూల సంకేతమే.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!