Take a fresh look at your lifestyle.

కోవిడ్‌ -19 ‌సంక్షోభం.. పేద పిల్లలు బాలకార్మికులయ్యే ప్రమాదం

కార్మికులు పనులు కోల్పోవడంతో వారి పిల్లలను పోషించుకోలేని పరిస్థితులు నెలకొన్నాయి. వారంతా కొరోనా బాధితులుగా మారనున్నారు.  దీంతో బాలకార్మికుల సంఖ్య బాగా పెరగవచ్చు. ఆరోగ్య సంక్షోభమే కాకుండా ఆర్థిక, మార్కెట్‌ ‌రంగాల్లో సంక్షోభం ఏర్పడనుంది. ప్రపంచ వ్యాప్తంగా    152 మిలియన్‌ ‌బాల కార్మికులు ఉన్నట్టు అంచనా. పధ్నాలుగు సంవత్సరాల లోపు వారిని పనుల్లో పెట్టుకోరాదన్న నిషేధం ఉన్నప్పటికీ 5-14 సంవత్సరాల మధ్య బాల కార్మికుల సంఖ్య  2011 ఝనాభా లెక్కల ప్రకారం భారత దేశంలో 10.1 మిలియన్‌లు ఉన్నట్టు అంచనా. 2025 నాటికి బాల కార్మిక వ్యవస్థను నిర్మూలిస్తామని ప్రభుత్వాలు స్పష్టం చేస్తున్నప్పటికీ అది సాధ్యమయ్యే అవకాశాలు కనిపించడం లేదు.

కోవిడ్‌-19 ‌సంక్షోభం వల్ల పేద కుటుంబాలకు చెందిన పిల్లలు అనాథలుగా వీధిన పడతారు. అలాంటి వారిని బాల కార్మికులుగా మార్చే పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్నాయి. కొరోనా సంక్షోభం ప్రభావం సమాజంపై వివిధ రూపాల్లో పడనుంది. దానిని స్థూలంగా అధ్యయనం చేయాల్సి ఉంది. ముఖ్యంగా, కార్మికులు పనులు కోల్పోవడంతో వారి పిల్లలను పోషించుకోలేని పరిస్థితులు నెలకొన్నాయి. వారంతా కొరోనా బాధితులుగా మారనున్నారు. దీంతో బాలకార్మికుల సంఖ్య బాగా పెరగవచ్చు. ఆరోగ్య సంక్షోభమే కాకుండా ఆర్థిక, మార్కెట్‌ ‌రంగాల్లో సంక్షోభం ఏర్పడనుంది. ప్రపంచ వ్యాప్తంగా 152 మిలియన్‌ ‌బాల కార్మికులు ఉన్నట్టు అంచనా. పధ్నాలుగు సంవత్సరాల లోపు వారిని పనుల్లో పెట్టుకోరాదన్న నిషేధం ఉన్నప్పటికీ 5-14 సంవత్సరాల మధ్య బాల కార్మికుల సంఖ్య 2011 ఝనాభా లెక్కల ప్రకారం భారత దేశంలో 10.1 మిలియన్‌లు ఉన్నట్టు అంచనా. 2025 నాటికి బాల కార్మిక వ్యవస్థను నిర్మూలిస్తామని ప్రభుత్వాలు స్పష్టం చేస్తున్నప్పటికీ అది సాధ్యమయ్యే అవకాశాలు కనిపించడం లేదు.కోవిడ్‌ ‌సంక్షోభం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగిత నాణ్యత పరిమాణం బాగా క్షిణించింది. నిరుద్యోగం పెరగడమే కాకుండా తక్కువ వేతనాలకు పనిచేసే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. కొరోనా లాక్‌ ‌డౌన్‌ ఎత్తేసిన తర్వాత 400 మిలియన్‌ ‌కార్మికులు తిరిగి ఉపాధి పొందే అవకాశాలు కనిపించడం లేదు. వారు మళ్ళీ మామూలు స్థితికి చేరుకోడానికి చాలాకాలం పట్టవచ్చు.

భారత దేశంలో అసంఘటిత రంగంలో 90 శాతం శ్రామిక వర్గం ఉంది. కేంద్ర ఆర్థిక పర్యవేక్షణ సంస్థ సర్వే ప్రకారం ఈ శ్రామిక వర్గంలో అధిక భాగం పట్టణ, నగర ప్రాంతాల్లో ఉంది. వీరంతా కోవిడ్‌ ‌వల్ల పనులు కోల్పోయారు. ఈ శ్రామిక వర్గానికి చెందిన పిల్లల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. చట్టబద్దంగా కార్మికులుగా పని చేసుకునేందుకు అర్హులైన 15-18 సంవత్సరాల మధ్య వయస్కులైన వారు కూడా పనులు కోల్పోయారు. వీరంతా చాలా క్లిష్టతర పరిస్థితుల్లో పనులు చేస్తున్నారు. వీరిలో గనుల్లో పని చేసే బాల కార్మికులు కూడా ఉన్నారు. కోవిడ్‌ ‌నేపథ్యంలో శ్రామిక వర్గం పని గంటలను 8 నుంచి 12 గంటలకు పొడిగించాయి.185 దేశాల్లో కోవిడ్‌ ‌ప్రభావం 25 లక్షల మందిపై పడింది. 1.7 లక్షల మందికి పైగా మరణించారు. పిల్లలు తల్లితండ్రుల్లో ఎవరో ఒకరిని కోల్పాయారు. ఈ కారణంగా వారు పనుల్లోకి వెళ్ళడం తప్పని సరి. చాలా దేశాల్లో కోవిడ్‌ ‌కారణంగా పాఠశాలలు మూసివేశారు. మన దేశంలోనూ లాక్‌ ‌డౌన్‌కి ముందే స్కూల్స్ ‌మూసివేసారు.

మన దేశంలో 32 కోట్ల మంది ప్రాథమిక దశ విద్యార్థులు ఉండగా వారిలో 15.8 కోట్ల మంది బాలికలు, 16.2 మంది విద్యార్థులు. వీరిలో ప్రైవేటు స్కూల్స్, ‌కేంద్రీయ విద్యాసంస్థల్లో చదివే వారు ఉన్నారు. కోవిడ్‌ ‌ప్రభావంతో వీరంతా చదువు కోల్పోయారు. మళ్ళీ ఎప్పుడు చదువు ప్రారంభమవుతుందో తెలియని పరిస్థితి. అయితే, పబ్లిక్‌ ‌స్కూల్స్‌లో చదివే పిల్లలకు ఆన్‌ ‌లైన్‌ ‌ద్వారా పాఠాలు చెబుతున్నారు. చాలా మంది విద్యార్థులకు స్మార్ట్ ‌ఫోన్‌లు, కంప్యూటర్లు లేవు. ప్రభుత్వం కల్పించే ఆన్‌ ‌లైన్‌ ‌విద్యావిధానం చాలామందికి అందుబాటులో లేదు. దాంతో విద్యార్థుల్లో చాలా మంది చదువు మధ్యలో ఆపేసే పరిస్థితి ఏర్పడుతుంది. పశ్చిమ బెంగాల్‌, ఆం‌ధప్రదేశ్‌ ‌ప్రభుత్వాలు పిల్లలకు అంగన్‌ ‌వాడీల ద్వారా భోజన సదుపాయాలు కల్పిస్తున్నాయి. రేషన్‌ను వలంటీర్ల ద్వారా పేదల ఇండ్లకు చేరుస్తున్నాయి. అన్ని రాష్ట్రాల్లో ఈ పరిస్థితి లేదు. బౌతిక దూరాన్ని పాటించే కార్యక్రమాన్ని చాలా రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. ఢిల్లీ ప్రభుత్వం స్కూలు పిల్లల ద్వారా నామమాత్రపు ఫీజులు వసూలు చేయాలని ఆదేశించింది. కొన్ని చోట్ల స్వచ్ఛంద సంస్థల పిల్లలకు ఆహారం, చదువు విషయాల్లో శ్రద్ధ తీసుకుంటున్నాయి. కోవిడ్‌ ‌వల్ల విద్యకు ఆటంకం కలిగిన పిల్లలను ఆదుకోవల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది.

– ‘ద వైర్‌’ ‌సౌజన్యంతో..

Leave a Reply