Take a fresh look at your lifestyle.

నాకు గాడ్‌ఫాదర్‌ ‌తెలంగాణ ప్రజలే

బిఆర్‌ఎస్‌లో మనిషిగా కూడా విలువనివ్వలేదు
అధికార మదంతో విర్రవీగుతున్నారు
నిరంతరం ప్రజల్లోనే ఉంటున్నా
అక్రమాలతో పైకి రాలేదు..కష్టపడి వచ్చా
పార్టీ మారాక అవమానాలపై వివరిస్తా
ఆత్మయ సమావేశంలో పొంగులేటి సంచలన వ్యాఖ్యలు

ఖమ్మం,ప్రజాతంత్ర,జనవరి10: ప్రజల ఆశీర్వాదం ఉంటే పదవులు అవే వస్తాయని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. అధికారం లేకున్నా నిత్యం ప్రజల్లోనే ఉన్నానని చెప్పారు. తన అభిమానులు, అనుచరులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పొంగులేటి మాట్లాడారు. కేసీఆర్‌,‌కేటీఆర్‌పై నమ్మకంతోనే నాడు టీఆర్‌ఎస్‌లో చేరానని వెల్లడించారు. బీఆర్‌ఎస్‌ ‌పార్టీ హైకమాండ్‌ ‌తీరుపై శ్రీనివాస్‌రెడ్డి పరోక్షంగా తీవ్ర ఆరోపణలు చేశారు. పదవులు ఇచ్చినా ఇవ్వక పోయినా మనిషిని మనిషిలా చూడాలని కోరారు. పినపాక నియోజకవర్గ మద్దతుదారులతో ఖమ్మంలో పొంగులేటి ఆత్మీయ సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన తీవ్ర ఆవేదనతో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అధికార మదంతో రెచ్చిపోయినా… ప్రజలు తీర్పు ఇచ్చే రోజు ఎంతో దూరంలో లేదన్నారు. కష్టాలు చెప్పుకుంటేనే ఉలిక్కిపడుతున్నారని వ్యాఖ్యానించారు. కేవలం కేటీఆర్‌తో ఉన్న చనువుతోనే ఇంతకాలంలో బీఆర్‌ఎస్‌లో కొనసాగినట్లు చెప్పుకొచ్చారు. పార్టీ మారిన తర్వాత ఎలాంటి కష్టాలొచ్చాయో సమయం వచ్చినప్పుడు చెబుతానని పొంగులేటి వెల్లడించారు.తనకు రాజకీయాల్లో గాడ్‌ ‌ఫాదర్‌ ఎవరూ లేరు.. తెలంగాణా ప్రజలే గాడ్‌ ‌ఫాదర్‌ అని పొంగులేటి స్పష్టం చేశారు. ఈ సందర్బంగా ఆయన తనుపార్టీమారడం ఖాయమన్న సంకేతాలు ఇచ్చారు.

ఇక బిఆర్‌ఎస్‌తో తెగదెంపులు చేసుకుంటున్టన్లు ఆయన వ్యాఖ్యలను బట్టి అర్థం అవుతోంది. తాను ప్రజలను ఆదరించేందుకు వెళితే దాన్ని కూడా మరో కోణంలో చూశారు. కు మంచి చేయడం రాదు. చేసే వాళ్లను అడ్డుకుంటారు. నేను ఈ రోజు గంగిరెద్దు లా రాలె. గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా ప్రజల్లో ఉన్నా. నేను సెక్యూరిటీ అడగలేదు. ఉన్న సెక్యూరిటీని తగ్గించిన నాకు ఇబ్బంది లేదు. నేను ఏమి అరాచకాలు చేయలేదు. గతంలో నూ ఆయన ఇలాంటి కామెంట్లే చేశారు. చేపలు నీళ్ళల్లో ఉండటం సర్వసాధరణమన్న ఆయన.. నీళ్ళల్లో ఉండే చేప బయటకు వస్తే బతకదన్నట్లు.. రాజకీయ నాయకుడు ప్రజల్లో ఉన్ననాడే, వారితో మమేకమై, అభిమానం పొందిననప్పుడే నాయకుడిగా రాణించగలుగుతాడని అన్నారు. నాలుగున్నర ఏళ్లలో ఏ పదవి లేకపోయినా, జనం నుంచి అపూర్వ స్పందన వచ్చిందంటూ పొంగులేటి వ్యాఖ్యలు చేశారు.  గడిచిన నాలుగేళ్లలో పార్టీలో ఏం గౌరవం పొందామో కూ తెలుసు. ప్రజల ఆశీస్సులతో కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా. లక్షల మంది అభిమానించే సైనికులు, అభిమానులు ఉన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రతి గ్రామంలో తిరిగి ప్రజల్ని కలుస్తా. ఎన్ని కష్టాలు వచ్చినా ప్రజలను వదిలేది లేదు. నన్ను ఇబ్బంది పెట్టినా.. ప్రజల నుంచి వేరుచేయలేరు. నిజాన్ని అప్పుడూ నిర్భయంగా చెప్పాను, ఇప్పుడూ చెబుతాను…. నా వ్యాపార లావాదేవీలపై త్వరలోనే చెబుతాను అని వెల్లడించారు. నేను సెక్యూరిటీ అడిగితే రు ఇవ్వలేదు… ఇప్పుడు నా భద్రత తగ్గించినా నేను అడగను, ఉన్న ఇద్దరు గన్‌ ‌మన్లను తీసేసినా నేను బాధపడను…నాకు సెక్యూరిటీ అవసరంలేదు అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు శారు. చిన్న రైతు కుటుంబంలో జన్మించిన వ్యక్తినన్న ఆయన.. ఆ తరువాత కాంట్రాక్టర్‌గా పని చేసినట్లు చెప్పారు. భగవంతుడి ఆశీస్సుల తో ఆర్థికంగా ఎదిగినట్లు వివరించారు. డబ్బులు సంపాదించడమే కాకుండా పదిమందికి ఉపయోగ పడాలనేది తన ఉద్దేశ్యమన్నారు. తన నియోజక వర్గ పరిధిలో లేకపోయినా ఎప్పటి నుండో పినపాకతో సన్నిహితంగా ఉన్నానని.. కానీ కొందరు ఇప్పుడు ఇక్కడ ఏం పని అడుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ప్రజల కోసం, కష్ట సుఖాలు తెలుసుకునేందుకు వస్తున్నట్లు.. నాడు కేసీఆర్‌ , ‌కేటీఆర్‌ ‌పిలుపుతో పార్టీలో చేరినట్లు తెలిపారు. కానీ గత నాలుగు సంవత్సరాలుగా అనేక పరిణామాలు చోటుచేసు కున్నాయని, కేటీఆర్‌తో సాన్నిహిత్యంతో అవమానాలు జరుగుతున్నా ఓపిక పట్టామని చెప్పారు. తనతో పాటు, తనతో ఉన్న వాళ్లకు కనీస గౌరవం ఇవ్వలేదని కామెంట్‌ ‌చేశారు. పార్టీ మార్పుపై మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అభిప్రాయాలు స్వీకరించే కార్యక్రమాన్ని చేపట్టారు. దీంతో ఆయన ఖమ్మం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఉన్న తన శ్రేయోభిలాషులు, అభిమానులతో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా పినపాక నియోజకవర్గ నేతలతో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు.

ఇదిలా ఉంటే ఆయన ఏర్పాటు చేసిన సమావేశం దగ్గర ప్లెక్సీల్లో ఇక్కడా కేసీఆర్‌, ‌కేటీఆర్‌ ‌ఫొటోలు లేవు. దీంతో పొంగులేటి.. బీజేపీలో చేరడం ఖాయమని.. ఇందుకు ప్లెక్సీలే నిదర్శనం అని పొంగులేటి మద్దతుదారులు అభిప్రాయపడుతున్నారు. ఈనెల 18న అమిత్‌ ‌షా తో పొంగులేటి భేటీకానున్నారు. ఆ సమావేశం అనంతరం బీజేపీలో చేరాలా? వద్దా? అనేది నిర్ణయం తీసుకుంటారు. అనంతరం ప్రధాని మోదీ తో కూడా పొంగులేటి భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈనెల 18న ఖమ్మంలో సీఎం కేసీఆర్‌ ‌బహిరంగ సభ జరగనుంది. ఈ సభకు దేశ వ్యాప్తంగా పలువురు రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఓ వైపు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి.. అమిత్‌ ‌షాతో భేటీ. మరోవైపు కేసీఆర్‌ ‌ఖమ్మంలో సభ ఏర్పాటు చేయడం తెలంగాణ పాలిటిక్స్‌లో ఆసక్తి రేపుతోంది.తాను పార్టీ మారాల్సి వస్తే ఖమ్మం నడిబొడ్డున లక్షలాది మంది కార్యకర్తల సమక్షంలో కండువా కప్పుకుంటానని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి, చండ్రుగొండ మండలాల్లో పర్యటించి ఇటీవల చనిపోయిన కార్యకర్తల కుటుంబాలను, అనారోగ్యానికి గురైన వారిని పరామర్శించారు. అన్నపురెడ్డిపల్లిలో కార్యకర్తలు ’సార్‌? ‌రు పార్టీ మారుతున్నట్లు డియాలో వార్తలు వస్తున్నయ్‌’ అని అనగానే పై విధంగా స్పందించారు. ’నేను పార్టీ మారితే నాతో పాటు నా కార్యకర్తలంతా కండువాలు కప్పుకునేలా చేస్తా’ అని అన్నారు.

Leave a Reply