Take a fresh look at your lifestyle.

పెళ్లికి ‘‘భూ’’ ఆస్తికి ఉన్న లింక్‌ను తెలిపే పాలీయాండ్రీ సాంప్రదాయం..!

‘‌భారతదేశంలో పాలీయాండ్రీ ప్రాక్టీస్‌ ‌నేటికీ మైనారిటీలలో అమలులో ఉంది. అలాగే భూటాన్‌, ‌నేపాల్‌ ఉత్తర భాగాలలో కూడా అమలులో ఉంది. దక్షిణ భారతదేశంలో తమిళనాడు రాష్ట్రం తోడాలో… ఉత్తరాఖండ్‌లో జాన్సర్‌ ‌బావార్‌ ‌ప్రాంతంలో… రాజస్థాన్‌ ‌లో, లడఖ్‌, ‌జంస్కార్‌ ‌వంటి ప్రాంతాలలో పాలీయాండ్రీ ప్రాక్టీస్‌ అమలులో ఉంది. భారతదేశంలో ఇన్ని ప్రాంతాలలో పాలీయాండ్రీ ప్రాక్టీస్‌ ‌లో ఉంది అంటే ఆశ్చర్యంగా అనిపిస్తోంది కదా. నిజానికి పాలీయాండ్రీకి భూమికి సంబంధం ఉంది. అంటే పాలీయాండ్రీ ప్రాక్టీస్‌ ‌వెనుక ఆర్ధిక కారణాలు వున్నాయి. ఆర్ధిక కారణాలు వలనే పాలీయాండ్రీ ప్రాక్టీస్‌ ఉనికిలోకి వచ్చింది. ’’

aruna-journalist-delhiపెళ్లి అనే ఇన్టిట్యూషన్‌ ‌లో పాలీయాండ్రీ అనే సంప్రదాయం వుంది. ఈ సంప్రదాయాన్ని ద్రౌపది పాటించింది అని మన పురాణాలు చెబుతున్నాయి . పాలీయాండ్రీ సంప్రదాయం పోలీగామి సంప్రదాయం వంటిదే. పాలీయాండ్రీ సంప్రదాయంలో ఒక స్త్రీ ఒకేసారి ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది మగవాళ్ళను పెళ్లి చేసుకుని బహుభార్యత్వంలోకి అడుగు పెడుతుంది. పాలీయాండ్రీ సంప్రదాయంలో బహుభార్యాత్వం అనేది వివాహం లోపల లేదా వివాహానికి బయట ఒక స్త్రీ బహుళ పురుషులతో స్త్రీ లైంగిక సంబంధాలను పెట్టుకుంటుంది.

1980లో ఎథ్నోగ్రాఫిక్‌ అట్లాస్‌ ‌లిస్ట్ ‌చేసిన 1,231 సమాజాలలో 186 సమాజాలుmonogamousను అమలు చేస్తున్నాయి. 453 సమాజాలు అప్పుడప్పుడు polygynyని అమలు చేస్తున్నాయి. 588 సమాజాలలో ఫ్రీక్వెంట్‌ ‌గా polygyny అమలు చేస్తున్నాయి. 4 సమాజాలలో పాలీయాండ్రీని అమలు చేస్తున్నాయి.

హిమాలయ పర్వతాలలో 28 సమాజాలులలో కనిపించే ఉదాహరణలను పరిగణనలోకి తీసుకుంటే పాలీయాండ్రీ అమలు కేవలం నాలుగు సమాజాల్లోనే వుంది అని చెప్పటం కరెక్ట్ ‌కాదు అనిపిస్తుంది. ఇటీవలి అధ్యయనాల ప్రకారం 50 కంటే ఎక్కువగా సమాజాలు పాలీయాండ్రీ అమలు చేస్తున్నాయి అని తేలింది.

నేపాల్‌…‌చైనాలోని కొన్ని ప్రాంతాలలో… టిబెటన్లలలో అన్నదమ్ములు పాలీయాండ్రీని ఆచరిస్తారు. అంటే ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది అన్నదమ్ములు ఒకే భార్యను వివాహం చేసుకుంటారు. ఒక భార్యతో సమానమైన లైంగిక సంబంధాలలో వుంటారు.

పాలీయాండ్రీ పాక్షిక పితృత్వంతో ముడిపడి ఉంటుంది. ఒక బిడ్డకు ఒకరి కంటే ఎక్కువ తండ్రులు వుంటారు. దీన్ని తప్పుగా భావించటం జరగదు. భారతదేశంలో పాలీయాండ్రీని ప్రాక్టీస్‌ ‌చేస్తున్న అనేక జాతులు సమూహాలు వున్నాయి. గతాన్ని చుస్తే ఐదుగురు అన్నదమ్ములను వివాహం చేసుకున్న మహాభారతంలోని ప్రధాన పాత్ర అయిన ద్రౌపది పాలీయాండ్రీకి ఐకాన్‌ ‌గా నిలిచింది.

పర్యావరణ వనరులు తక్కువగా ఉన్న సమాజాలలో పాలీయాండ్రీ ఎక్కువగా అమలులో ఉంటుందని చెబుతారు. పాలీయాండ్రీ వలన మానవ జనాభా పెరుగుదలను పరిమితం చేయవచ్చు అనే వాదం వుంది. పిల్లల మనుగడను కూడా మెరుగు పరచవచ్చు అని చెబుతారు. పాలీయాండ్రీ రైతు కుటుంబాలలోనే కాదు ఉన్నత కుటుంబాలలో కూడా అమలయ్యే అరుదైన వివాహం అని చెబుతారు. ఉదాహరణకు, హిమాలయ పర్వతాలలో పాలీయాండ్రీ భూమి కొరత వలన అమలులో ఉంది.

ఒక కుటుంబంలోని సోదరులందరి వివాహం ఒకే భార్యతో జరిగితే, కుటుంబ భూమి చెక్కుచెదరకుండా అవిభక్తంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. ప్రతి సోదరుడు విడివిడిగా ఒక్కో అమ్మాయిని వివాహం చేసుకుని పిల్లలను కలిగి ఉంటే, కుటుంబ భూమి చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టాల్సి ఉంటుంది. అయితే గమనించాల్సింది ఏమంటే లడఖ్‌ ‌జంస్కర్‌లలో ఒక వైపు పాలీయాండ్రీ అమలులో ఉండగా భూమి అనే ఆస్తి లేని అనేక మంది పేదలు ఇదే పాలీయాండ్రీని చాలా తక్కువగా ప్రాక్టీస్‌ ‌చేస్తున్నారు.

ఒక విధంగా భూమి ముక్కలు ముక్కలుగా విభజనకు గురి కాకుండా పాలీయాండ్రీని ప్రాక్టీస్‌ ‌చేసారు చేస్తున్నారు. యూరప్‌ ‌లో impartible inheritance అనే సామాజిక ప్రాక్టీస్‌ ‌ద్వారా భూమి విభజించడాన్ని అడ్డుకున్నారు. అనేక కుటుంబాలలో అనేక మంది తోబుట్టువులు వారసత్వంగా భూమిని పొందకపోవడంతో చాలా మంది మగవాళ్ళు బ్రహ్మచారులుగా సన్యాసులుగా పూజారులుగా మారిపోయారు అని రీసెర్చులు చెబుతున్నాయి. పాలీయాండ్రస్‌ ‌సంభోగ సిస్టం యానిమల్‌ ‌కింగ్డమ్‌ ‌లో ఒక సాధారణ పినోమినా అని మనకి తెలిసిందే.

టిబెట్‌లో పాలీయాండ్రీ ఒక సాధారణ ప్రాక్టీస్‌ ‌గా ఉండేది. నేటికీ ఇక్కడ పాలీయాండ్రీ ప్రాక్టీస్‌ ‌కొంత వరకు కొనసాగుతోంది. 1988లో టిబెట్‌ ‌విశ్వవిద్యాలయం 753 టిబెటన్‌ ‌కుటుంబాలపై సర్వే చేసింది. ఈ సర్వేలో 13% మంది పాలీయాండ్రీ ప్రాక్టీస్‌ ‌చేస్తున్నారని తేలింది.

భారతదేశంలో పాలీయాండ్రీ ప్రాక్టీస్‌ ‌నేటికీ మైనారిటీలలో అమలులో ఉంది. అలాగే భూటాన్‌, ‌నేపాల్‌ ఉత్తర భాగాలలో కూడా అమలులో ఉంది. దక్షిణ భారతదేశంలో తమిళనాడు రాష్ట్రం తోడాలో…ఉత్తరాఖండ్‌లో జాన్సర్‌ ‌బావార్‌ ‌ప్రాంతంలో… రాజస్థాన్‌ ‌లో, లడఖ్‌, ‌జంస్కార్‌ ‌వంటి ప్రాం తాలలో పాలీయాండ్రీ ప్రాక్టీస్‌ అమలులో ఉంది. భారతదేశంలో ఇన్ని ప్రాంతాలలో పాలీయాండ్రీ ప్రాక్టీస్‌ ‌లో ఉంది అంటే ఆశ్చర్యంగా అనిపిస్తోంది కదా. నిజానికి పాలీయాండ్రీకి భూమికి సంబంధం ఉంది. అంటే పాలీయాండ్రీ ప్రాక్టీస్‌ ‌వెనుక ఆర్ధిక కారణాలు వున్నాయి. ఆర్ధిక కారణాలు వలనే పాలీయాండ్రీ ప్రాక్టీస్‌ ఉనికిలోకి వచ్చింది.

భారత దేశంలో పాలీయాండ్రీకి గట్టి ఆధారాలు మన ప్రాచీన హిందూ ఇతిహాసమైన మహాభారతం ఇస్తుంది. ఇందులో పాలీయాండ్రీకి సంబందించిన ప్రాక్టీస్‌ ‌గురించి చాలా ప్రస్తావనలు వున్నాయి. ద్రౌపది ఐదుగురు అన్నదమ్ములను వివాహం చేసుకుంది. పాలీయాండ్రీని ఆమె తన గత జన్మలో వరంగా కోరింది అని మహాభారతం చెబుతున్నది. ఈ పురాతన గ్రంథం పాలీయాండ్రీకి మద్దత్తు ఇస్తూ చాలా వరకు ఆనాటి సమాజం పాలీయాండ్రీ ప్రాక్టీస్‌ ‌ను ఒప్పుకున్నట్టు ఈ గ్రంధం తెలుపుతుంది. మహా భారతం పాలీయాండ్రీ ప్రాక్టీస్‌ ‌ను ద్రౌపది జీవన విధానంగా అంగీకరించింది అని చెబుతుంది ఆమె పాత్రను ఈ గ్రంధం సెలిబ్రేట్‌ ‌చేస్తుంది.

అదే మహా భారతంలో పాలీయాండ్రీ ప్రాక్టీస్‌ ‌కి మరో ఉదాహరణ కుంతీ. ఈమె కూడా పాలీయాండ్రీ ప్రాక్టీస్‌ ‌ద్వారానే ఐదుగురు కొడుకులను కన్నది. ఈమె మరిన్ని పాలీయాండ్రీ ప్రాక్టీస్‌ ‌చేసిన మహిళల ఉదాహరణలు చెప్పమని తన పెద్ద కొడుకు యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజును అడుగుతుంది. అప్పుడు యుధిష్ఠిరుడు గౌతమ వంశంకి చెందిన  ‘జటిల’ సప్తఋషులను వివాహం చేసుకుని పాలీయాండ్రీని అమలు చేసింది అని చెబుతాడు. అలాగే హిరణ్యాక్ష సోదరి ‘ప్రచేతి’ పది మంది అన్నదమ్ములను వివాహం చేసుకున్నారు అని చెప్పి, పాలీయాండ్రీ ప్రాక్టీస్‌ ‌కి సిద్ధపడిన మహిళల గురించి తల్లి కుంతికి వివరించి చెబుతాడు. మన మహా భారతం పాలీయాండ్రీని తప్పుగా చూడలేదు దీని వెనుక వున్నా ఆర్ధిక కారణాలను కూడా విశ్లేషించింది.

హిందూ సంప్రదాయం పాలీయాండ్రీ ప్రాక్టీస్‌ ‌ని తప్పు పట్టకపోగా, జుడాయిజం మాత్రం పాలీయాండ్రీ ప్రాక్టీస్‌ ‌ని అనుమతించలేదు. హీబ్రూ బైబిల్‌లో స్త్రీలు ఒకరి కంటే ఎక్కువ మందిని వివాహం చేసుకున్నట్లు ఎటువంటి ఉదాహరణలు లేవు. ఈ మత గ్రంధంలో అడల్టరీని పాలీయాండ్రీ ప్రాక్టీస్‌ ‌తో పోల్చి చూపి పాలీయాండ్రీ ఆమోదయోగ్యం కాదని స్పష్టంగా చెప్పింది. యూదు సంప్రదాయంలో పాలీయాండ్రీ ప్రాక్టీస్‌ అం‌టే ఏమిటో తెలియదు. అంతే కాకుండా మొదటి భర్త కాకుండా ఇతర వ్యక్తితో పుట్టిన పిల్లలను చట్టవిరుద్ధ పిల్లలుగా యూదు మతం పరిగణించింది. అంటే, మహిళకు విడాకులు ఇచ్చిన తర్వాత లేదా భర్త  మరణించిన తర్వాత adulterousµ’ సంబంధం కారణంగా పిల్లలు పుడితే ఈ పిల్లలని లీగల్‌ ‌పిల్లలుగా పరిగణించలేదు యూదు మతం.

క్రైస్తవ మతం ప్రకారం పాశ్చాత్య సమాజాలలో చాలా క్రైస్తవ తెగలు monogamous మ్యారేజ్‌ ‌లనే గట్టిగా సమర్ధించాయి. పౌలిన్‌ ఎపిస్టల్స్ (Pauline epistles) లిటరేచర్‌ ‌చదివితే పాలీయాండ్రీ ప్రాక్టీస్‌ ‌ని క్రైస్తవ మతం నిషేదించినట్టు తెలుస్తుంది. ఈ మతాలు ఇలా చేయటం వెనుక కూడా ముఖ్యమైన కారణాలు ఆర్ధిక పరమైనవి అని అనేక స్కాలర్లు చెబుతారు.

ఆస్తికి వారసుడుగా వుండే వ్యక్తి కోసం ఈ మతాలన్నీ పాలీయాండ్రీ ప్రాక్టీస్‌ ‌ని ఒప్పుకోలేదు అని నిరూపించారు. ఇదంతా చూసినప్పుడు మనకి స్పష్టం అయ్యేది ఒక్కటే పెళ్లి వెనుక అనేక భూమి అనే ఆర్ధిక కారణం పని చేసింది. దీనికి సంబందించిన రుజువులు అనేకం చరిత్రలో వున్నాయి. నేటికీ పెళ్లి వెనుక ఆర్ధిక కారణాలు అనేకం ఉంటున్నాయి.

 

Leave a Reply