- వోటేసిన సినీ, రాజకీయ ప్రముఖులు
- వోటు హక్కు వినియోగించుకున్న గవర్నర్ తమిళిసై, ఇతర ప్రముఖులు
తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీలకు ఒకే దశలో ఎన్నికల పోలింగ్ మంగళవారం ముగిసింది. మరోవైపు అసోం, బెంగాల్ శాసనసభలకు మూడో దశ పోలింగ్ ముగిసింది. కొరోనా వైరస్ రెండోదశ విజృంభిస్తుండటంతో కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా పోలింగ్ నిర్వహించారు. సినీ, పొలిటికల్ ప్రముఖులు క్యూలైన్లలో నిలబడి తమ వోటు హక్కు వినియోగించుకున్నారు. తమిళనాడులోని విరుగంబక్కంలో పుదుచ్చేరి లెప్టినెంట్ గవర్నర్, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వోటు హక్కు వినియోగించుకున్నారు. చెన్నై స్టార్ హీరో సినీ నటుడు రజనీకాంత్ వోటు వేశారు. సినీ నటుడు సూర్య, ఆయన తమ్ముడు నటుడు కార్తీతో కలిసి వోటు వేశారు. తిరువాన్మయూర్‌లో నటుడు అజిత్ పాటుగా అతని భార్య షాలినీ వోటు వేశారు. మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు కమల్‌హాసన్, ఆయన కుమార్తెలు శృతిహాసన్, అక్షర హాసన్ చెన్నైలో తమ వోటు హక్కు వినియోగించుకున్నారు.
నటుడు విజయ్ చెన్నై నీలంకరైలో సైకిల్ మిద వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదే విధంగా సినీ నటి కుష్బూ, నటుడు విక్రమ్ ఓటు హక్కును వినియోగించు కున్నారు. నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతంలో ఉదయం 7 నుంచి పోలింగ్ ప్రశాంతంగా మొదలయ్యింది. సినీ, రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పెరియాకులంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం. ఎన్డీఏ కూటమి అభ్యర్థులం దరూ గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. వరుసగా మూడోసారి ఏఐడీఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక సూపర్ స్టార్ రజిని కాంత్ థౌజండ్ లైట్స్ నియోజకవర్గంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
స్టెల్లా మేరిస్ లోని పోలింగ్ బూత్ లో ఓటు వేశారు. ప్రతి ఒక్కరు ఓటు వేయాలని కోరారు రాజకీయ, సినీ ప్రముఖులు. అజిత్ తన సతీమణితో ఓటు హక్కు వినియోగించుకున్నారు. విజయ్, సూర్య, కార్తి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. పుదుచ్చేరిలో పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు ఆ రాష్ట్ర మాజీ సీఎం నారాయణ స్వామి. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగిం చుకోవాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ తిరిగి పుదుచ్చేరిలో అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తమిళనాడు ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఈ అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకె, కాంగ్రెస్ కూటమి ఘన విజయం సాధించడం ఖాయమని, మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి. చిదంబరం స్పష్టం చేశారు.
శివమొగ్గ జిల్లా కందనూర్‌లోని చిత్తల్ అచ్చి మెమోరియల్ హై స్కూల్లో ఏర్పాటు చేసి పోలింగ్ బూత్‌లో ఆయన తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మిడియాతో మాట్లాడారు. పదేళ్ల ఆన్నాడిఎంకె పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని ఆయన చెప్పారు. ఆన్నా డిఎంకె పాలనతో విసుగు చెందిన ప్రజలు తమ కూటమికి అధికారం అప్పగించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రతిఒక్కరు ఓటేయాలని ఆయన పిలుపునిచ్చారు.
సూపర్ హీరో దళపతి విజయ్ సైకిల్ మిద వచ్చి ఓటు వేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మిడియాలో హల్ చల్ చేస్తుంది. తన ఇంటి నుండి పోలింగ్ స్టేషన్ చాలా దగ్గర కావడంతో విజయ్ సైకిల్ మిద వెళ్లి ఓట్ వేసి వచ్చారు. అయితే విజయ్‌కు సపోర్ట్‌గా తన ఫాలోవర్స్ పక్కన ఉన్నారు. కోలీవుడ్ లో విజయ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అందరికి తెలిసిందే. ఆయన ప్రతి సినిమా అక్కడ 200 కోట్ల క్లబ్లో చేరుతుంది. తమిళనాడులో విజయ్ కూడా ఓ పార్టీ పెడతాడని.. ఆయన రాజకీయాల్లోకి వస్తాడని ఎప్పటినుండో ఓ టాక్ వినిపిస్తుంది. అయితే ఆ విషయంపై మాత్రం విజయ్ ఎలాంటి రిప్లై ఇవ్వట్లేదు.