Take a fresh look at your lifestyle.

నిబంధనల నడుమ…. దుబ్బాకలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్‌

పెరిగిన పోలింగ్‌ ‌శాతం…ఎవరికి లబ్ది చేకూరేనో 10న కౌంటింగ్‌

‌సిద్ధిపేట జిల్లా దుబ్బాక అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికకు సంబంధించి మంగళవారం పోలింగ్‌ ‌ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7గంటలకు పోలింగ్‌ ‌ప్రారంభమైంది. దుబ్బాక మున్సిపాలిటీలోని నాలుగో వార్డులోని దుంపలపల్లిలో సుమారు గంటసేపు ఈవీఎం మొరాయించడం వల్ల కొంత మంది వోటర్లు వెనక్కి తిరిగిపోయారు. దుబ్బాక మండలం రామక్కపేట, ఎనగుర్తిలో అరగంట సేపు ఈవీఎంలు మొరాయించడం వల్ల వోటర్లు అవస్థలు  పడ్డారు. వృద్ధులు ఎక్కడివాళ్లు అక్కడే కూర్చుండిపోయారు.  కోవిడ్‌ ‌నేపథ్యంలో నిబంధనలు పూర్తిగా పాటించారు.  ప్రతి పోలింగ్‌ ‌కేంద్రంలో థర్మల్‌ ‌స్క్రీనింగ్‌ ‌చేశారు. శానిటైర్లను వాడుతూ… భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేశారు. సురక్షిత విధానంలో వోటింగ్‌ ‌జరిగేలా సంబంధిత అధికార యంత్రాంగం సేఫ్టీ జాగ్రత్తలు తీసుకున్నారు.

కొరోనా నేపథ్యంలో 80 సంవత్సరాల పైబడిన వృద్ధులు, దివ్యాంగులు, కోవిడ్‌  ‌బాధితులకు పోస్టల్‌ ‌బ్యాలెట్‌ ‌సౌకర్యం కల్పించారు. లచ్చపేటలోని స్ట్రాంగ్‌ ‌రూమ్‌ ‌సందర్శించిన జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌  ‌భారతి హోళీకేరి సందర్శించారు. వోటరు టర్న్ ఔట్‌ ‌టీమ్‌తో చర్చించి ప్రతి రెండు గంటలకు పోలింగ్‌ ‌శాతం నివేదికలు పంపాలని ఎన్నికల అధికారులు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాత స్ట్రాంగ్‌ ‌రూమ్‌లో ఏర్పాటు చేసిన వెబ్‌ ‌కాస్టింగ్‌ ‌బోర్డులో పోలింగ్‌ ‌కేంద్రాల వారీగా నియోజకవర్గ పరిధిలోని 104 కేంద్రాలలో జరుగుతున్న పోలింగ్‌ ‌పక్రియ పరిశీలించారు. కోవిడ్‌ ‌నిబంధనల మేరకు ప్రతీ వోటరుకు థర్మల్‌ ‌స్క్రీనింగ్‌ ‌చేసి, శానిటైజరు అందిస్తూ..చేతికి గ్లౌజు ఇవ్వడంతో పాటు సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకున్న ఎన్నికల అధికారిక యంత్రాంగం పనితీరును కలెక్టర్‌ అభినందించారు. మధ్యాహ్నం వరకు దుబ్బాక నియోజకవర్గ వ్యాప్తంగా 55.52శాతం పోలింగ్‌ ‌నమోదైంది. సాయంత్రం 4 గంటల వరకు 78.12 శాతం పోలింగ్‌ ‌నమోదైంది. సాయంత్రం 5 గంటల వరకు అధికారికంగా 81.44 శాతం పోలింగ్‌ ‌నమోదైనట్లు అధికారులు ప్రకటించారు.  సాయంత్రం 6 గంటలకు దుబ్బాక ఉపఎన్నిక పోలింగ్‌ ‌ముగియగా..సాయంత్రం 6లోపు పోలింగ్‌ ‌కేంద్రాలకు వచ్చిన వోటర్లకు వోటు వేసే అవకాశం కలిపించారు. కొరోనా బాధితులకు సాయంత్రం 5 నుంచి 6 మధ్య వోటు వేసేందుకు అవకాశం ఇచ్చారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply