Take a fresh look at your lifestyle.

పొలిటికల్‌, ‌పోలీస్‌ అం‌డ!

చూడు ఏరియాకొక గూండా
పొలిటికల్‌, ‌పోలీస్‌ అం‌డ
సెటిల్‌ ‌మెంట్లే వాడి దందా
హవారా బ్యాచ్‌ ‌వాడికి మంద

పైసకు అసిద్ధం కూడా తింటడు
మాటల్లో నీతులు వల్లిస్తుంటడు
భౌతిక దాడులకు దిగుతుంటడు
భయోత్పాతంతో పని చేసుకుంటడు

న్యాయానికి వాడు వేరుపురుగు
సమాజంలో పెద్ద చీడ పురుగు
జరుపాలే సంఘ బహిష్కరణ!!
వాడి ఉనికికి చెప్పాలే తిరస్కరణ!!!
కత్తెరశాల కుమార స్వామి
కవి, కాలమిస్టు, రచయిత,సీనియర్‌ ‌జర్నలిస్టు, ప్రజాతంత్ర

Leave a Reply