Take a fresh look at your lifestyle.

రాజకీయ ప్రక్షాళన తక్షణ అవసరం..

“దోషులకు దండం పెట్టి దండలెయ్యాల్సిన దుర్గతి పట్టుతుందని నిజాయితి పరులైన అధికారుల ఆవేదన అరణ్య రోదనగా మారుతున్న సంఘటనలు కోకొల్లలు. సమస్త పాలన వ్యవస్థల్ని అవినీతి కూపంలో ముంచేసిన వారిని, నేర చరితులని పార్టీలు అభ్యర్థులుగా నిలబెట్టడమే కాదు ! వారికే విజయావకాశాలు మెండుగా ఉన్నాయంటున్న పాలకుల తీరు ఏ విలువలకు నిదర్శనమనాలి. ఈ రెండు మార్గాల ద్వారా ధనాన్ని సంపాదించినవారే సొంతంగా పార్టీలు పెట్టి అధికార పీఠాన్ని అధిరోహిస్తున్న వారిని చూస్తున్నాం. ప్రజల పట్ల, ప్రజాస్వామ్యం పట్లగాని నేతల జవాబుదారీతనం ఎండమావిలో నీళ్లను వెతుక్కున్నట్లుగానే ఉంది.”

భారతదేశంలో అవినీతి, నేరమ య రాజ కీయాల విష కౌగిలి నుం చి ప్రజాస్వామ్య పవి త్రతను కాపా డాలని మనదేశ అత్యున్నత న్యాయ స్థానం పరితపిస్తూ ఎన్నిసార్లు ఆదేశాలు జారీచేసినా అది అమలుకు నోచుకోకపోగా, పెచ్చరిల్లిపోయి వెక్కిరిస్తూ వికటాట్టహాసం చేస్తుంది. పాలనలో ప్రధాన భాగమైన పల్లె పంచాయితి నుండి పార్లమెంటు వరకు పట్టించేవారు, పట్టుకోవలసిన వారు ఇచ్చుకునే, పుచ్చుకునే వారు ఇది సాధారణమే అనేలా విచ్చలవిడిగా అవినీతి, నేరమయమై ఇందుగలదందులేదనేలా ఎవరి స్థాయికి తగినట్లుగా వారు చేసుకొనుచున్నారు. అన్ని రకాల అవినీతికి తల్లివేరు రాజకీయ అవినీతేనన్నది కాదనలేని నిజం. గతంలో విలువలు, నైతికతకు నిలయమైన రాజకీయాలు, 2014 నాటికి దేశంలో 1581 మంది ప్రజాప్రతినిధులపై క్రిమినల్‌ ‌నేరాభియోగాలు ఉన్నట్లు ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం తెలిపింది. అలా నేడు మాజీ, తాజా ఎమ్మెల్యేలు, ఎంపీలు మొత్తం 4442 మందిపై క్రిమినల్‌ ‌కేసులుండగా వారిలో 2556 మంది ప్రస్తుత ప్రజాప్రతినిధులే కావడాన్ని బట్టి చూస్తే నేర రాజకీయాలు ఎలా విజృంభిస్తున్నాయో అర్థమౌతుంది. ప్రజాపాలనలో కాపలాదారులే .. అవినీతితో దోచుకుంటూ రక్షించాల్సిన వాళ్లే భక్షిస్తుంటే కాపాడేవారేవరు? అధికారం అడ్డుపెట్టుకుని దర్జాగా చలామణి అవుతుంది నిజం కాదా! దోషులకు దండం పెట్టి దండలెయ్యాల్సిన దుర్గతి పట్టుతుందని నిజాయితి పరులైన అధికారుల ఆవేదన అరణ్య రోదనగా మారుతున్న సంఘటనలు కోకొల్లలు. సమస్త పాలన వ్యవస్థల్ని అవినీతి కూపంలో ముంచేసిన వారిని, నేర చరితులని పార్టీలు అభ్యర్థులుగా నిలబెట్టడమే కాదు ! వారికే విజయావకాశాలు మెండుగా ఉన్నాయంటున్న పాలకుల తీరు ఏ విలువలకు నిదర్శనమనాలి. ఈ రెండు మార్గాల ద్వారా ధనాన్ని సంపాదించినవారే సొంతంగా పార్టీలు పెట్టి అధికార పీఠాన్ని అధిరోహిస్తున్న వారిని చూస్తున్నాం. ప్రజల పట్ల, ప్రజాస్వామ్యం పట్లగాని నేతల జవాబుదారీతనం ఎండమావిలో నీళ్లను వెతుక్కున్నట్లుగానే ఉంది.
తాజాగా అత్యున్నత న్యాయస్థానం ఆదేశానుసారం నేరాభియోగాలు ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధుల సంఖ్య పెరిగిపోతున్న వేళ.. ఆయా కేసులపై రోజువారీ విచారణ జరిపి రెండు నెలల్లో తేల్చేయాలన్న ఉత్తర్వుల అమలు ఎలా ఉండబోతోందో వేచి చూడాల్సి ఉంది. 180 దేశాల అవినీతి సూచికలో మనదేశ స్థానం 85, అయిదేళ్ళ తర్వాత కూడా తిరిగి 80వ స్థానంలో ఉండడాన్ని బట్టి చూస్తే అవినీతి కేసుల్లో సత్వరం, సరైన శిక్షలు పడనందు వలననే అక్రమార్జన చేసేవారికి పట్టపగ్గాలుండటం లేదన్నది పచ్చి నిజం. అవినీతి పరులకు సింహస్వప్నంగా పనిచేయాల్సిన కేంద్ర నిఘా విభాగం నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదనే వాదన వినిపిస్తుంది. మనదేశం అభివృద్ధి సాధించే మార్గానికి అవినీతి పెద్ద అవరోధంగా మారింది. దేశ సంపద, పాలన పగ్గాలు చేపట్టిన వారి చుట్టే తిరుగుతుంది. ప్రజలు అధికారాన్ని కట్టబెట్టింది ఇందుకేనా ! రాజకీయాలు పూర్తిగా నేరమయంగా మారి అవినీతి కూపంలో మునిగిపోయినాయి. ఇందుకు నిదర్శనం, 2019 సాధారణ పార్లమెంట్‌కు ఎన్నికైన (పార్లమెంట్‌ ‌సభ్యులు) 542లో 475 మంది ప్రజాప్రతినిధులు 88శాతం అత్యధికులు ధనవంతులే. 43 శాతం అంటే 233 మంది నేరారోపణలు ఎదుర్కొంటున్నవారే చట్టసభల్లో పాలకులై కూర్చున్నారని. అసోసియేషన్‌ ‌ఫర్‌ ‌డెమోక్రటిక్‌ ‌రిఫామ్స్ (ఏడీఆర్‌) ‌సంస్థ వెల్లడించింది. ఇలా రాజకీయాల్లో అవినీతితో సంపాదించిన ధన, కండబలాల ప్రభావంతో కూరుకుపోయినాయి. విలువైన, నైతిక రాజకీయాలు కనుచూపు మేరలో కనిపించడం లేదు. ప్రజలు రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కుతో పాలకులను మార్చి మార్చి విసిగెత్తిపోయినారు. అందరూ ఆ తాను ముక్కలే.
అన్ని పార్టీలవారు ఎర్రగురిగింజ నీతులే పలుకుతున్నారు. అవినీతి, నేర రాజకీయాలకు చరమగీతం పాడాల్సిందేనన్న న్యాయస్థానాల తపన నెరవేరాలంటే రాజకీయ(పార్టీ)ల నాయకులు స్వీయ నియంత్రణ, ఆత్మపరిశీలనతో ప్రజల పక్షాన నిలిచి దేశసంపదను ప్రజలకు సమంగా పంచబడేలా నిబద్ధతతో పాలన అంధించాలి. అలా చేయకుండా రాజకీయ పార్టీలు, నాయకులు ఎన్నికల ముందు చెప్పిన మాటలన• విస్మరిస్తున్న తీరుతో ఓట్లేసి మోసపోతున్నామని ఆవేధనలో ప్రజలున్నారు. స్వాత్యాంత్రానికి పూర్వం మనం బ్రిటిష్‌ ‌వాళ్లను దోషులను చేశాము. నేడు ఏడు దశాబ్ధాల పాలనలో కూడా ఆనాటి త్యాగధనుల ఆశలు ఆశయాలు.. సాధించకపోగా ! దేశంలోని 70శాతం సంపద ఒక శాతం ధనవంతుల వద్ద ప్రోగై ఉన్నది. దీని మూలంగా ఆర్థిక, సామాజిక, సాంఘీక, రాజకీయ సమానతను సాధించలేకపోయింది నిజం కాదా ! ఇంకా మూడు పూటల తిండికి నోచుకోని వారు కోట్ల సంఖ్యల్లో ఉన్నారు. ఆర్థిక అసమానతలు దేశ ప్రజల్లో పూడ్చలేని అగాధంగా మారింది కాదనగలరా ! ప్రజాస్వామ్యం పేరుతో చట్టబద్ధంగా ఎన్నికైన వారు జాతి సంపదకు కాపలా దారులుగా ఉండాల్సిన వారే కంచే చేను మేస్తున్నట్లుగా, ప్రవర్తిస్తూ ప్రపంచ బ్యాంక్‌ ‌చెప్పుచేతుల్లో నడుచుకుంటున్నారు. కార్పోరేటు శక్తుల సేవలో తరిస్తుంటే ? ప్రజలు అధికారాన్ని కట్టబెట్టింది పాలితుల కోసమా ! పాలకుల కోసమా తేల్చుకోలేకపోతున్నారు.
డా।। అంబేద్కర్‌ ‌రాజ్యాంగ పరిషత్‌ ‌సభలో ఉద్విగ్నంగా వెలిబుచ్చిన సందేహాలే నేడు దర్శనమిస్తున్నాయి. భారత జాతికి ఒకే విలువగల ఓటు హక్కును కల్పించుకున్నాము. కానీ ఆర్థిక, సామాజిక, రాజకీయ, స్వేచ్ఛ సౌభ్రాతృత్వాల్లో సమానతను సాధించాల్సిన బాధ్యత మన పాలకులపైనే ఉంది. నా దేశం తన స్వాతంత్య్రాన్ని రక్షించుకుంటుందా ! పరాభవం పాలౌతుందా ! రాజ్యాంగం సుధీర్ఘకాలం నిలుస్తుందా ! స్వతంత్ర ప్రతిపత్తినిచ్చిన సంస్థలు… న్యాయశాఖ, పత్రికా స్వేచ్ఛ, నిఘా విభాగాలు, ఎన్నికల సంఘం వీటిని నాయకులు స్వతంత్రంగా పనిచేయనిస్తారా ! రాజకీయ ప్రలోభాలకు లోనౌతారూ అనే ఆంధోళనతో కూడిన సందేహాలను వ్యక్తపరిచారు. ప్రజల పక్షాన నిలబడాల్సిన  పత్రిక స్వేచ్ఛగల్గిన మీడియా సంస్థలు పాలక, కార్పోరేటు సంస్థల ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నాయి. ఎన్నికల సంఘం ధన, కండ •లాన్ని నియంత్రించలేక పోతుంది. రాజ్యాంగం కల్పించబడిన చట్టసభల విశిష్ట అధికారాలను  అడ్డుపెట్టుకొని ప్రజా ప్రతినిధులు కూడా కార్పోరేట్ల ప్రయోజనాల కోసం పనిచేస్తుంటే? ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ! అది ప్రజాస్వామ్యం కాదు. ప్రజాస్వామ్య ముసుగులో ఉన్నధన స్వామ్యమే ? నాయకుడంటే ఒకప్పుడు నైతిక విలువలకు కట్టుబడి మాటపై నిలబడేవాడు. ఇప్పుడు అవినీతి డబ్బుల కట్టల(కండబలం)తో బెదిరిస్తూ ఓటును కొనేవాడు ఇంత విచ్చలవిడిగా డబ్బులు పంచే నాయకులను పార్టీలను వదిలేసి, ఓటర్లను అమ్ముడు పోతున్నారని నిందించడం భావ్యమా !
ప్రజల పట్ల ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల పాలక నేతల పారదర్శకత, జవాబుదారీతనం పెరగాలి. అవినీతి నేరమయ రాజకీయాలకు స్వస్తి పలికేలా అధికార(నిఘా) వర్గాలపై రాజకీయ జోక్యం ఏ మాత్రం ఉండకూడదు. ఎప్పుడైతే రాజకీయ అవినీతి, నేరాలను కఠిన చట్టాలతో ఉక్కు సంకేళ్లు వేసి నిరోదించగలమో ! సమస్త పాలన వ్యవస్థలు ఆ వెనువెంటనే గాడిలో పడగలవు. ఈ దురవస్థను రూపుమాపే అజెండాతో పలు పార్టీలు చిత్తశుద్ధితో ముందుకు రావాలి. నిర్మూలిస్తామనే ఎన్నికల హామీలలో ప్రధానాంశంగా చేర్చి పాల••, ప్రతిపక్షాలు చేయాల్సిన పనులను న్యాయ స్థానాలు హెచ్చరించినా చట్టంలోని లొసుగులతో కాలయాపన చేస్తూ నీరు గారుస్తున్న తీరు మారాలి. కాదు కూడదని ఇలానే వ్యవహరిస్తూ పోతే.. దేశానికి చెదపురుగులా దాపురించిన అవినీతి, నేరగ్రస్త రాజకీయాలు భరించలేని భారతజాతి మరో అంతర్యుద్ధం.. అదీ ఆర్థిక సమానత కోసం రావడం ఖాయం…
మేకిరి దామోదర్‌, ‌వరంగల్‌ ‌సెల్‌: 9573666650

Leave a Reply