Take a fresh look at your lifestyle.

రాష్ట్రంలో త్వరలోనే రాజకీయ మార్పులు: బండి సంజయ్‌

  • అవినీతి మంత్రులు, ఎమ్మెల్యేల చిట్టా విప్పుతాం
  • కమలాపూర్‌ ‌పర్యటనలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలన మార్పులు రాబోతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌పేర్కొన్నారు. ఈటెల రాజేందర్‌ ‌రాజీనామాతో మార్పులు రానున్నాయని అన్నారు. వరంగల్‌ అర్బన్‌ ‌జిల్లా కమలాపూర్‌లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన వి•డియాతో మాట్లాడారు. ప్రగతి భవన్‌ ‌తెలంగాణ ద్రోహులకు అడ్డాగా మారిందన్నారు. రాష్ట్రంలోని మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతి చిట్టాను తీస్తున్నామన్నారు. ఉద్యమకారుడు, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై తీసుకున్న చర్యలు అవినీతి ఎమ్మెల్యేలపై తీసుకుంటే ఒక్కరూ కూడ మిగలరని వ్యాఖ్యానించారు. గడీల పాలనను తట్టుకోలేక బయటకు వచ్చిన వారు అవినీతి పరులా? అని సంజయ్‌ ‌ప్రశ్నించారు.

హుజూరాబాద్‌ ‌నియోజకవర్గంలో పైసలాట ప్రారంభమైందని ఆయన ఎద్దేవా చేశారు. బీజేపీ రాష్ట్రంలో బలపడుతోందన్నారు. టీఆర్‌ఎస్‌కు రాష్ట్రంలో నూకలు చెల్లే సమయం ఆసన్నమైందన్నారు. సీఎం దగ్గర ఉన్నవాళ్ళు అంతా ఉద్యమకారులా? లేదంటే ఉద్యమ ద్రోహులో కేసీఆరే చెప్పాలన్నారు. ఉద్యమంలో హుజూరాబాద్‌ ‌నియోజకవర్గం కీలకపాత్ర పోషించిందని బండి సంజయ్‌ ‌పేర్కొన్నారు.. హుజూరాబాద్‌ ‌నుంచి అనేక ఉద్యమాలు, పోరాటాలు జరిగాయన్నారు.

ఉద్యమంలో, టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ‌పరిస్థితే ఇలా ఉంటే మిగితా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల, నాయకుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్‌ ‌మంత్రులు, ఎమ్మెల్యేలు పైసలాట ప్రారంభించారన్నారు. ఈటల రాజేందర్‌ ‌విషయంలో కేసీఆర్‌ ‌నీచంగా వ్యవహరిస్తున్నారని బండి సంజయ్‌ ఆ‌గ్రహం వ్యక్తం చేశారు.రాష్ట్రంలో రాజకీయాలు మారబోతున్నాయని.. ప్రక్షాళన ప్రారంభమైందని బండి సంజయ్‌ అన్నారు.

Leave a Reply