Take a fresh look at your lifestyle.

ఆగంతకులపై పోలీసులు తక్షణమే చర్యలు తీసుకోవాలి: టీడబ్ల్యుజేఎఫ్‌, ‌హెయూజే సంఘాల డిమాండ్‌

ప్రజాతంత్ర ఎడిటర్‌ ‌దేవులపల్లి అజయ్‌కి వస్తున్న ఫోన్‌కాల్‌ ‌బెదిరింపులను తెలంగాణ వర్కింగ్‌ ‌జర్నలిస్ట్ ‌ఫెడరేషన్‌ (‌టీడబ్ల్యుజేఎఫ్‌), ‌హైదరాబాద్‌ ‌యూనియన్‌ ఆఫ్‌ ‌జర్నలిస్టస్ (‌హెచ్‌యూజే) సంఘాలు తీవ్రంగా ఖండించాయి. అజయ్‌ను బెదిరిస్తున్న వ్యక్తులను పోలీసులు గుర్తించి వెంటనే అరెస్టు చేయాలని ఫెడరేషన్‌ ‌రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శి బి.బసవపున్నయ్య, ఉపాధ్యక్షుడు ఎల్గొయి ప్రభాకర్‌, ‌హెచ్‌యూజే అధ్యక్షుడు ఈ.చంద్రశేఖర్‌, ‌కార్యదర్శి కె.నిరంజన్‌ ‌డిమాండ్‌ ‌చేశారు.

ఆగస్టు 22న ప్రజాతంత్ర దినపత్రికలో వచ్చిన కార్టూన్‌పై కొందరు వ్యక్తులు రాద్ధాంతం చేస్తూ గత నాలుగు రోజులుగా పనికట్టుకుని ఎడిటర్‌ అజయ్‌ను వాట్సాప్‌ ‌మెసేజ్‌ల ద్వారా అసభ్య పదజాలంతో దూషిస్తూ బెదిరిస్తున్నారనీ, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటికీ ఆ వ్యక్తులకు గుర్తించి అరెస్టు చేయకపోవడం సరైంది కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇటీవలి కాలంలో మీడియాపై దాడులు, బెదిరింపులు పెరిగిపోతున్నాయనీ, భావ ప్రకటనా స్వేచ్చను హరించే విధంగా కొందరు అసాంఘిక శక్తులు చిల్లర వేషాలతో సోషల్‌ ‌మీడియా వేదికగా దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అయినప్పటికీ ఇలాంటి సంఘటనలపై ప్రభుత్వం వెంటనే సరైన చర్యలు తీసుకోవడం లేదనీ, అందుకే మీడియా సంస్థలపై, జర్నలిస్టులపై దాడులు పెరుగుతున్నాయని అన్నారు. ఎడిటర్‌ అజయ్‌కి ఆగంతకుల బెదిరింపు సంఘటనపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలనీ, బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తులను గుర్తించి అరెస్టు చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్‌ ‌చేశారు.

Leave a Reply