భద్రాద్రికొత్తగూడెం జిల్లా,జయశంకర్ భూపాలపల్లి మరియు ములుగు జిల్లాల్లో చత్తీస్గఢ్ రాష్రం నుండి నాలుగు మావోయిస్టు బృందాలు ప్రవేశించినట్లు పోలీసువారికి అందిన విశ్వసనీయ సమాచారంతో జిల్లాలోని మణుగూరు,ఏడూళ్ల బయ్యారం,గుండాల మరియు కరకగూడెం అటవీ ప్రాంతాల్లో జిల్లా పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా నిన్న అనగా 10.03.2020 తేదీన నీలాద్రిపేట గుట్ట వద్ద పోలీసు వారిని చూసి ఏడుగురు మావోయిస్టులు పారిపోవడం జరిగింది.
అనంతరం ఆ చుట్టుపక్కల పరిసరాలను పరిశీలిస్తుండగా పారిపోయిన మావోయిస్టులు వదిలివేసిన సామాగ్రిని పోలీసులు స్వాదీనం చేసుకోవడం జరిగింది.,కిట్ బ్యాగులు,పెన్ డ్రైవ్లు,సోలార్ పానెల్,విప్లవ సాహిత్యం,ప్లాస్టిక్ షీట్లు మరియు ఇతర సామాగ్రిని అట్టి ప్రదేశంలో స్వాధీనం చేసుకున్నారు.పారిపోయిన ఏడుగురు మావోయిస్టుల కోసం పోలీస్ పార్టీలు జిల్లాలోని పలు అటవీ ప్రాంతాల్లో కూంబింగ్ నిర్వహించడం జరుగుతుంది.ఇట్టి సంఘటనలో మావోయిస్టులపై కేసు నమోదు చేయడం జరిగింది.