Take a fresh look at your lifestyle.

 పోలీసు అధికారులే నక్సలైటు ఉద్యమానికి అధికారిక చరిత్ర కారులు

 

నక్సలైటు ఉద్యమాన్ని అణచడానికి ప్రభుత్వం పన్నిన ఒక నిరంతర వ్యూహంలో కుట్రకేసులు ఒక ము­ఖ్యమైన భాగం. నిజంగా ప్రభుత్వం రూల్ఆఫ్లాను సక్రమంగా అమలు చేసి ఉంటే, తు.. తప్పకుండా కట్టుబడి ఉంటే అసలు నక్సలైటు ఉద్యమం పెరిగి ఉండేది కాదని నాకనిపిస్తుంది.

 

ఈ రెండు తీర్పులను ఉటంకిస్తూనే, ఇవి రెండూ కూడా 1963 రాజ్యాంగ (పదిహేనవ) సవరణ కన్నా ముందువని, కోర్టుల సమీక్షా పరిధి ఏమిటో నిర్వచించిన 1974 సుప్రీం కోర్టు తీర్పు (షంషేర్‌ సింగ్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ పంజాబ్‌) కన్నా ముందువని న్యాయమూర్తులు అన్నారు. ఈ 1974 తీర్పు ప్రకారం రాష్ట్రపతి, గవర్నర్లకు ఉండే వ్యక్తిగత విచక్షణాధికారాలకూ, వారి మంత్రివర్గ సహచరుల నిర్ణయం మేరకు తీసుకునే పాలనా పరమైన చర్చలకూ మధ్య విభజన రేఖ ఉందని స్పష్టం చేయడం జరిగింది. మంత్రివర్గం ఇచ్చిన సలహా మేరకు రాష్ట్రపతిగాని, గవర్నర్‌గాని తీసుకునే చర్య పాలనాపరమైన చర్య అవుతుందని అందువల్ల అది న్యాయస్థానాల సమీక్షా పరిధిలోకి వస్తుందని సుప్రీంకోర్టు తీర్పు ప్రకటించింది. అందువల్ల 311(2)(సి)ని వినియోగించి ఒక ప్రభుత్వోద్యోగిని తొలగించడం అనేది గరవ్నర్‌ వ్యక్తిగత సంతృప్తి పరిధిలోని విషయం కాదని, అది మంత్రివర్గ సలహా మేరకు జరిగేదేనని, ఆ ఉత్తర్వుకు సలహా మేరకు జరిగేదేనని, ఆ ఉత్తర్వుకు దారితీసిన సమాచారాన్ని న్యాయస్థానం పరిశీలించవచ్చునని నిర్ధారణ అయింది.

.
ఈ న్యాయశాస్త్ర చర్చ అంతా చేసిన తర్వాత జస్టిస్‌ మాధవరెడ్డి, జస్టిస్  ము­క్తధర్‌లు చెరబండరాజు తన పిటిషన్‌లో తన రచనలు, కవితలు, తనను సికింద్రాబాద్‌ కుట్ర కేసులో నిందితుడిగా చేశాయనీ, ప్రస్తుతం తనను ఉద్యోగం నుంచి తొలగించడానికి కూడా అవే ఏకైక ఆధారమని వాదించారు. దీనికి ప్రతిగా ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌లో కూడా ఆయన మీద మరేదైనా ఆధారం ఉన్నదని అనలేదు. విచారణ క్రమంలో ప్రభుత్వ ప్లీడర్‌ మరికొంత సమాచారం ఉన్నదని అన్నారు. ఆ సమాచారం ఏమిటో న్యాయస్థానం దృష్టికి తేవాలని అన్నప్పుడు, చెరబండరాజు కొన్ని రహస్య సమావేశాలలో పాల్గొని హింసను ప్రోత్సహించాడని ఆధారాలున్నాయని ప్రభుత్వ ప్లీడర్‌ అన్నారు. అటువంటి సమాచారం ఉంటే దాన్ని న్యాయస్థానం ముందు పెట్టి, దాన్ని పరిశీలించే అవకాశం నిందితులకు కూడా ఇచ్చి, వారు దాన్ని ఖండించి  తమను తావ­ సమర్థించుకునే అవకాశం ఇవ్వాలి. కాని వీటికి ప్రభుత్వ ప్లీడర్‌ అంగీకరించలేదు. నిందితుడికి చూపని సమాచారం ఆధారంగా శిక్ష విధించడం సహజ న్యాయసూత్రాలకు వ్యతిరేకం.

ఇక రాజలోచన్‌ విషయంలోనైతే గవర్నర్‌ ముందర ఆయన సికింద్రాబాద్‌ కుట్రకేసులో నిందితుడనే తప్పుడు సమాచారం పెట్టి ఆ ఉత్తర్వు తీసుకొచ్చారనేది స్పష్టమే అంటే గవర్నర్‌ ఆ నిర్ణయం తీసుకోవడం వెనుక ఈ తప్పుడు సమాచార ప్రభావం ఉండి ఉంటుంది. అంటే ఆధార రహితమైన సమాచారం సహాయంతో తయారైన గరవ్నర్‌ నిర్ణయం పూర్తిగా అసమంజసమైనది. అందువల్ల ఆయనను తొలగించడం, విచారణ అవసరం లేదనడం చెల్లదు.ఇక ఈ ఇద్దరినీ వారి రచనలు, ఉపన్యాసాల కారణంగా తొలగించామనడం ప్రాథమిక హక్కులకు వ్యతిరేకమే. ఎవరైనా ప్రభుత్వోద్యోగి అయినంత  మాత్రాన తమ ప్రాథమిక హక్కులను పోగొట్టుకోరు.

ఈ చర్చంతా చేసిన జస్టిస్‌ మాధవరెడ్డి, జస్టిస్‌ ము­క్తధర్‌లు చెరబండరాజు, రాజలోచన్‌లను రాజ్యాంగ అధికరణం 311(2)(సి) కింద విచారణ అవసరంలేకుండా ఉద్యోగాల నుంచి తొలగించడం చెల్లదని, ఒక వేళ వారు ఏదైనా క్రమశిక్షణా ఉల్లంఘనలకు పాల్పడ్డారని ప్రభుత్వం భావిస్తే, వారి మీద మరేవయినా అభియోగాలుంటే, వారి మీద చట్టం ఆమోదించిన మేరకు చర్యలు తీసుకోవచ్చునని తీర్పు చెప్పారు. రాష్ట్ర చరిత్రలో ము­ఖ్యమైన ఆ తీర్పు ప్రభుత్వపు నిరంకుశ అధికారానికి చెంపపెట్టు

రాష్ట్రంలో నక్సలైటు ఉద్యమ చరిత్ర చదవదలచుకున్న వాళ్లెవరైనా ప్రభుత్వం పెట్టిన అనేక కుట్ర కేసుల ఛార్జిషీట్లను వరుసగా చదివితే సరిపోతుంది. అంటే విచారణ జరిపి ఛార్జిషీట్లు తయారు చేసిన పోలీసు అధికారులే నక్సలైటు ఉద్యమానికి అధికారిక చరిత్ర కారులన్నమాట. పార్వతీపురం కుట్ర కేసు, హైదరాబాద్‌ కుట్రకేసు, సికింద్రాబాద్‌ కుట్రకేసు, చిత్తూరు కుట్రకేసు, రాంనగర్‌ కుట్రకేసు, బెంగళూరు కుట్రకేసు లాంటి ప్రధానమైన కేసులు తీసుకున్నా నక్సలైటు ఉద్యమ పరిణామాన్ని అవి చిత్రిస్తాయి ­. ఈ కేసులన్నిటితోనూ నాకు సంబంధం ఉంది. వీటిలో సికింద్రాబాద్‌, రాంనగర్‌, బెంగళూరు కుట్ర కేసులను పూర్తిగా నేనే వాదించాను. లేదా నా ఆఫీసులోని సహచరులు వాదించారు. మిగిలిన కేసులలో అప్పుడప్పుడైనా నేను జోక్యం చేసుకున్నాను.

వీటిలో సికింద్రాబాద్‌ కుట్ర కేసు, రాంనగర్‌ కుట్రకేసు సుదీర్ఘ కాలం నడిచిన కేసులు. మొ­దటిది 1974లో మొ­దలై పదిహేను సంవత్సరాలు, రెండోది 1985లో మొ­దలై పదహారు సంవత్సరాలు నడిచాయి.­. సికింద్రాబాద్‌ కుట్రకేసు వాదించడం నాకు 45 ఏళ్ల వయస్సున్నప్పుడు ప్రారంభించాను. చివరి వాదనలు నడుస్తున్నప్పుడు నా వయస్సు అరవై సంవత్సరాలు. న్యాయమూర్తికి ఆ విషయం  చెప్పి ఇప్పటికైనా ఈ కేసును ముగించండి అని కోరాను.
కుట్రకేసుల వాదనలతో నా సంబంధం 1972లో పార్వతీపురం కుట్రకేసుతో మొదలై 2002లో రాంనగర్‌ కుట్రకేసు తీర్పుతో ము­గిసింది. అంటే నా ఐదు దశాబ్దాలకు పైబడిన న్యాయవాద వృత్తిలో మూడు దశాబ్దాలు కుట్రకేసులతోనే గడిచి పోయాయి ­.
నక్సలైటు ఉద్యమాన్ని అణచడానికి ప్రభుత్వం పన్నిన ఒక నిరంతర వ్యూహంలో ఈ కుట్రకేసులు ఒక ము­ఖ్యమైన భాగం. నిజంగా ప్రభుత్వం రూల్‌ ఆఫ్‌ లాను సక్రమంగా అమలు చేసి ఉంటే, తు.చ. తప్పకుండా కట్టుబడి ఉంటే అసలు నక్సలైటు ఉద్యమం పెరిగి ఉండేది కాదని నాకనిపిస్తుంది. రూల్‌ ఆఫ్‌ లా పాటించడమంటే రాజకీయంగా నక్సలైటు ఉద్యమం లేవనెత్తిన సమస్యలేమిటో గుర్తించి వాటిని రాజకీయంగా పరిష్కరించగలమా అని వెతకడానికి ప్రయత్నించడం. రూల్‌ ఆఫ్‌ లా అనే మాటకు సరిగ్గా సరిపోయే మాట ఏమిటని నేను వెతుకుతూ ఉన్నాను. చట్టబద్ధపాలన అని అనువాదం చేస్తున్నారు గాని ఆ మాటతో ఇంగ్లీషు మాటలో ఉన్న అర్థం అంతా కాదు. ఆ చర్చ మరొకసారి చేద్దాం.

రాజ్యాంగంలోనే మార్పుకు కొంచెం స్థలం ఉంది. అం­తే ఆ మార్పును వదిలిపెట్టి రూల్‌ ఆఫ్‌ లాను ధ్వంసం చేయడానికి మొ­దలుపెట్టినారు. ఈ పని ఈ ఒక్క ప్రభుత్వమే చేసిందని కాదు. ప్రపంచ వ్యాప్తంగానే అన్ని ప్రభుత్వాలు, అధికారంలో ఉన్న వాళ్లందరూ అదే మాదిరిగా ప్రవర్తించినారు. సోవియట్‌ కమ్యూనిస్టు పార్టీ కూడా అదేపని చేసింది. అధికారంలో ఉన్న పార్టీ తనపట్ల ఉండే అసమ్మతిని అణచివేస్తుంది. అనేక విధాలా అణచివేస్తుంది.

కె.జి. కన్నబిరాన్
ఆత్మకథాత్మక సామాజిక చిత్రం

అక్షరీకరణ :ఎన్ .వేణుగోపాల్

 

Leave a Reply