Take a fresh look at your lifestyle.

పోలీసులకు స్వీయ క్రమశిక్షణ అవసరం

police need self-discipline
రిజర్వ్ ‌సబ్‌ఇన్‌స్పెక్టర్ల శిక్షణా కార్యక్రమంలో డీజీపీ మహేందర్‌రెడ్డి

సమాజంలో వచ్చే మార్పులకనుగుణంగా తగు విశ్లేషణలతో పౌర సంక్షేమమే ధ్యేయంగా పోలీసులు పనిచేయాలని తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. నిరంతరం పౌరులతో మమేకమవుతూ సేవాభావంతో పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయని అన్నారు. తెలంగాణ పోలీస్‌ అకాడలో శనివారం జరిగిన రిజర్వ్ ‌సబ్‌ఇన్‌స్పెక్టర్ల శిక్షణా కార్యక్రమానికి డీజీపీ మహేందర్‌రెడ్డి ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసింగ్‌ అనేది ప్రతి రోజూ నూతన ఆవిష్కరణలతో చేపట్టాలని, పోలీసులకు స్వీయ క్రమశిక్షణ అవసరమని అన్నారు. ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో అంతర్జాతీయ స్థాయిలో నేరాలు జరుగుతున్నాయని, వీటిని సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు శాస్త్ర సాంకేతిక రంగంలో పోలీస్‌ అధికారులు విజ్ఞాన వంతులు కావాల్సిన అవసరం ఉందని మహేందర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. విషయ పరిజ్ఞానం, నైపుణ్యం, వ్యక్తిత్వ వికాసం, ఐటీ ఆధారిత రంగాలపై నిరంతరం శిక్షణ పొందాలని సూచించారు.

 

పోలీస్‌ ‌శిక్షణ అనేది అత్యంత కఠినంగా కాకుండా ఉల్లాసభరితంగా ఉంటూ దేహదారుఢ్యాన్ని పెంపొందించుకుంటూ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనే విధంగా ఉండాలని అన్నారు. రాష్ట్రపోలీస్‌శాఖలో విజ్ఞానవంతులైన అధికారులు రావాలనే ఉద్దేశంతో సబ్‌ఇన్‌స్పెక్టర్ల ఎంపికలో 5కి.. పరుగు పోటీలపై నిబంధనలు సడలించిన విషయాన్ని డీజీపీ గుర్తుచేశారు. తెలంగాణ పోలీస్‌ అకాడ పోలీస్‌ ‌శిక్షణలో దేశంలోనే అత్యంత ఉన్నత శిక్షణ సంస్థగా ఆయన కితాబునిచ్చారు. స్సెషల్‌ ‌పోలీస్‌ ‌బెటాలియన్‌ అడిషనల్‌డీజీపీ అభిలాస బిస్త్ ‌మాట్లాడుతూ పోలీస్‌శాఖలో మహిళా అధికారులు మరింత మంది రావల్సిన అవసరం ఉందన్నారు. పోలీసులకు వ్యక్తిగత క్రబశిక్షణ అవశ్యకమని అన్నారు. సమాజంలో వస్తున్న మార్పులకనుగుణంగా పోలీస్‌ ‌శిక్షణ ఉండాలని అన్నారు. తెలంగాణ పోలీస్‌ అకాడ డైరెక్టర్‌ ‌జనరల్‌ ‌వీకే సింగ్‌ ‌మాట్లాడుతూ పోలీస్‌ ‌శిక్షణలో పోలీస్‌ అకాడ అంతర్జాతీయ ప్రమాణాలను కలిగి ఉందని తెలిపారు.

Tags: police, self discipline, dgp mahendar reddy, reserve inspectors

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy