Take a fresh look at your lifestyle.

మృతురాలి తండ్రి ని బూటు కాలుతో తన్నిన పోలీస్ 

 
 తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసిన విద్యార్థిని మృతి
మార్చురీ తాళాలు పగులగొట్టి మృతదేహాన్ని తీసుకెళ్లే ప్రయత్నం
 ప్రభుత్వ ఆసుపత్రి వద్ద తీవ్ర ఉద్రిక్తత
 లాఠీచార్జి చేసిన మృతురాలి మార్చురీకి తరలించిన పోలీసులు
కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం తో ప్రాణం కోల్పోయిన తమ కూతురికి న్యాయం జరగాలని పాకులాడిన  తండ్రిని, కర్కశత్వం నిండిన  కానిస్టేబుల్ బూటు కాలుతో తన్నిన సంఘటన బుధవారం పటాన్ చెరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద  తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. రామచంద్రపురం మండలం వెలిమెల గ్రామంలోని నారాయణ జూనియర్ కళాశాలలో స్టూడెంట్ సంధ్యారాణి సూసైడ్ చేసుకున్న సంగతి పాఠకులకు విధితమే. వివరాల్లోకి వెళితే సంధ్యారాణి ఆత్మహత్య చేసుకున్న ఈ విషయాన్ని పసిగట్టిన కళాశాల యాజమాన్యం నలగండ్ల లోని సిటిజెన్ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందడంతో పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మంగళవారం రాత్రి పటాన్ చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా బుధవారం ఉదయం మృతురాలి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో పాటు ఎస్ఎఫ్ఐ టి ఎస్ యు విద్యార్థి సంఘాలు తోడై మార్చురీ తాళాలు పగులగొట్టి, ధర్నా చేయడానికి మృతదేహాన్ని రోడ్డుపై కి తరలించారు. అడ్డొచ్చిన పోలీసులను నెట్టివేస్తూ ప్రభుత్వ ఆసుపత్రి ప్రహరీ దాటి రోడ్డు పైకి చేరుకునే ప్రయత్నం చేశారు. కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే తమ కూతురు చనిపోయిందని స్టూడెంట్ తల్లిదండ్రులు బోరున విలపించారు,  విషయం తెలుసుకున్న డి.ఎస్.పి రాజేశ్వర్ రావు, సిఐలు, ఎస్ఐలు, స్థానిక పోలీసులు హుటాహుటిన ఆసుపత్రికి చేరుకుని, మృతదేహాన్ని ఆస్పత్రిలో కి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో మృతదేహాన్ని తరలించే స్టేచర్ కు స్టూడెంట్ తండ్రి చంద్రశేఖర్ అడ్డుగా పడుకున్నాడు.  కానిస్టేబుల్ శ్రీధర్ మృతురాలి తండ్రి ని బూట్ కాలితో తన్నడంతో ఆస్పత్రి వద్ద పరిస్థితి గందరగోళంగా తయారైంది.
 బాధిత కుటుంబ సభ్యులకు సర్వి చెప్పాల్సిన పోలీసు యంత్రాంగం, ఆ దిశగా ఎలాంటి ప్రయత్నం చేయకుండా, కూతురు కోల్పోయిన బాధలో ఉన్న తండ్రిని మానవత్వం లేకుండా తన్నడం ఎంతవరకు న్యాయమని మృతురాలి బంధువులు, విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. విద్యార్థి సంఘాల నాయకులు, కార్యకర్తలను, మృతురాలి బంధువులను కొట్టేందుకు
పోలీసులు లాఠీఛార్జి చేశారు. మృతురాలి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. విద్యార్థి సంఘాల నాయకులపై పోలీసులు కేసులు నమోదుచేసి, పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల నాయకుల అరెస్టు
విద్యార్థిని కుటుంబానికి న్యాయం జరగాలంటూ యజమాన్యం పోలీసుల తీరును అడ్డుకున్న ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు సందీప్ ప్రధాన కార్యదర్శి రమేష్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవి ఇతర సంఘాల నాయకులను మృతురాలి కుటుంబ సభ్యులను రెచ్చగొట్టే విధంగా గా ప్రయత్నం చేయడంతో పాటు పోలీసులు విధులకు ఆటంకం కలిగించారని అరెస్టు చేసి వారిపై కేసు నమోదు చేశారు.

- Advertisement -

Leave a Reply