Take a fresh look at your lifestyle.

తమ్ముడి మరణాన్ని కూడా చూడలేకపోయిన పోలీస్‌

  • డ్యూటీ కారణంగా వీడియో కాల్‌తో సరిపెట్టుకున్న ఎస్‌ఐ

ఒకపక్క కొరోనా వైరస్‌.. ‌మరోపక్క లాక్‌డౌన్‌. ‌కరోనా వ్యాప్తీఇ చెందకుండా ప్రజలు వీధుల్లోకి రాకుండా పోలీసులు ఊపిరి సల్పని కార్యక్రమాలతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. బందోబస్తు కోసం వెళ్లడం.. ఉన్నచోటే తినడం.. దొరికితే అక్కడే కాసేపు విశ్రాంతి తీసుకోవడం. ఇలాంటి పరిస్థితుల్లో వారు చేస్తున్న సేవలు ప్రపంచాన్ని కదిలిస్తున్నాయి. సొంతిళ్లకు కూడా వెళ్లలేని దుస్థితి ఇప్పుడు అందరికీ అనుభవమే. ఏదైనా అనుకోని ఘటన జరిగితే.. కడసారి చూపులు కూడా కరువవుతున్నాయి. అలాంటి ఘటనే నగరంలోని బంజారాహిల్స్ ‌పోలీస్‌ ‌స్టేషన్‌లో చోటు చేసుకుంది. స్టేషన్‌లో అడ్మిన్‌ ఎస్‌ఐగా పని చేస్తున్న బచ్చు శ్రీనివాస్‌ ‌సోదరుడు రంజీత్‌ ‌కేన్సర్‌తో చనిపోయారు. ఈ విషయం తెలిసి ఎస్‌ఐ శ్రీ‌నివాస్‌ ‌తీవ్ర దుఃఖానికి లోనయ్యారు.

నగరంలో ప్రస్తుతం నెలకొన్ని పరిస్థితులు దృష్ట్యా పోలీసులు అంతా విధుల్లో ఉండాల్సిన పరిస్థితి ఉండటంతో.. ఆయన తన సోదరుడి అంత్యక్రియలకు వెళ్లలేకపోయారు. కస్టేషన్‌కే పరిమితమై తన సోదరుడి అంత్యక్రియలను వీడియో కాల్‌లో చూశారు. తన తమ్ముడికి తుది వీడ్కోలు పలుకుతూ శ్రీనివాస్‌ ‌కన్నీరు మున్నీరవ్వడం అక్కడున్న వారిని తీవ్రంగా కలిచివేసింది. శ్రీనివాస్‌ అం‌కితభావానికి సహ ఉద్యోగులతో పాటు నగర పౌరులు సెల్యూట్‌ ‌చేస్తున్నారు. పోలీసులు ఇంతగా డ్యూటీకి అంకితం అయ్యారనడానికి ఇలాంటి ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇటీవల ఎపిలో ఓ సిఐ తల్లి అంత్యక్రియమలకు కూడా వెళ్లలేకపోయాడు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!