ఢిల్లీ అల్లర్లకు గల కారణాలను, ప్రేరేపించిన శక్తులను గుర్తిస్తున్నారు. ఇప్పటి వరకు ఆప్ కౌన్సిలర్ ,బీమ్ కార్యక్తరలు కూడా రెచ్చగొట్టి అల్లర్లకు కారకులయ్యారని గుర్తించారు. వీరిని గుర్తించి కేసులు పెట్టే పనిలో పోలీసులు పడ్డారు. అఅల్లర్లలో తీవ్రంగా గాయపడి చికిత్సపొందుతున్న వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మరికొందరి ఆచూకీ లేకుండా పోయింది. దీంతోపాటుమృతుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఇప్పటి వరకు 42 మంది ప్రాణాలు కోల్పోయారు. 200కుపైగా మంది గాయపడ్డారు. ఈ నెల 23న ఈశాన్య ఢిల్లీలో సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య జరిగిన ఘర్షణ యావత్ దేశాన్ని కుదిపేసింది. దేశం నలుమూలల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమవు తున్నాయి. అల్లర్లు జరిగి నాలుగు రోజులు గడిచినప్పటికీ.. ఢిల్లీవాసులు ఘటన నుంచి ఇంకా తేరుకోలేకపోతున్నారు. భయం గుప్పిట్లోనే బతుకుతూ ఇళ్లకే పరిమితమైన ప్రజలు బయటకు వస్తున్నారు. ఢిల్లీ అల్లర్ల నేపథ్యంలో కేంద్ర •ంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవాస్తవను ఢిల్లీ శాంత్రిభద్రతల ప్రత్యేక కమిషనర్ గా నియమించింది. శ్రీవాస్తవ ఆదివారం బాధ్యతలు చేపడతారు. ఢిల్లీ అల్లర్ల వ్యవహారంలో ఇప్పటి వరకు 48 ఎఫ్ఐఆర్లను నమోదు అయ్యాయి. ఢిల్లీ అల్లర్లపై ఎంక్వైరీ వేగవంతం చేసినట్లు సిట్ తెలిపింది. అల్లర్లకు గల కారణాలను, అల్లర్ల కారకులైన వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని సిట్ అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే పలువురు నిందితులు తమ అదుపులో ఉన్నారని, వారి నుంచి తుపాకీలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. తమ ప్రాథమిక అంచనాల ఆధారంగా విచారణ చేస్తామని సిట్ అధికారులు పేర్కొన్నారు.
ఢిల్లీలో పరిస్థితి కుదుటపడుతోందని.. అనవసర వదంతులను ఎవరూ నమ్మవద్దని కేంద్ర •ంమంత్రి అమిత్ షా అన్నారు. పోలీసు ఉన్నతాధికారులతో సమావేశమై పరిస్థితిని సక్షించారు. ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ ఈస్ట్ ఢిల్లీలో పర్యటించారు. అల్లర్లు జరిగిన పలు ప్రాంతాలు పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి ఘర్షణ అనంతర పరిస్థితులను అగిడి తెలుసుకున్నారు. ప్రజలంతా సంయమనంతో ఉంటాలని ఎల్జీ పిలుపునిచ్చారు. అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి ఉండాలన్నారు. అల్లర్ల నేపథ్యంలో సున్నిత ప్రాంతాలైన ఢిల్లీ -ఘజియాబాద్ సరిహద్దుల్లో భారీ సాయుధ పోలీసుబలగాలను మోహరింపజేశారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుజాగ్రత్త చర్యగా యూపీ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఘజియాబాద్ నగరాన్ని 18 సెక్టార్లు, 56 జోన్లుగా విభజించి ఆయా ప్రాంతాల్లో గస్తీ కోసం ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలను రంగంలోకి దించారు.నలభై రెండు మంది ప్రాణాలను బలిగొన్న ఢిల్లీ అల్లర్లకు మూల కారణం ఏమిటి? అంటే.. క్షేత్రస్థాయి పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు భీం ఆర్మీ కవ్వింపు చర్యలే.. ఈ ఘర్షణలకు దారి తీసి 42 మంది ప్రాణాలు పోవడానికి కారణమయ్యాయని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చినట్టు సమాచారం. భీం ఆర్మీ ఢిల్లీ విభాగానికి నేతృత్వం వహి స్తున్న హిమాన్షు వాల్మీకి కూడా ఇలా పిలుపునిచ్చినవారిలో ఉన్నారన్నారు. అయితే.. పోలీసులు తమపై చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని భీం ఆర్మీ జాతీయ అధ్యక్షుడు వినయ్ రతన్‌సింగ్ కొట్టిపారేశారు. తమ సభ్యులెవరూ హింసకు పాల్పడలే దన్నారు. హింసను ప్రేరేపించడంలో కపిల్‌మిశ్రా పాత్రనూ పోలీసులు కొట్టి పారేయలేదు. వీడియోలన్నీ పరిశీలించాక కోర్టుకు నివేదిస్తామని తెలిపారు.
- దిల్లీ మెట్రో చౌక్‌లో మళ్లీ కలకలం
- ‘గోలీ మారో’ నినాదాలు
ఢిల్లీలోని రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్లో శనివారం కొంతమంది వ్యక్తులు ’దేశద్రోహులను కాల్చిపారేయండి..అంటూ నినాదాలు చేయడం కలకలం రేపింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. గతంలో ఇదే నినాదం సీఏఏ ఆందోళనకారులకు వ్యతిరేకంగా బీజేపీ నేతలు అనురాగ్ ఠాకూర్,కపిల్ మిశ్రాలు చేశారు. తాజా ఘటనపై ఢిల్లీ మెట్రో రైల్ కార్పోరేషన్ ఓ ప్రకటన విడుదల చేసింది. మెట్రో పరిసరాల్లో శనివారం ఉదయం 10.50గంటలకు కొంతమంది వ్యక్తులు ఆ నినాదాలు చేసినట్టు వెల్లడించింది. వెంటనే అప్రమత్తమై వారిని పోలీసులకు అప్పగించినట్టు తెలిపింది. నినాదాలు చేసినవారు కాషాయ దుస్తులు ధరించినట్టు తెలుస్తోంది. ఢిల్లీ మెట్రో చట్టం 2002 ప్రకారం మెట్రో పరిసరాల్లో ఎలాంటి ప్రదర్శనలు, న్యూసెన్స్ చేయరాదు. ఎవరైనా అలాంటి చర్యలకు పాల్పడితే మెట్రో పరిసరాల నుంచి వారిని పంపించేస్తారు.
ఇదిలా ఉంటే,గురువారం హర్యానాలోని గురుగ్రాంలో హిందూసేన కార్యకర్తలు కూడా ’దేశద్రోహులను కాల్చిపారేయండి’ అని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. సివిల్ లైన్స్, గురుద్వార్ రోడ్, సర్దార్ బజార్లలో నిర్వహించిన ర్యాలీల్లో ఈ నినాదాలు చేశారు.ఢిల్లీ అల్లర్లు చల్లబడిన రెండు రోజులకే గురుగ్రామ్‌లో ఈ ఘటన చోటు చేసుకోవడం.. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం చర్చనీయాంశంగా మారింది. కాగా, కేంద్ర సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్.. ఢిల్లీ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న సందర్భంగా ’దేశ ద్రోహులను కాల్చిపారేయండి’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మరో బీజేపీ నేత కపిల్ మిశ్రా నేత్రుత్వంలో సీఏఏకి మద్దతుగా ఢిల్లీలో నిర్వహించిన ర్యాలీలో ఇదే నినాదాలు చేశారు. వీరితో పాటు బీజేపీ నేతలు పర్వేష్ వర్మ,అభయ్ వర్మలు కూడా వివాదాస్పద ప్రసంగాలు చేశారు. ఢిల్లీ అల్లర్ల పిటిషన్లపై విచారణ సందర్భంగా.. ఈ నలుగురి విద్వేషపూరిత ప్రసంగాలను కోర్టులో హాలులోనే న్యాయమూర్తి మురళీధర్ ప్రదర్శించారు.ఇలాంటి రెచ్చగొట్టే ప్రసంగాలు చేసిన వారిపై ఎందుకు కేసులు బుక్ చేయడం లేదని ప్రశ్నించారు. క్రై జరిగిందనడానికి ఇంతకన్నా సాక్ష్యం ఏ కావాలని జస్టిస్ మురళీధర్ ఢిల్లీ పోలీసులను నిలదీశారు.