జన్నారం, సెప్టెంబర్3, (ప్రజాతంత్ర విలేఖరి) : ఇటీవల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టుల కదలికలు మళ్లి ప్రారంభవడంతో జన్నారం మండలంలోని హాస్టల్ తండా, అల్లినగర్, దొంగపెళ్ళి, లోతొర్రే అడవుల్లో లక్షేటిపేట సి.ఐ నారాయణ్ నాయక్ ఆధ్వర్యంలో ఎస్సై మధుసూదన్ రావు, పోలీస్ సిబ్బందితో కలిసి గురువారం రోజున నక్సల్స్ కోసం ముమ్మరంగా గాలింపు చేపట్టారు.ఈ సందర్భంగా సి.ఐ నారాయణ్ నాయక్ గిరిజనులతో మాట్లాడుతూ మావోయిస్టులకు ఎవరు కూడా సహకరించకూడదని, వారికి ఆశ్రయం కల్పించకూడదని తెలిపారు. ఒకవేళ ఎవరైనా వారికి సహకరిస్తే వారిఫై చట్టరీత్య కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.లక్షేటిపేట సి.ఐ నారాయణ్ నాయక్, ఎస్సై మధుసూదన్ రావు సిబ్బంది పాల్గొన్నారు.