Take a fresh look at your lifestyle.

మహాపాదయాత్రను అడ్డుకున్న పోలీసులు

  • ప్రకాశం జిల్లాలో ఉద్రిక్తత
  • పోలీసుల చర్యను తీవ్రంగా ఖండించిన లోకేశ్‌
  • ఎన్ని అవాంతరాలు వొచ్చిన పాదయాత్ర ఆగదన్న గొట్టిపాటి
  • రైతుల పాదయాత్రతో ప్రభుత్వంలో వణుకు పుట్టిందన్న అచ్చన్న

ఒంగోలు, నవంబర్‌ 11 : ‌ప్రకాశం జిల్లాలో కొనసాగుతున్న రైతుల మహాపాదయాత్ర ఉద్రిక్తంగా మారింది. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా.. అమరావతి రైతుల మహాపాదయాత్ర కొనసాగుతోంది. ఈ యాత్రలో గురువారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. చదలవాడ వద్ద రైతులపై పోలీసులు లాఠీఛార్జ్ ‌చేశారు. ఈ క్రమంలో సంతనూతలపాడుకు చెందిన రైతు నాగార్జున చేయి విరిగింది. పోలీసులు రాజధాని రైతులపై లాఠీ ఛార్జ్ ‌చేస్తున్నారని చుట్టూ పక్కల గ్రామాలకు తెలిసిందో… ఆ చుట్టుపక్కల గ్రామాల నుండి రైతులు, ప్రజలు, మహిళలు సైతం వేల సంఖ్యలో వచ్చి అమరావతి రైతులకు మద్దతుగా నిలిచారు. పోలీసుల తీరుకు రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడికక్కడ పోలీసులు విధిస్తున్న ఆంక్షల నడుమే పాదయాత్ర సాగుతోంది.

రైతులు చేస్తున్న పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు వస్తున్న స్థానికులను పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో వారిపై పోలీసులు లాఠీఛార్జ్ ‌చేశారు. అయినప్పటికీ పోలీసులు అడ్డుపెట్టిన తాళ్లను నెట్టుకుని మరీ స్థానికులు ముందుకు వచ్చారు. అమరావతి రైతులకు సంఘీభావం ప్రకటించేందుకు వస్తే అడ్డుకోవడానికి రెవరంటూ పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. పోలీసులను నెట్టుకుంటూ ముందుకు వెళ్లి మరీ రైతులకు స్థానికులు సంఘీభావం తెలిపారు. చదలవాడ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. పోలీసుల లాఠీఛార్జ్‌లో పలువురు గాయపడినట్లు సమాచారం.  ప్రకాశం జిల్లా నాగులుప్పల పాడులో రాజధాని రైతుల మహాపాదయాత్ర 11వ రోజుకు చేరుకుంది.

ఈ రోజు ఉదయం పాదయాత్ర శిబిరం వద్దకు చేరుకున్న జిల్లా పోలీస్‌ ‌యంత్రాంగం… ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మోడల్‌ ‌కోడ్‌ ఆఫ్‌ ‌కండక్ట్ అమల్లో ఉన్నందున ఇతరులు పాదయాత్రలో  పాల్గొన కూడదని ఆదేశాలు జారీ చేశారు. రాజధాని ప్రాంతానికి చెందిన 157 మంది రైతులు మాత్రమే పాదయాత్రలో పాల్గొనాలని పోలీసులు తెలిపారు. ఈ మేరకు అమరావతి జేఏసీ నేతలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. కాగా పోలీసుల నోటీసులపై జేఏసీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్టీలకతీతంగా సాగుతున్న యాత్రకు తమకు నోటీసులు ఎలా ఇస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. పార్టీలకు సంబంధించిన వారికి నోటీసులు ఇవ్వకుండా తమకు నోటీసు ఇవ్వడమేంటని జేఏసీ నేతలు ఆందోళన వ్యక్తం చేసారు. నాగులుప్పలపాడు మండలం చదలవాడ వద్ద రైతుల మహాపాదయాత్రలో పోలీసుల లాఠీఛార్జ్‌పై  టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ ‌స్పందించారు. పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న వారిపై పోలీసులు లాఠీఛార్జ్ ‌చెయ్యడం దారుణమన్నారు.

పోలీసుల దాడిలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలని డిమాండ్‌ ‌చేశారు. న్యాయస్థానాల ఉత్తర్వులను ధిక్కరిస్తూ ఉద్యమకారులపై లాఠీఛార్జ్ ‌చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలన్నారు. న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకూ అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్ర జగన్‌ ‌సర్కారుకి కంటిద కునుకు లేకుండా చేస్తోందని ఆయన తెలిపారు. పోలీసుల్ని ప్రయోగించి పాదయాత్రకి అడుగడుగునా ఆటంకాలు కల్పించడం న్యాయమా?  అని ప్రశ్నించారు. హైకోర్టు అనుమతితో చేస్తున్న పాదయాత్రకి ఖాకీల ఆంక్షలు ఎందుకో? అని నిలదీశారు. ఎండనక, వాననక  ఏడుకొండలవాడి సన్నిధికి పాదయాత్రగా వెళ్తుంటే, వారికి సంఘీభావం తెలపడమూ నేరమా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కవరేజ్‌కి వచ్చిన డియా ప్రతినిధుల్ని ఎందుకు ఆపుతున్నారని అడిగారు. పలువురు పాత్రికేయులను పోలీసులు అడ్డుకోవడాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని లోకేష్‌ అన్నారు.  అధ్యక్షులు అచ్చెన్నాయుడు యెద్దేవా చేశారు. మహాపాదయాత్ర రాజకీయ యాత్రకాదు..భావితరాల భవిష్యత్‌ ‌యాత్ర అని అన్నారు. రాజధాని మార్పుపై ఇచ్చిన మాటను తప్పినందుకు జగన్‌ ‌సహా వైసీపీ నేతలందరూ సిగ్గుతో తలదించుకోవాలన్నారు. పోలీసులను అడ్డం పెట్టుకుని పాదయాత్రను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఎన్నికల కోడ్‌ ఆపాదించి అడ్డుకోవడం న్యాయస్థానం ఆదేశాలను ధిక్కరించడమే అని ఆయన పేర్కొన్నారు. అధికార దాహంతో జగన్‌ ‌పాదయాత్ర చేస్తే.. రాష్ట్రం కోసం రైతులు పాదయాత్ర చేస్తున్నారని తెలిపారు.

జగన్‌ ‌రెడ్డి చేసిన మోసానికి వైసీపీకి చెందిన రైతులు కూడా బోరుమంటున్నారన్నారు. పాదయాత్రను ప్రజల ముందుకు తీసుకెళ్తున్న డియాపైనా పోలీసులు అహం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. రాజధానిపై వైసీపీ చేసిన ఆరోపణలన్నీ నిరాధారమయ్యాయని అచ్చెన్నాయుడు అన్నారు. ప్రభుత్వం ఎంత భయభ్రాంతులకు గురిచేసినా రాజధాని కోసం రైతులు చేపట్టి మహా పాదయాత్ర  ఆగదని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ ‌స్పష్టం చేశారు. ఇది రైతు ప్రజా పాదయాత్ర అని అన్నారు. రాజధానిని చంపేద్దామని పాదయాత్రను అడ్డుకోవడం మంచి పద్ధతి కాదన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని ముఖ్యమంత్రి జగన్‌ ‌కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఇటువంటి కక్ష సాధింపు ప్రభుత్వాన్ని ఇంత వరకు చూడలేదన్నారు.

Leave a Reply