Take a fresh look at your lifestyle.

దిల్లీలో విద్యార్థులపై పోలీసు లాఠీ! శాంతి ర్యాలీకి అనుమతి నిరాకరణ

వివిధ విద్యార్థి సంఘాల సభ్యులతో కూడిన యంగ్‌ ఇం‌డియా కోఆర్డినేషన్‌ ‌కమిటీ మంగళవారం దేశ రాజధానిలో నిర్వహించిన శాంతి ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. అరెస్ట్‌లు చేశారు. విద్యార్థులకు కొట్టారు. మీడియాలో మాట్లాడనివ్వలేదు. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా, ఈశాన్య ఢిల్లీలో మతఘర్షణలకు •కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా కమిటీ ఈ ర్యాలీకి పిలుపునిచ్చింది. విద్యార్థి సంఘాల కమిటీ ర్యాలీకి అనుమతి కోసం ఫిబ్రవరి 27న ఢిల్లీ పోలీసులకు దరఖాస్తు ఇచ్చింది. అయితే ఢిల్లీ పోలీసులు చివరి నిమిషంలో తమకు అనుమతి నిరాకరించారని ర్యాలీకి నాయకత్వం వహించిన మాజీ జెఎన్‌యు స్టూడెంట్స్ ‌యూనియన్‌ అధ్యక్షుడు ఎన్‌ ‌సాయి బాలాజీ తెలిపారు. అయితే ఢిల్లీ పోలీసులు శాంతి ర్యాలీకి అనుమతి ఇవ్వకున్న విద్యార్థులు తెగించి నినాదాలు చేస్తూ రామ్‌లీలా మైదానం నుంచి పార్లమెంటు వరకు వెళ్లడానికి ప్రయత్నం చేశారు.

దీనితో విద్యార్థులు ఎక్కడ కనిపిస్తే అక్కడ వారిని పోలీసులు అడ్డుకుని అరెస్ట్ ‌చేశారు. చిన్న చిన్న సమూహాలుగా విద్యార్థులు సమావేశమైనప్పటికీ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. చాలామంది రామ్‌ ‌లీలా మైదాన్‌ ‌దగ్గరే అరెస్టు కాగా, కొంతమంది వేరే మార్గాల ద్వారా జంతర్‌మంతర్‌ ‌వద్దకు వచ్చి తమ నిరసనగళం వినిపించారు. అరెస్ట్ ‌చేసిన విద్యార్థుల పట్ల పోలీసుల వ్యవహార శైలి అమానుషంగా ఉంది. అరెస్టయిన విద్యార్థులు మీడియాలో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు, కొట్టి వారి నోరు మూయించడానికి పోలీసులు గట్టి ప్రయత్నం చేశారు. మీడియా ఎదురుగానే విద్యార్థులకు కొడుతూ పోలీసులు కనిపించారు.

Tags: Police baton, students in Delhi, Denial of permission, peace rally

Leave a Reply