Take a fresh look at your lifestyle.

తిరుపతిలో చెడ్డీ గ్యాంగ్‌ ‌కదలికలపై పోలీసుల అలర్ట్

అన్ని పోలీస్‌ ‌స్టేషన్లను అప్రమత్తం చేసిన అధికారులు
తిరుపతి,అక్టోబర్‌ 6: తిరుపతిలో చెడ్డీ గ్యాంగ్‌ ‌టెన్షన్‌ ‌పెరుగుతోంది. నగరంలో చెడ్డీ గ్యాంగ్‌ ‌కదలికలు ఎక్కువగా ఉండటంతో.. పోలీసు శాఖ అప్రమత్తమైంది. ఉన్నతాధికారులు అన్ని పీఎస్‌లకు అలర్ట్ ‌మెసేజ్‌లు పంపారు. చెడ్డీ గ్యాంగ్‌ ‌కోసం 6 ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టినట్టు తెలిపారు ఏఎస్పీ మునిరామయ్య. డీఎస్పీ నేతృత్వంలో 6 బృందాలు పనిచేస్తాయని, అపార్ట్‌మెంట్‌లో ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తిరుపతి నగరంలోని విద్యా నగర్‌కాలనీలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో మూడు రోజుల క్రితం చెడ్డీ గ్యాంగ్‌ ‌చోరీకి యత్నించింది. అయితే ఆ ఇంట్లో ఏ దొరక్కపోవడంతో ఈ గ్యాంగ్‌ ‌వెనుదిరిగింది.

కానీ సీసీ ఫుటేజీలో కనిపించిన ఈ గ్యాంగ్‌ ‌దృశ్యాలు నగర వాసులను కలవరానికి గురిచేశాయి. చెడ్డీ గ్యాంగ్‌లో ఉన్న వారు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ‌గుజరాత్‌ ‌రాష్టాల్రకు చెందిన వారుగా పోలీసులు అనుమానిస్తున్నారు. వీరు రైళ్లలో నగరానికి వచ్చి.. రాత్రి వేళల్లో దొంగతనాలకు పాల్పడు తున్నట్లు గుర్తించారు. నిర్మానుష్య ప్రాంతాలు, సంపన్నుల కాలనీలు, ఖరీదైన అపార్ట్ ‌మెంట్లు ఈ గ్యాంగ్‌ ‌టార్గెట్‌. ఒక ఏరియాలో దొంగతనం చేసిన తరువాత.. మళ్లీ ఆరు నెలలపాటు ఆ ప్రాంతం వైపు వెళ్లరు. దేశంలోని అనేక రాష్టాల్లో్ర ఈ చెడ్డీగ్యాంగ్‌లపై కేసులు నమోదయ్యాయి. చెడ్డీ గ్యాంగ్‌ ‌చోరీలతో అప్రమత్తమైన పోలీసులు.. దుండగుల కోసం గాలిస్తున్నారు.   అలాగే అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌ను పెట్టుకోవాలని, రాత్రిపూట వాచ్‌మెన్‌ ‌విధులు నిర్వహించేలా చూడాలని ప్రజలను కోరుతున్నారు.

Leave a Reply