Take a fresh look at your lifestyle.

రాష్ట్ర సరిహద్దు జిల్లాల్లో పోలీసుల అప్రమత్తం

  • దాడిలో మృతి చెందిన అమరజవాన్లకు కేంద్ర హోం మంత్రి అమిత్‌ ‌షా నివాళి
  • 24 మంది జవాన్లకుగాను 14మంది మృతదేహాలు లభ్యం?

ఛత్తీస్‌గఢ్‌ ‌దండకారణ్యంలో మావోయిస్టు పార్టీ అనుబంధ దండకారణ్య పీఎల్‌జీఏ పీపుల్స్ ‌లిబరేషన్‌ ‌గెరిల్లా ఆర్మీ బెటాలియన్‌ ‌జరిపిన భీకర దాడిలో చనిపోయిన జవాన్ల సంఖ్య 24కు చేరింది. ఛత్తీస్‌గఢ్‌ ‌రాష్ట్రంలోని బీజాపూర్‌ ‌జిల్లా తెర్రం పోలీస్‌స్టేషన్‌ ‌పరిధిలోని జొన్నగూడ అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కాల్పుల ఘటనతో ఛత్తీస్‌గఢ్‌, ‌తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, ఒడిశా ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. సరిహద్దుల్లో హైఅలెర్ట్ ‌ప్రకటించాయి. తెలంగాణలో ములుగు, భదాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. దాడి గురించి తెలియగానే తెలంగాణ పోలీసులు, గ్రేహౌండ్స్, ‌స్పెషల్‌ ‌పార్టీలు ఉమ్మడి ఖమ్మం, వరంగల్‌, ‌కరీంనగర్‌, ఆదిలాబాద్‌ ‌జిల్లాల సరిహద్దుల్లో విస్తృతంగా కూంబింగ్‌ ‌నిర్వహిస్తున్నారు. పలుచోట్ల ప్రత్యేకంగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో కొత్త వ్యక్తుల కదలికలపై నిఘా పెంచారు. ఇక నక్సల్స్ ‌దాడిలో అమరులైన జవాన్లకు కేంద్ర హోం మంత్రి అమిత్‌ ‌షా, ఛత్తీస్‌గఢ్‌ ‌సీఎం భూపేష్‌ ‌భగేల్‌ ‌నివాళులర్పించారు. జవాన్ల పార్థివదేహాల వద్ద పుష్పాంజలి ఘటించి, రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. జగదల్‌పూర్‌లో 14 మంది అమర జవాన్ల మృతదేహాలను ఉంచారు. అయితే నక్సల్స్ ‌దాడిలో మొత్తం 24 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోగా, ఇప్పటి వరకు 14 మంది జవాన్ల మృతదేహాలు లభ్యమయ్యాయి. జవాన్లపై దాడి జరిగిన ప్రాంతాన్ని అమిత్‌ ‌షా పరిశీలించారు. బీజాపూర్‌ ‌సుక్మా జిల్లాల సరిహద్దును పరిశీలించి, సవి•క్ష నిర్వహించారు. చికిత్స పొందుతున్న జవాన్లను అమిత్‌ ‌షా పరామర్శించారు. మావోయిస్టుల మెరుపుదాడిలో 24 మంది జవాన్లు మరణించగా 31 మంది గాయపడ్డారు. మృతుల్లో ఏపీకి చెందిన మురళీ కృష్ణ, జగదీశ్‌ ఉన్నారు. వీరు కోబ్రా 210 దళంలో పనిచేస్తున్నారు. బీజాపూర్‌, ‌సుక్మా జిల్లాల సరిహద్దుల్లో మోస్ట్ ‌వాంటెడ్‌ ‌మావోయిస్టు హిడ్మా ఉన్నాడన్న సమాచారంతో డీఆర్‌జీ, స్పెషల్‌ ‌టాస్క్‌ఫోర్స్, ‌సీఆర్‌పీఎఫ్‌, ‌కోబ్రా బలగాలు శుక్రవారం రాత్రి నుంచి కూంబింగ్‌ ‌నిర్వహిస్తున్నాయి. భద్రతా బలగాల కోసం హిడ్మా నేతృత్వం లోని పీపుల్స్ ‌లిబరేషన్‌ ‌గెరిల్లా ఆర్మీ(పీఎల్‌జీఏ) సిల్గేరీ అటవీ ప్రాంతంలో గుట్టలపై మాటు వేసింది. శనివారం మధ్యాహ్నం బలగాలు అక్కడికి రాగానే మెరుపు దాడి చేసింది. అనంతరం మావోయిస్టులు పోలీసుల దగ్గర నుంచి 20కి పైగా ఆయుధాలను ఎత్తుకెళ్లారు. మావోయిస్టులే తప్పుడు సమాచారం ఇచ్చి భద్రతా దళాలు అడవిలోకి వొచ్చేలా పథకం పన్ని ఉంటారని భావిస్తున్నారు. అయితే ఈ వార్తలను సీఆర్‌పీఎఫ్‌ ‌డీజీపీ కుల్‌దీప్‌ ‌సింగ్‌ ‌కొట్టిపారేశారు. ఘటనలో ఇంటలిజెన్స్ ‌వైఫల్యం లేదన్నారు. నక్సలైట్లలో కూడా 10-12 మంది చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. వీరు జవాన్లపై దాడిలో మావోయిస్టులు మెషీన్‌ ‌గన్‌లను, బాంబులను ప్రయోగించారు. దీంతో జవాన్లు అప్రమత్తమయ్యేలోపే భారీ ప్రాణనష్టం జరిగింది.

మావోయిస్టుల్లో ఓ మహిళ తప్ప మిగతా మరణాలకు సంబంధించిన సమాచారం. అధికారికంగా తెలియరాలేదు. తాజా ఘటనతో మృతి చెందిన వారిలో.. ఎనిమిది మంది కోబ్రా, ఆరుగురు ఎస్‌టీఎఫ్‌ ‌జవాన్లుకాగా, 8 మంది డీఆర్‌జీ, ఒకరు బస్తర్‌ ‌బెటాలియన్‌ ‌జవాన్‌ ఉన్నారు. మరో 30 మంది జవాన్లు గాయపడ్డారు. ఇందులో 12 మంది పరిస్థితి విషమంగా ఉంది. వారిని ప్రత్యేక హెలికాప్టర్లలో రాయ్‌పూర్‌కు తరలించగా.. మిగతా 18 మందికి బీజాపూర్‌ ‌జిల్లా హాస్పిటల్‌లో చికిత్స అందిస్తున్నారు. మరో ఇద్దరు జవాన్ల ఆచూకీ లేకుండా పోయినట్టు సమాచారం. వారి కోసం గాలింపు చర్యలు సాగుతున్నాయి. ఘటనా స్థలం తెలంగాణలోని భదాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల సరిహద్దు నుంచి సుమారు 70 కిలోవి•టర్ల దూరంలో ఉంది. చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌, ‌సుక్మా జిల్లాల సరిహద్దుల్లోని జొన్నగూడ, టేకులగూడెం, జీరాగాన్‌, ‌గోండేం, అల్లిగూడెం అటవీ ప్రాంతాల్లో మావోయిస్టులు భారీగా సమావేశమయ్యారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో బీజాపూర్‌ ‌జిల్లాలోని తెర్రం నుంచి 760 మంది, ఊసూరు నుంచి 200 మంది, పామేడు నుంచి 195 మంది, సుక్మా జిల్లాలోని మినఫా నుంచి 483 మంది, నర్సాపురం నుంచి 420 మంది.. మొత్తంగా 2,058 మంది డీఆర్‌జీ, ఎస్టీఎఫ్‌, ‌సీఆర్‌పీఎఫ్‌, ‌కోబ్రా, బస్తర్‌ ‌బెటాలియన్‌ ‌విభాగాల జవాన్లు.. ఈ నెల 2న రాత్రి బృందాలుగా విడిపోయి కూంబింగ్‌ ఆపరేషన్‌ ‌చేపట్టారు. జొన్నగూడ అటవీ ప్రాంతంలో.. జేగురుకొండ దండకారణ్య పీఎల్‌జీఏ బెటాలియన్‌ ‌కమాండర్‌ ‌హిడ్మా ఆధ్వర్యంలోని మావోయిస్టులు దాడి చేశారు.

ముందుగా మందుపాతరలు పేల్చి, తర్వాత రాకెట్‌ ‌లాంచర్లతో దాడికి దిగారు. దీంతో బలగాలు ఎదురుకాల్పులకు దిగాయి. ఇక్కడ శనివారం ఐదుగురు జవాన్ల మృతదేహాలు, ఒక మహిళా మావోయిస్టు మృతదేహం లభించాయి. మిగతావారి ఆచూకీ కోసం అధికారులు గాలింపు చేపట్టారు. అదృశ్యమైన జవాన్లలో పలువురి మృతదేహాలు జొన్నగూడ సవి•పంలోని అటవీ ప్రాంతంలో ఉన్నట్టు ఎలక్టాన్రిక్‌ ‌వి•డియాలో ఆదివారం పొద్దున 10 గంటల సమయంలో ప్రసారమైంది. దాంతో పెద్ద ఎత్తున ప్రత్యేక పోలీసు బలగాలు ఆ ప్రాంతానికి చేరుకుని మృతదేహాలను మొదట తెర్రం పోలీస్‌ ‌స్టేషన్‌కు, అక్కడి నుంచి జిల్లా కేంద్రానికి తరలించాయి. సుమారు 650 మందికిపైగా మావోయిస్టులు, మిలీషియా సభ్యులు గుట్టలపై నుంచి విచక్షణారహితంగా కాల్పులకు దిగినట్టు అంచనా. గణపతి తర్వాత మావోయిస్టు పార్టీ బాధ్యతలు చేపట్టిన నంబాల కేశవరావు ఈ దాడికి ప్రణాళిక రచించి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. చత్తీస్‌గడ్‌ ‌మోస్ట్ ‌వాంటెడ్‌గా ఉన్న కేశవరావుది మొదటి నుంచీ దూకుడుగా ఉండే మనస్తత్వమని.. పార్టీకి పునర్వైభవం తేవడం, దండకాణ్యంలో ఆధిపత్యం సాధించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాడని పోలీసులు చెప్తున్నారు.

Leave a Reply