Take a fresh look at your lifestyle.

తోటపల్లి శివారులో పేకాట..

  • 11మంది పేకాట రాయుళ్ల అరెస్ట్, ఇద్దరు పరార్‌..
  • ‌రూ.56,415 నగదు స్వాధీనం
  • తోటపల్లి శివారులో పేకాట ఆడుతూ పోలీసులకు చిక్కిన పేకాటరాయుళ్లు

సిద్ధిపేట పోలీస్‌ ‌కమిషనరేట్‌ ‌పరిధిలోని బెజ్జంకి పోలీస్‌ ‌స్టేషన్‌ ‌పరిధిలో గల తోటపల్లి గ్రామ శివారులోని మామిడి తోటలో పేకాట ఆడుతున్న శిబిరం బెజ్జంకి ఎస్‌ఐ ‌వై.కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో దాడి చేసి పేకాట ఆడుతున్న 11మందిని అరెస్టు చేశారు. వారి నుంచి 56వేల 415రూపాయల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు.  వివరాల్లోకి వెళ్లితే…తోటపల్లి  గ్రామ శివారులో ముద్దాల  నర్సయ్య మామిడి తోటలో షెడ్‌ ‌వద్ద కొంత మంది డబ్బులు పెట్టి పేకాట ఆడుతున్నారన్న పక్కా సమాచారంతో ఎస్‌ఐ ‌కృష్ణారెడ్డి తన సిబ్బందితో కలిసి దాడి చేయగా పేకాట ఆడుతున్న  13 మంది వ్యక్తులు పేకాట ఆడుతూ కనిపించారు. పోలీసులను చూసి ఇద్దరు పారిపోయారు. పట్టుబడిన 11మంది నుంచి 56వేల 415రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. కాగా, ముద్దాల నర్సయ్య తన మామిడి తోట షెడ్‌లో రోజుకు వెయ్యి రూపాయలు తీసుకుని పేకాట ఆడిస్తున్నందుకు ముద్దాల నర్సయ్య(తోటపల్లి)తో పాటు పేకాట ఆడుతున్న గుడెల్లి మల్లేశం  (గునుకుల కొండాపూర్‌), ‌బోయినపల్లి శ్రీనివాసరావు(తోటపల్లి), కైరోజు శేఖర్‌(‌గుండ్లపల్లి),బోనగిరి సురేష్‌(‌రేణికుంట), తాళ్లపల్లి అనిల్‌(‌గుండ్లపల్లి), మామిడి సాగర్‌(‌గొల్లపల్లి), దయ్యాల ఐలేష్‌ (‌తోటపల్లి),పొలవేని రాములు(తోటపల్లి),నాంపల్లి శంకర్‌(‌తోటపల్లి),చిగుర్ల శ్రీనివాస్‌(‌గొల్లపల్లి)ని అరెస్టు చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.

Leave a Reply