Take a fresh look at your lifestyle.

నిజామాబాద్‌ ఎమ్మెల్సీగా కవిత నామినేషన్‌

  • 84 ‌శాతం మేర వోట్ల బలంతో గెలుపు సునాయాసం
  • కరీంనగర్‌, ఆదిలాబాద్‌ ‌జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్‌

‌ప్రజాతంత్ర, హైదరాబాద్‌ : ‌నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎన్నికలకు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కల్వకుంట్ల కవిత నామినేషన్‌ ‌దాఖలు చేశారు. ఆమె స్వయంగా మంగళవారం కలెక్టర్‌ ‌కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, నిజామాబాద్‌ ‌కలెక్టర్‌ ‌నారాయణరెడ్డికి నామినేషన్‌ ‌పత్రాలు సమర్పించారు. కవిత వెంట మంత్రి ప్రశాంత్‌ ‌రెడ్డి, ఆర్టీసీ చైర్మన్‌ ‌బాజిరెడ్డి గోవర్ధన్‌ ‌తదితరులు ఉన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ స్థానిక సంస్థలను బలోపేతం చేస్తున్న ఘనత సిఎం కెసిఆర్‌దన్నారు.

అనేక కార్యక్రమాలు చేపట్టి గతంలో ఎన్నడూ లేనివిధంగా వాటికి నిధులు కేటాయించడం జరిగిందన్నారు. కవిత గెలుపు లాంఛనమే.. నిజామాబాద్‌, ‌కామారెడ్డి జిల్లాలో 824 ఓటర్లకు గాను 84 శాతం మేర బలంతో టీఆర్‌ఎస్‌ ‌పార్టీ గెలుపు సునాయాసంగా మారింది. స్థానిక సంస్థల పోరులో కాంగ్రెస్‌, ‌బీజేపీ పార్టీలకు బలం లేకపోవడంతో పోటీకి వెనుకడుగు వేసినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే బీజేపీ నుంచి పోటీ చేసేందుకు ఎవరు సుముఖత వ్యక్తం చేయకపోవడంతో బీజేపీ నుంచి నామినేషన్లు దాఖలయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఇదిలా ఉండగా కాంగ్రెస్‌ ‌పార్టీ సైతం ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు నిజామాబాద్‌లో కాంగ్రెస్‌ ‌నేతలు ప్రకటించారు. ఈ క్రమంలో టీఆర్‌ఎస్‌ ‌పార్టీ అభ్యర్థి కవిత గెలుపు లాంఛనప్రాయం కానున్నది.

కరీంనగర్‌, ఆదిలాబాద్‌ ‌జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్‌
‌కరీంనగర్‌ ‌స్థానిక సంస్థ ఎమ్మెల్సీ స్థానాలకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు టీ భానుప్రసాద్‌ ‌రావు, ఎల్‌ ‌రమణ మంగళవారం కలెక్టర్‌ ‌కార్యాలయంలో నామినేషన్లు దాఖలు చేశారు. అంతకు ముందు కరీంనగర్‌లోని పద్మనాయక కళ్యాణ మండపంలో టీఆర్‌ఎస్‌ ‌నాయకులు, ప్రజా ప్రతినిధులు సమావేశమయ్యారు. ఇద్దరు అభ్యర్థుల నామినేషన్‌ ‌ఫారాలు ఇక్కడే తయారు చేశారు. అనంతరం భానుప్రసాద్‌, ‌రమణ మంత్రి కొప్పులతో కలిసి నామినేషన్‌ ‌వేశారు.

ఇక ఉమ్మడి ఆదిలాబాద్‌ ‌జిల్లా స్థానిక సంస్థల టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి దండే విఠల్‌ ‌మంగళవారం నామినేషన్‌ ‌దాఖలు చేశారు. మంత్రి ఇంద్రకరణ్‌ ‌రెడ్డి, ఎమ్మెల్యే జోగు రామన్నతో కలిసి ఆదిలాబాద్‌ ‌జిల్లా కలెక్టర్‌ ‌సిక్తా పట్నాయక్‌కు నామినేషన్‌ ‌పత్రాలను అందజేశారు. అంతకుముందు ఎమ్యెల్యే క్యాంప్‌ ‌కార్యాలయంలో ఉమ్మడి ఆదిలాబాద్‌ ‌జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, ముఖ్యనాయకులు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి దండే విఠల్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave a Reply