Take a fresh look at your lifestyle.

కవిత్వానికీ కావాలి ‘క్వారంటైన్‌’!

‌కవిత్వానికి ఇటీవలే ‘కరోనా’ సోకింది !
తెలియకుండానే అది సాహిత్య ప్రపంచమంతా పాకింది!
ఇప్పుడు ఎటు చూసినా ఒకటే భయం ! హాహాకారాలు!
ఈ ఆపద నుండి బయటపడడం ఎలా అన్నఆందోళన !
‘కండూతి’ అనే ప్రయోగశాల నుండి ఈ వైరస్‌ ‌కట్టు తెంచుకుని బయటకు వచ్చింది!
ఈ అపరిపక్వ భూతాన్ని అడ్డకోవడం ఎలా అన్నదే ఇప్పుడు
అందరి మనసులనూ తొలుస్తున్న సమస్య !
భావాన్ని మింగేస్తోంది,- శిల్పాన్నీ మింగేస్తోంది ,
‘ధ్వని’ కి విలువ లేనేలేదు !
ఉన్నవన్నీ ‘రణగొణధ్వనులే’!
అర్థాల కోసం గాలింపు చర్యలు చేపడితే
వ్యర్థాలే ఎక్కువగా ఎదురుపడుతున్నాయి !
అర్థం ఎక్కడో అజ్ఞాతవాసం చేస్తోంది !
పదచిత్రాలు ఈ భూత ప్రతాపానికి ప్రాణాలు కోల్పోయి శవాల గుట్టలుగా పేరుకుపోతున్నాయి !
పదాలు తమను మిస్‌ ‌ఫైర్‌ ‌చేయవద్దని కవి గారి పాదాల వద్ద పడిగాపులు పడుతున్నాయి !
పాఠకుని ఆరోగ్యం పెద్ద ప్రమాదంలో పడింది !
అర్జెంట్‌గా లాక్‌ ‌డౌన్‌ ‌ప్రకటించాల్సిన అవసరం ఇప్పుడు వచ్చిపడింది !
వ్యయప్రయాసలకు ఓర్చుకొనైనా సరే
త్వరగా దీనికి ఒక వ్యాక్సిన్‌ను కనిపెట్టి తీరాలి !!
– గుండెబోయిన శ్రీనివాస్‌
99851 94697

- Advertisement -

Leave a Reply