Take a fresh look at your lifestyle.

పోడు బతుకులు

ఇక్కడే పుట్టాం!
ఈ కొండా కోనల్లో మమేకమై ఇక్కడే పెరిగాం!
రేపు ఈ మట్టిలోనే
కొన్ని రేణువుల్లా కలిసిపోతాం.
ఈ పచ్చని తల్లితో మాది మ (గ)ట్టి బంధం.

తరతరాలుగా ఈ అడవి తల్లే
తను నిలువునా కాలిపోతూ
మా కడుపు మంటలను చల్లార్చుతుంది.

ఇన్నేళ్లుగా కొన’సాగు’తున్న
ఈ తల్లి బిడ్డల బంధమిపుడు
సక్రమం కాదంటే
ఏ కొండ దేవరకు మొరపెట్టుకోవాలి?

‘పోడు’తోనే
మా తల్లి ఉనికి మాయమైపోతే
మణుల(ఖనిజాల) కోసం
తన అణువణువు తూర్పారబడితే
రేగిన ధూళిలో
మా తల్లిని ఎక్కడని వెతకాలి?

నిజమే!
నాగరికతకు ఆవలే ఉన్నాం.
కానీ దాని పునాది రాళ్ళు ఇక్కడివేగా?
పై పూతల మెరుపులెరుగని
స్వచ్ఛమైన బతుకు బడి మాది!

బతుకు పోరులో
గిరులలో, తరులలో
తలదాచుకునే తండా వాసులం!
మా హక్కుల కోసం తండ్లాడుతున్న
అడవి తల్లి వారసులం!!

 – సింగారపు రాజయ్య
ఇల్లందు, 9945744332

Leave a Reply