Take a fresh look at your lifestyle.

జర నజరెయ్యిండ్రి సార్లూ.. పోచమ్మ కుంటను పొతం బెడుతుండ్రు..!

రెవెన్యూ, ఇరిగేష•న్‌ అధికారులు ఏం జేస్తుండ్రు..
కట్టడాలతో బారాన మందం గాయబ్‌..
‌పట్టించుకోకుంటే ఉన్నది గూడ ఊడ్చేస్తరు..

‘చెరువులు, కుంటలు అలుగులు(మత్తడి దుంకాలె) వారాలే..ఒక్క గజం జాగాను గూడా కబ్జా గానియ్యం’ ఇది అన్నది ఎవరో గాదు సాక్షాత్తూ సీఎం •కేసీఆర్‌• ‌మాటలివి. గీడ గా ముఖ్యమంత్రి మాటలు గూడ నీటి మూటలైతున్నయ్‌.. ‌మత్తడి దుంకుడు గాదుకదా ఉన్న కుంటల మట్టిబోసి ఇండ్లు గడుతుండ్రు.. పీర్జాదిగూడ పరిధిలోని పోచమ్మ కుంట దినానికింత గాయబ్‌ అయ్యి ఎర్కవట్టలేకుంట అయితున్నది..గా జాగల ఇండ్లు కడ్తనే ఉండ్రు.. అయినా ఆపీసర్లు, లీడర్లు కళ్ళతోని జూస్కుంట గూడ సప్పుడుజేస్తలేరని అక్కడోళ్ళు గరమైతున్నరు. ఉన్నదన్న కాపాడుండ్రంటున్నరు.

మేడిపల్లి మండలంలోని పీర్జాదిగూడ బల్దియా పరిధిలో ఉన్న పోచమ్మ కుంట రోజుకింత దగ్గరికైతున్నది. పీర్జాదిగూడ, పర్వతాపూర్‌ ‌రెవెన్యూ భూములు సుమారు 24 ఎకరాలలో పోచమ్మ కుంట విస్తరించి ఉండేది. కానీ నేడది ఆరు ఎకరాలు కూడా లేకపోవడం గమనార్హం. కుంటకు సంబంధించిన సదరు భూమిలో పట్టాదారులైనా, శిఖం భూమి అను భవదారులైనా వ్యవసాయానికి మాత్రమే వినియోగించాలి. ఇందులో ఎటువంటి క్రయవిక్రయాలు జర• •కూడదు. ఏలాంటి పక్కా నిర్మాణాలు చేయకూడదని నిబంధనలు స్పష్టంగా ఉన్నా అవి తమకు పట్టవంటూ పాతరేస్తున్నరు. బాహాటంగా మట్టితో నింపి అమ్ముకుంటూ కుంట ఆనవాళ్లు లేకుండా చేస్తున్నా అధికారులు అటువైపు కన్నెత్తైనా చూడకపోవడం విడ్డూరం. సంబంధిత శాఖలకు చెందిన అధికారులకు వారి వారి స్థాయి బట్టి ముడుపులు చెల్లించి క్రయవిక్రయాలు, ఇండ్ల నిర్మాణాలు చేస్తున్నారనే ఆరోప ణలున్నాయి. ప్రభుత్వం నీటి వనరుల సంరక్షణకు మిషన్‌ ‌కాకతీయ పథకం కింద పూడిక తీతలు చేపడుతుంటే ఇక్కడ అందుకు భిన్నంగా పూడ్చివేతలకు పాల్పడుతున్నా,

ఇందులో ఇండ్ల నిర్మాణాలు చేపడుతున్నా సంబంధిత అధికారులు మిన్నకుండడం అనుమా నాలకు తావిస్తోందని స్థానికులు చెవులు కొరుక్కుంటున్నారు. ఇందులో ప్లాట్ల రూపంలో స్థలం కొన్నవారు అనుమతులు తీసుకుని ఇండ్ల నిర్మాణాలు చేపడుతూ సొమ్ము చేసుకుంటున్నారని, దీంతో కుంట పరిమాణం రోజురోజుకు ఇంతింత తరిగిపోతూనే ఉంది. నగరం విస్తరిస్తూ రోజురోజుకు భూముల విలువ అంతకంతకు పెరిగిపోతుండడం, ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడి ప్రదేశాలకు వలసలు పెరగడంతో చెరువులు, కుంటల పరిసరాల్లో ఉన్న స్థలాలకు కూడా డిమాండ్‌ ‌వచ్చింది. ఇతర పట్టా భూములకంటే ఇక్కడ కొంత తక్కువ ధరలకు స్థలాలు దొరుకుతుండడంతో కొనుగోలుదారులు ఎగబడుతున్నారు. దీనిని ఆసరా చేసుకున్న పరిసరాల్లో భూములు ఉన్న వారు కొందరు మట్టి నింపి అనువైన ప్రాంతాలుగా చూపిస్తూ అమ్ముకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్నో సంవత్సరాల సుధీర్ఘ చరిత్ర ఉన్న పోచమ్మకుంట స్థలంలో ఈ ఆరేడేళ్ళలోనే ఎక్కువ భాగం ఇండ్లు వెలిశాయని ఇప్పటికీ రోజుకో కట్టడం వెలుస్తోందని స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా భూగర్భ జలాల సంరక్షణకు ఎంతో దోహదపడుతున్న చెరువులు, కుంటల్లోకి మట్టిని నింపి అక్రమంగా అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, కుంట మిగులు స్థలానికి పకడ్బందీగా ఫెన్సింగ్‌ ‌వేయాలని పలువురు డిమాండ్‌ ‌చేస్తున్నారు.

ఈ కుంటతో పాటు మండల పరిధిలోని మేడిపల్లి ఊర చెరువు, పీర్జాదిగూడ గూడెం చెరువు, బోడుప్పల్‌లోని సుద్దకుంట, ఆల్మాస్‌కుంట, పీర్ల కుంట, చెన్నాయ్‌ ‌కుంట, పటేల్‌కుంట, చాకలిగండి, రాచెరువు, చెంగిచర్లలోని పోచమ్మ కుంట తదితర చెరువులన్నీ కబ్జాదారుల చేతిలో చిక్కి శల్యమైపోయాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ చెరువులను పరరక్షించాల్సిన రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులు, భూకబ్జాదారులకు సహకరించడం వల్లే చెరువులు, కుంటలు కాలగర్భంలో కలిసిపోయాయని పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ చెరువులు, కుంటల్లో కొన్ని కనుమరుగవగా, మరి కొన్ని కొద్దిపాటి ఆనవాళ్లతో మరుగుకాలువల మాదిరిగా దర్శనమిస్తున్నాయి. ఈ కారణంతో పలు చోట్ల భూగర్భ జలాలు ఇంకిపోయి వేలాది అడుగుల లోతు బోర్లు వేసినా నీటి ఆనవాళ్లు అగుపడకపోవడం నిదర్శనం. పెద్ద వర్షాలు వచ్చినప్పుడు లోతట్టు ప్రాంతాలు వరద నీటితో నిండిపోయి ముంపుకు గురవడం తరచూ జరుగుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు మేల్కోని ఉన్న కొద్దిపాటి చెరువుల మిగులు భూములనైనా సంరక్షించడం బాధ్యతగా గుర్త్తెరగాలి. లేదంటే భవిష్యత్తు తరాలకు తీరని అన్యాయం చేసినవారమవుతాం.

Leave a Reply