Take a fresh look at your lifestyle.

బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం లో ‘పీ ఎం ఓ ..?

* ప్రచారం కోసం బి జె పీ దుర్వినియోగం 
* ఖాతరు చేయని రాజ్యాంగం సెక్షన్ 123/7
* వినిపించని ‘నారద ..శారదా ..’నినాదాలు 
* బీజేపీ లో అవినీతి ఆరోపణలున్న తృణమూల్ నాయకులు 
ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి ,న్యూ దిల్లీ :
పశ్చిమ బెంగాల్ ఎన్నికలు అంటే బీజేపీ శారదా..నారదా..అని అర్తనాదాలు చేయాలి కదా..మరి బీజేపీ ఎందుకు శారదా..నారదా..అని జరగబోయే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం లో ఒక్కసారి కూడా అనటం లేదు ..? 40 ఏళ్ళ క్రితం ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వ అధికారులను, ప్రభుత్వ ఆస్తిని అధికారం లో ఉన్న రాజకీయ పార్టీ లేదా వ్యక్తులు ఎన్నికల ప్రచారం కోసం దుర్వినియోగం చేస్తే  తప్పు అని చెప్పే రాజ్యాంగం సెక్షన్ 123/7 ఇప్పుడు లేదా..? సెక్షన్ 123/7 ను కొట్టేశారా..?
ప్రధాన మంత్రి మోడీ కోల్ కత్తా  బ్రిగేడ్ గ్రౌండ్ 7 వ తారీఖు  ర్యాలీ కోసం సంసిద్ధం అవుతున్నారు. ఈ ర్యాలీ కోసం ఢిల్లీ అధికారగణం రంగంలోకి దిగి మరీ ఏర్పాట్లు చేస్తున్నది. ఈ ర్యాలీ ద్వారా ఎన్నికల కన్నా ముందే మమతా బెనర్జీ ఓడిపోయింది అనే మెసేజ్ మొత్తం బెంగాల్ ప్రజలకి ఇవ్వాలి అన్న లక్ష్యంతో ప్రధాన మంత్రి  మోడీ ఈ ర్యాలీకి ఏర్పాట్లు చేయిస్తున్నారు.బెంగాల్ ఎన్నికలలో  ఇరవై ర్యాలీలు ప్రధాని మోడీ చేయనున్నారు అని తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పీఎంఓ అధికారులు బెంగాల్ లో మకాం వేస్తున్నారు. మరో వైపు అన్నిపార్టీల నాయకులు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఎన్నికలలో తమ అదృష్టం పరీక్షించుకునే పనిలో పడ్డారు.
ఇందిరా ఎమర్జెన్సీ పెట్టడానికి తెరపై కనిపించే కారణం ఆమెను అలహాబాద్ హైకోర్ట్ దోషిగా తీర్పునివ్వటం.1971 రాయబరేలి పార్లమెంట్ ఎన్నికలలో ఇందిరా గాంధీ ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వ అధికారులను, ప్రభుత్వ వసతులను వాడుకుంది అని అలహాబాద్ హైకోర్ట్ అభిప్రాయ పడింది.ఇలా ప్రభుత్వ నిధులను వాడుకోవటం భారత రాజ్యాంగం సెక్షన్ 123/7 ప్రకారం తప్పు అని ఈ నేరం చేసినందుకు ఇందిరా గాంధీ ఎన్నిక చెల్లదు అని అలహాబాద్ హైకోర్ట్ జడ్జి జాగ్ మోహన్ లాల్   సిన్హా తీర్పు ఇచ్చారు. రాజ్యాంగంలో ఈ సెక్షన్ ఇంకా కొట్టి పారేయలేదు. అయినా ప్రధాని మోడీ బెంగాల్ ర్యాలీల ఏర్పాట్లలో పీఎంఓ అధికారులు చురుకుగా పాల్గొంటున్నారు. నలభై ఏళ్ళ క్రితం పనిచేసిన రాజ్యాంగం చట్టం సెక్షన్ 123/7 ప్రస్తుతం ముసలిది అయిపోయి ఏం చేయలేకపోతున్నది.
ఇక మరో ఇంటర్వ్యూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ NDTV కి ఇచ్చింది. ఇందులో నితిన్ గడ్కరీ ఇలా అన్నారు “మా పార్టీలోకి వచ్చిన వాళ్ళు పవిత్రం అవుతారు. మా పార్టీలోకి వచ్చాక.. మా పార్టీ అలవాట్లు అలవర్చుకున్నాక.. మాలాగే మంచివాళ్ళుగా మారిపోతారు”  మరి మమతా బెనర్జీ మీ పార్టీని వాషింగ్ మిషన్ అంటున్నారు, దీనిపై ఏమంటారు..? అని ప్రశ్నించగా  నితిన్ గడ్కరీ సమాధానం “ఒకవేళ మమతా బెనర్జీ ఆలా చెప్పి ఉంటే ఆమె సత్యం చెప్పారు. ఎవరు ఎక్కడి నుంచి బీజేపీలోకి వచ్చినా.. మా పార్టీలో పునీతులు అయి మంచివాళ్ళుగా మారతారు. ఈ విషయంలో చరిత్ర సాక్షిగా నిలిచింది” నితిన్ గడ్కరీ ఈ మాటలు విన్న  తర్వాత దేశంలో అసలు ఇన్ని పార్టీలు ఎందుకు..? ఇన్ని పార్టీలు లేకుండా ఒక్క బీజేపీనే ఉంటే దేశంలో అవినీతినే ఉండదు అనే భావం కలిగితే దేశ డెమొక్రసీ పదం మన దేశ డిక్షనరీ లోంచి తీసేసుకుందాం. ఇక ఈ సారి పశ్చిమ బెంగాల్ ఎన్నికల వలన పరమ పవిత్రులు కానున్న రాజకీయ నాయకులు ఎవరో చూద్దాం..
పశ్చిమ బెంగాల్ ముగ్గురు సీనియర్ రాజకీయ నాయకులు ముకుల్ రాయ్, సువేందు అధికారి మరియు సోవన్ ఛటర్జీ. ఈ ముగ్గురు గతంలో తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) నాయకులు..ఆ పార్టీ కి  పార్టీకి నిధులు సమకూర్చే ఉద్దండులు అని పేరుగడించిన మహారధులు.అంతే కాదు శారదా..నారద..చిట్ ఫండ్ కుంభకోణం స్టింగ్ ఆపరేషన్ లో పట్టుబడి ఆయా కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు. వీరు ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ బీజేపీ నాయకులు. వీరు తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) విడిచి బిజెపిలోకి చేరగానే బీజేపీ ముఖ్యమైన పదవులు కట్టబెట్టింది.
2014 నుండి 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో పశ్చిమ బెంగాల్ ఎన్నికలకి సంబంధించి  తృణమూల్ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బిజెపి శారదా, నారద చిట్ ఫండ్ కుంభకోణాలను ప్రధాన  రాజకీయ ఆయుధంగా వాడింది. నారద స్టింగ్ ఆపరేషన్ 2016 అసెంబ్లీ ఎన్నికలకు ముందే వెలుగులోకి వచ్చింది. కానీ ఇప్పుడు ఈ శారదా, నారద చిట్ ఫండ్ కుంభకోణాలలో ఉన్న రాయ్, అధికారి, ఛటర్జీలను బిజెపిలోకి రావటం పవిత్రులుగా మారిపోవటం చిటికెల్లో జరిగిపోయింది. ఈ సంఘటన తర్వాతే బీజేపీ అవినీతిని పవిత్రం చేసే “వాషింగ్ మెషిన్” అని మమతా దీదీ పేర్కొన్నారు. బిజెపి బెదిరింపుల ద్వారా తన పార్టీని విచ్ఛిన్నం చేసిందని మమతా బెనర్జీ ఆరోపిస్తున్నారు. అయితే బీజేపీ వంటి పార్టీలు రికార్డ్స్  చూపి బెదిరించే తప్పులు తన పార్టీ నాయకులు టీఎంసీలో ఉంటూ చేస్తూవుంటే మరి మమతా దీదీ చూస్తూ ఎందుకు ఉపేక్షించారో.. ఆ కలకత్తా కాళీకి ఎరుకే. అవును మరి ఉపేక్షించకపోతే పార్టీకి నిధులు ఎక్కడినుంచి వస్తాయి. అందుకే దీదీ ఎన్నికల సమయంలో ఇలా “వాషింగ్ మెషిన్” డైలాగ్స్ చెబుతారు తప్పులు జరుగుతున్నప్పుడు పార్టీ ఫండ్ లెక్కిస్తూ చూసి చూడనట్టు ఊరుకుంటారు. ఈ మొత్తం “వాషింగ్ మెషిన్” ఉతుకుడు పవిత్రత గురించి బీజేపీ చెప్పే మాట ముకుల్ రాయ్, సువేందు అధికారి మరియు సోవన్ ఛటర్జీల అభియోగాలను ఎత్తివేయలేదని చట్టం తన పని తానూ చేసుకుపోతుందని బిజెపి జోక్యం చేసుకోదు.
శారదా, నారద చిట్ ఫండ్ కేసుల్లో ముకుల్ రాయ్, సువేందు అధికారి మరియు సోవన్ ఛటర్జీ ప్రధాన నిందితులు. శారదా కేసుపై జరిగిన దర్యాప్తులో సిబిఐ రాయ్‌ను పలుసార్లు విచారించింది. డిసెంబర్ 23 నాడు సుప్రీంకోర్టులో సిబిఐ దాఖలు చేసిన పిటిషన్ ప్రకారం, “శారదా గ్రూప్ పోంజీ కంపెనీల” నుండి ఎన్నికల టీఎంసీ కోసం నిధులను పోగు చేసినవాడిలో రాయ్ ప్రధాన పాత్ర పోషించారు.  అక్టోబర్ 2013 లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన పిటిషన్ లో కునాల్ కుమార్ ఘోష్ (తృణమూల్ నాయకుడు) సమక్షంలో M / s శారదా పోంజీ కంపెనీల ప్రమోటర్ సుదీప్తా సేన్, M / s ఆల్కెమిస్ట్ గ్రూప్ ప్రమోటర్ కెడి సింగ్ పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు నిధులు సమకూర్చారని తెలుస్తుంది. ఈ విషయాన్ని ఓ డిజిటల్ మీడియా పోర్టల్ రిపోర్ట్ చేసింది.
నారద చిట్ ఫండ్ కుంభకోణంకి సంబంధించి గత ఏడాది సిబిఐ దర్యాప్తులో సువేందు అధికారి పేరు వుంది. నారదా చిట్ ఫండ్ కుంభకోణం స్టింగ్ ఆపరేషన్ లో టీఎంసీ ఎంపీలు,మంత్రులతో సహా డజను మంది సీనియర్ తృణమూల్ నాయకులను లంచం తీసుకుంటున్నట్లు సిబిఐ చూపింది. సువేందు అధికారిపై చార్జిషీట్ దాఖలు చేయడానికి అనుమతి కోరుతూ 2019 ఏప్రిల్‌లో లోక్‌సభ స్పీకర్‌కు సిబిఐ విజ్ఞప్తి చేసింది, టిఎంసి ఎంపిలు కకోలి ఘోష్ దస్తిదార్, సౌగతా రాయ్, ప్రసున్ బెనర్జీలపై అభియోగాలు నమోదు చేశారు. అదే సమయంలో, ఛారజీ, శారదా మరియు నారద కేసులకు సంబంధించి సిబిఐ మరియు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) దర్యాప్తు ముమ్మరం చేసి సువేందు అధికారిని రెండు ఏజెన్సీలు పలుసార్లు ప్రశ్నించాయి. ఈ రెండు కేసుల్లోనూ సోవన్ ఛటర్జీ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

 

Leave a Reply