కరోనా వైరస్‌పై ఎవరూ ఆందోళన చెందొద్దని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కరోనా నియంత్రణకు వివిధ మంత్రిత్వ శాఖలు, రాష్టాల్రు కలిసికట్టుగా సమన్వయంతో పని చేయాలన్నారు మోదీ. కరోనా వైరస్ వ్యాప్తిపై అధికారులతో సక్షించానని ట్విట్టర్లో ప్రధాని పేర్కొన్నారు. ఇతర దేశాల నుంచి వచ్చే వ్యక్తులకు ఎప్పటికప్పుడు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి.. సరైన వైద్యాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని మోదీ స్పష్టం చేశారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున తన ట్విట్టర్ అకౌంట్ ను మహిళలకే అంకితమిస్తున్నట్లు మోదీ చెప్పారు. ప్రేరణాత్మకంగా నిలిచిన మహిళల కథనాలను ఆ రోజున ట్వీట్ చేయనున్నారు. లక్షలాది మంది మహిళలకు ఈ కథనాలు ప్రేరణగా నిలుస్తాయని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. కు అలాంటి మహిళల కథనాలు తెలిస్తే తమకు షేర్ చేయాలని ప్రధాని సూచించారు.