Take a fresh look at your lifestyle.

ప్రధాని మోడీ ప్రసంగం…కొన్ని ప్రశ్నలు..!

Aruna
అరుణ, న్యూఢిల్లీ

మంగళ వారం రాత్రి 8 గంటలకు కొరోన వైరస్ విస్తరణ నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలు సూచిస్తూ దేశ ప్రజలనుద్దేశిస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడి చేసిన ప్రసంగం కొన్ని ప్రశ్నలను,అనుమానాలను కలిగిస్తుంది.ఎప్పటి లాగే ప్రజల ఒడిలో నిరాశను పడేసి పాజిటివ్ గా ఉండమని ఉచిత సలహా ఇచ్చినట్లు గా కొనసాగింది ప్రధాన మంత్రి మోడి ప్రసంగం. ప్రజలు సమాజ హితం కోసం..తమ కోసం తీసుకోవలసిన జాగ్రత్తలు వివరించారు కాని విపత్తు నివారణ లో తమ ప్రభుత్వం ఏ చర్యలు చేబడుతుందో ఆయన ప్రసంగంలో లేదు..పైగా కొన్ని ప్రశ్నలను మన ముందుంచింది..అందులో..మురికివాడలో 10 మందితో ఒక చిన్న గదిను పంచుకునే వ్యక్తి సంపూర్ణ నిర్బంధాన్ని ఎలా ఆశిస్తున్నారు..?  మాన్యువల్ స్కావెంజర్‌కు సామాజిక దూరాన్ని పాటించమని ఎలా చెబుతున్నారు..? ..రోజుకు ఒక భోజనం కోసం కష్టపడుతున్న ఆదివాసీకి.. శానిటైజర్లకు ప్రాధాన్యత ఇవ్వమని ప్రధాని ఎలా సలహా ఇవ్వగలుగుతున్నారు..? దగ్గు  వచ్చినప్పుడు పాటించాల్సిన మర్యాద గురించి క్షయవ్యాధి నుండి బయటపడినవారికి ఎలా అవగాహన కల్పిస్తారు?  భారతదేశంలో ఇప్పటివరకు ప్రభలంగా వినిపిస్తున్న నెరేటివ్ లాక్డౌన్లను అమలు చేయడం లేదా సామాజిక దూరం, స్వీయ నిర్బంధం, చేతి పరిశుభ్రత, దగ్గు మర్యాదలను ప్రోత్సహించడం గురించి.  రాజకీయ ఆప్టిక్స్, ప్రజల అవగాహన, అంతర్జాతీయ ఒత్తిడితో నడిచే ఈ చర్యలు ముఖ్యమైనవే.. కాని ఈ నెరేటివ్ లో వర్గ పక్షపాతం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది.

 

సమాజంలోని అట్టడుగు వర్గాల వారిని కలుపుకొని పోవటానికి ఈ అంటువ్యాధి ఒక అవకాశాన్ని ఇచ్చింది …యావద్దేశం ఆలోచిస్తున్నది కరోనా వైరస్ గురించే ..ఈ కష్టకాలంలో ఒకరి కష్టం గురించి మరొకరు అర్థం చేసుకోవటనికి పూర్తి అవకాశం ఉంది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ప్రభావవంతమైన ప్రసంగం చేయగలరు..మంగళ వారం ప్రసంగంలో అసంఘటిత రంగంలో పనిచేస్తున్న 80 శాతం ప్రజల గురించి ..వారికోసం ప్రధానిగా ఆయన ఏం చేస్తున్నారో.. చెబితే ఆయా కార్మికులలో ప్రభుత్వం మా కోసం కూడా ఉంది అన్న భరోసా ఇవ్వగలిగే వారు. ఆ ప్రస్తావన చేయక పోగా..   ఇదే సమయంలో మధ్యతరగతి దిగువ తరగతి మధ్య ఒక చక్కటి స్నేహబంధం పెనవేసుకునే లాగా చేసే ఓ మంచి అవకాశాన్ని ప్రధాన మంత్రి పోగొట్టుకున్నారు.  కేవలం త్రిశంకు స్వర్గంలో వుండే మధ్య తరగతి గోడే ప్రధాన మంత్రి మోడి ప్రసంగంలో వినిపించింది.

 

భారతదేశం దాని స్థానిక పరిస్థితి మేరకు ప్రపంచ దేశాల నుంచి పాఠాలను నేర్చుకుని చేపట్టాల్సిన చర్యలను ఎందుకు చేయకూడదు..?
ప్రపంచ దేశాలు తమ పౌరులకు ఈ సమయంలో అండదండగా ఉంటూ ఎన్నో ప్యాకేజీలను ప్రకటిస్తున్నాయి.. మరి మనం ఎందుకు ప్రకటించడం లేదు..? పోషకాహార లోపం ఉన్న రోగి, కరోనా వ్యాధి బారిన పడినప్పుడు ఏమి జరుగుతుంది? పట్టణ మురికివాడలలో, కరోనా సోకిన వ్యక్తి నుండి వ్యాప్తి జరిగితే ప్రభుత్వం ఏమి చేయనుంది..?  మురికి వాడలలో ఏ ప్రజారోగ్య చర్యలు చేస్తారు..?  చేతి శానిటైజర్లకు తక్కువ ధరికి ఎలా అందిస్తుంది ప్రభుత్వం..? ఆరోగ్య వ్యవస్థల లోటు పూరించడానికి ప్రభుత్వం ఏమి చేయనుంది..?     ప్రజలకు ఈ కష్ట కాలంలో సంరక్షణను అందించడానికి లాభాలతో నడిచే ప్రైవేట్ హెల్త్ కేర్   సిస్టమ్ వారి మెడలు వంచి కార్పొరేట్ హాస్పిటల్ లను భాగస్వాములను చేసి వారితో ప్రభుత్వం ప్రజా సేవ ఎలా చేయించనున్నది.. ఈ ఈ ప్రశ్నలకు ప్రధాన మంత్రి సమాధానం చెబుతారని ప్రజలు ఆశగా ఎదురు చూసారు. వాస్తవానికి ప్రధాన మంత్రి చేసిన పాజిటివ్ సూచన  అలా ఉండడం..ఆలోచించడం ఈ దేశలోని ప్రతి కార్మికుని డిఎన్ఎ లో ఉంది..!!

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!