- దేశ రక్షణ విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదు
- సైనికుల త్యాగాలను వృధా కానివ్వం
- సిఎంల వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని మోడీ ప్రకటన
- రెండు నిముషాలు మౌనం పాటించి నివాళి
భారతదేశ సార్వభౌమాధికారాన్ని కాపాడడంలో ఎలాంటి రాజీలేదని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. భారతదేశం
ఎల్లవేళలా శాంతినే కోరకుంటుందని, అయితే సార్వభౌమాధికారం కోసం ఎలాంటి రాజీ ఉండదని ఘాటుగానే హెచ్చరించారు. చైనా దుగరం కారణంగా అమరులైన సైన్యం త్యాగాలు వృధా కానివ్వబోమన్నారు. సరిహద్దుల్లో చైనా సైన్యం చేస్తున్న దాష్టీకాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం స్పందించారు. దేశ రక్షణ కోసం అమరులైన 20 మంది జవాన్ల వీరత్వం ఏమాత్రం వృథా పోదని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. భారత్ ఎప్పటికీ శాంతినే కోరుకుంటోందని, అయితే రెచ్చగొడితే మాత్రం సరైన, దీటైన జవాబు చెప్పడానికి తాము ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉన్నామన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన హెచ్చరించారు. తమకు దేశ ఐక్యత, సార్వభౌమత్వం చాలా ముఖ్యమైన అంశాలని స్పష్టం చేశారు. చైనా సైనికులతో సరిహద్దుల్లో పోరాడుతూ వీర మరణం పొందిన సైనికులను చూసి దేశం ఎంతో గర్విస్తోందని మోదీ అన్నారు. బుధవారం పలు రాష్ట్రాల ముఖ్యమంత్రుల తో వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో పాల్గొన్న మోదీ.. లేచి నిలబడి రెండు నిమిషాల మౌనం పాటించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న •ం మంత్రి అమిత్ షా, సీఎంలు కూడా అమర జవాన్లకు నివాళులు అర్పించారు. అమర జవాన్ల త్యాగాన్ని చూసి దేశం గర్విస్తోందని మోదీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. మన జవాన్ల త్యాగం వృథా కాదని దేశానికి హా ఇస్తున్నాను. భారత్ సార్వభౌమాధికారంపై రాజీ పడే ప్రసక్తే లేదు. భారత్ శాంతిని కోరుకుటుందని.. కానీ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే అందుకు తగ్గ సమాధానం ఇవ్వగలదని భారత ప్రధాని మోడీ చైనాను గట్టిగా హెచ్చరించారు. మరోవైపు తూర్పు లద్దాఖ్‌లో నెలకొన్న పరిస్థితులపై చర్చించేందుకు మోదీ శుక్రవారం సాయంత్రం 5 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించనున్నట్టుగా సమాచారం. కాగా, తూర్పు లద్దాఖ్‌లోని గాల్వన్ లోయ ప్రాంతంలో సోమవారం రాత్రి భారత్-చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది జవానులు వీర మరణం పొందిన విషయం తెలిసిందే. భారత్ ఎలాంటి వివాదాలను కోరుకోదు. రెచ్చగొడితే సైలెంట్‌గా ఉండబోం. దీటుగా బదులిచ్చే విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గం. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు దేశం సిద్ధంగా ఉందని’ మోదీ పేర్కొన్నారు. ప్రధాని మోడీతో పాటు వివిధ రాష్ట్రాల సిఎంలు కూడా నివాళి అర్పించారు.